Vizag Sri Erukumamba Temple: శిరస్సు లేని ఈ అమ్మవారికి పసుపు నీళ్లతో మొక్కులు తీర్చుకుంటే చాలు
Spirituality: అమ్మవారికి సహజంగా పసుపు,కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఈ అమ్మవారికి మాత్రం బిందెడు పసుపు నీళ్లు సమర్పిస్తే చాలు..ఏకోరిక అయినా నెరవేరిపోతుందట...
Vizag Sri Erukumamba Temple: ఏ ఆలయానికి వెళ్లినా కళ్లారా అమ్మవారు లేదా అయ్యవారి రూపం కళ్లారా చూసి నమస్కారం చేస్తారు. కానీ విశాఖలో ఉన్న ఎరుకుమాంబ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఆ ప్లేస్ లో ఓంకారం కనిపిస్తుంది. మరి తల కనిపించదా అంటే..కనిపిస్తుంది అమ్మవారి పాదాల దగ్గర. కేవలం బిందెండు పసుపునీళ్లు సమర్పించుకుంటే చాలు భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.
ఆదిశక్తికి రూపాలెన్నో
ఆది పరాశక్తిగా పిలుచుకునే అమ్మవారికి చాలా రూపాలున్నాయి. ఒక్కో గ్రామంలో అమ్మవారు ఒక్కో రూపంలో కొలువై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించగా..మరికొన్ని ప్రాంతాల్లో స్వయంభువుగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవార్లు ఉన్నారు. అలాంటి అమ్మవారు కొలువైన ఆలయం దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకుమాంబ. కేవలం విశాఖ వాసులకే కాకుండా ఉత్తరాంధ్రవాసలకు కూడా సెంటిమెంట్.
Also Read: విదుర నీతి: మీకు సంతోషకరమైన జీవితం కావాలంటే ఈ నియమాలు పాటించండి
శిరస్సు ఎందుకు ఉండదంటే..
ఇక్కడ కొలువైన అమ్మవారి వెనుక భాగంలో శ్రీ చక్రం ఉందని చెబుతారు. గౌరీ స్వరూపంగా భావించే అమ్మవారిగురించి ఓ కథ చెబుతారు. ఒకప్పుడు రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న వైర్‌లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలందుకునేవారు. రైల్వేస్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్లిపోయారు. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడినుంచి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పిందట. అమ్మవారి విగ్రహాన్ని ఎద్దులబండి మీద నుంచి తీసుకెళ్తుండగా...ఓ దగ్గర బండి ఆగింది..అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడిందట. ఆ శిరస్సుని అతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఏం అరిష్టమో అనుకుని భక్తులు వేడుకోవడంతో.. తన కాళ్ల దగ్గరే శిరస్సు పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పిందట అమ్మవారు. అప్పటి నుంచి బిందెడు నీళ్లను సమర్పించుకుంటే అనుకున్నది నెరవేరుతోందట.
Also Read:గర్భాదానం (First Night) ఎందుకు జరిపిస్తారు, మంచి ముహూర్తంలో జరగకపోతే ఏమవుతుంది!
అవివాహితులకు కళ్యాణ యోగం
ఎరుకుమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. మొక్కులు చెల్లించాలి అనుకునేవారు బుధవారం రోజు పసుపునీళ్లు సమర్పిస్తారు. దీనినే స్నానఘట్టం అంటారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు స్నానఘట్టాల పూజను ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం గురువారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి, ఎరుకుమాంబ అమ్మవారు ఆలయానికి ఎవరు వచ్చినా ఎవరికి వారే పూజ చేసుకోవచ్చనే నియమం పెట్టారు ధర్మకర్తలు.
Also Read: లోకంలో భార్య-భర్తలు 5 రకాలు- మీ జంట ఇందులో ఏ రకమో చూసుకోండి!
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.