అన్వేషించండి

 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!

కార్లలో వాడే డ్రమ్, డిస్క్ బ్రేక్స్ పనితీరు, వాటి వల్ల కలిగే లాభనష్టాలు, మెయింటెనెన్స్ ఖర్చుల గురించి వాహనదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే సెక్యూరిటీ విషయంలో రాజీ పడకుండా ఉండొచ్చు.

Drum Brakes vs Disc Brakes Latest Auto News: కారు కొనేటప్పుడు అందరూ ఇంజన్ పవర్, మైలేజీ, ఫీచర్ల మీద ఫోకస్ పెడతారు. కానీ ప్రాణాలను కాపాడే బ్రేకింగ్ సిస్టమ్ గురించి పెద్దగా పట్టించుకోరు. స్పెసిఫికేషన్ షీట్‌లో ఎక్కడో లోపల ఉండే బ్రేక్స్ వివరాలు మీ సేఫ్టీని, మెయింటెనెన్స్ ఖర్చులను డిసైడ్ చేస్తాయి. ఇండియాలో ప్రస్తుతం డ్రమ్, డిస్క్ బ్రేక్స్ రెండూ వాడుకలో ఉన్నాయి. వీటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఇప్పుడు చూద్దాం.

డ్రమ్ బ్రేక్స్ అంటే ఏమిటి?
ఇది చాలా పాత కాలం నాటి టెక్నాలజీ. ఇప్పటికీ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, కాంపాక్ట్ సెడాన్ల వెనుక చక్రాలకు వీటిని వాడుతున్నారు. ఇందులో చక్రానికి ఒక డ్రమ్ ఉంటుంది. దాని లోపల బ్రేక్ షూస్ ఉంటాయి. మీరు బ్రేక్ నొక్కినప్పుడు హైడ్రాలిక్ ప్రెజర్ వల్ల ఆ షూస్ బయటకు వ్యాపించి డ్రమ్ లోపలి భాగాన్ని నొక్కుతాయి. ఆ ఘర్షణ వల్ల చక్రం ఆగిపోతుంది. ఇవి సిటీ ట్రాఫిక్‌లో తక్కువ స్పీడ్‌లో వెళ్లేటప్పుడు బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఎక్కువసేపు బ్రేకులు వేస్తే లోపల వేడి పెరిగిపోయి పట్టు తగ్గే అవకాశం ఉంటుంది.

డిస్క్ బ్రేక్స్ స్పెషాలిటీ ఏంటి?
ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో తయారైనవి. ఇప్పుడు ఇండియాలో దొరికే దాదాపు అన్ని కార్ల ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్స్ కంపల్సరీగా వస్తున్నాయి. ఇందులో ఒక రోటర్ డిస్క్, ఒక కాలిపర్ ఉంటాయి. మీరు బ్రేక్ వేయగానే కాలిపర్ లోపల ఉండే బ్రేక్ ప్యాడ్స్ ఆ డిస్కును గట్టిగా పట్టుకుంటాయి. ఇవి గాలికి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల వేడిని త్వరగా బయటకు పంపేస్తాయి. హైవేల మీద ఫాస్ట్ గా వెళ్లేటప్పుడు ఇవి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. వర్షాకాలంలో నీళ్లు నిలిచిన రోడ్ల మీద వెళ్లినా కూడా డిస్క్ బ్రేక్స్ త్వరగా ఆరిపోయి పర్ఫెక్ట్ బ్రేకింగ్ ఇస్తాయి.

రెండిటి మధ్య ప్రధాన తేడాలు..
డ్రమ్ బ్రేక్స్ తయారీ ఖర్చు తక్కువ. అందుకే బేస్ మోడల్ కార్ల ధరలు తగ్గించడానికి కంపెనీలు వీటిని వాడతాయి. ఇవి త్వరగా అరిగిపోవు, ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. మురికి, ఇసుక పడే రోడ్ల మీద కూడా డ్రమ్ బ్రేక్స్ లోపల భాగాలు సేఫ్ గా ఉంటాయి. కానీ డిస్క్ బ్రేక్స్ విషయానికి వస్తే వీటి పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సర్వీసింగ్ చేయడం కూడా చాలా ఈజీ. బ్రేక్ ప్యాడ్స్ ఎంతవరకు అరిగిపోయాయో బయట నుండే చూసి తెలుసుకోవచ్చు. ప్రీమియం కార్లు, ఎస్‌యూవీల్లో ఇప్పుడు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లే ఇస్తున్నారు.  తక్కువ వేగంతో ప్రయాణించే సిటీ కార్లకు వెనుక చక్రాల దగ్గర డ్రమ్ బ్రేక్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మీరు తరచుగా హైవే రైడ్స్ చేసేవారైతే మాత్రం డిస్క్ బ్రేక్స్ ఉన్న వేరియంట్లను ఎంచుకోవడం ఉత్తమం. బ్రేక్ ప్యాడ్ల ఖర్చు కొంచెం ఎక్కువైనా సేఫ్టీ విషయంలో ఇవి ది బెస్ట్. మీ డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి సరైన బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న కారును సెలెక్ట్ చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget