అన్వేషించండి

Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!

Spain vs USAఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు సహకరించేందుకు దేశాలు ముందుకు రావడం లేదు. తాజాగా స్పెయిన్ కూడా ఊహించని షాక్ ఇచ్చింది. గగనతలాన్ని వాడుకోవద్దని స్పష్టం చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్‌పై దాడులకు సహకరించబోమని స్పెయిన్‌ స్పష్టం చేసింది.
  • స్పెయిన్‌ తమ గగనతలాన్ని అమెరికా విమానాల కోసం మూసివేసింది.
  • ఇరాక్‌ యుద్ధాన్ని గుర్తు చేస్తూ స్పెయిన్‌ అమెరికాను విమర్శించింది.
  • స్పెయిన్‌ నిర్ణయంతో అమెరికాకు వ్యూహాత్మకంగా నష్టం చేకూరింది.

Spain vs USA: మధ్య ప్రాచ్యంలో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు సైతం హ్యాండ్ ఇస్తున్నాయి. తాజాగా స్పెయిన్ ట్రంప్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. ఇరాన్‌పై దాడుల విషయంలో తాము సహకరించలేమని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ స్పష్టం చేశారు. ఇరాక్‌ జరిగిన మోసాన్ని ఇప్పుడు కూడా జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. 

ఇరాన్‌పై దాడులకు గగనతలాన్ని వాడుకోవద్దని స్పెయిన్ సూచన  

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను స్పెయిన్ తప్పుపట్టింది. తమ సహకారం ఉండబోదని తేల్చి చెప్పింది. అంతే కాకుండా తమ గగనతలాన్ని యుద్ధ విమానాల కోసం వాడుకోవద్దని కూడా తేల్చి చెప్పింది. మూసివేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా, స్పెయిన్ భూభాగంలో ఉన్న ఉమ్మడి సైనిక స్థావరాలను యుద్ధ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడానికి లేదని స్పష్టం చేసింది. స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబ్లెస్‌ మాట్లాడుతూ, ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఏ రకమైన సహకారాన్ని తాము అందించబోమని ఇది తమ దేశ విధానమని తేల్చి చెప్పారు. 

ఇరాక్‌తో యుద్దంలో ఇవే చెప్పే మోసం చేశారంటున్న స్పెయిన్ 

స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌ మాట్లాడుతూ 23 ఏళ్ల నాటి ఘటనలు ప్రస్తావించారు. ఇరాక్ యుద్ధం సమయంలో ఇప్పటి మాదిరిగానే తమను అమెరికా యుద్ధంలోకి లాగిందని గుర్తు చేసింది. అప్పుడు కూడా భారీ విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయని 2003లో ఇరాక్‌పై దాడికి ఉసిగొల్పిందని వివరించారు. దాడి జరిగిన తర్వాత చూస్తే అలాంటి ఆనవాళ్లే లేవని తేలిందన్నారు. అందుకే మరోసారి అమెరికా చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేమని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఇరాన్‌పై కూడా అలాంటి సాకులతోనే దాడులు చేస్తున్నారని ఇది ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. 

స్పెయిన్‌ స్పందనను ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ స్పెయిన్ ప్రవర్తన బాగాలేదని అన్నారు. ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. 

స్పెయిన్ గగనతలం మూసివేతతో అమెరికాకు వచ్చిన నష్టమేంటీ?

స్పెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అమెరికాకు చెందిన ప్రమాదకరమైన బీ 52, బీ1 బాంబర్‌ విమానాల తరలింపునకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఇంగ్లండ్ మీదుగా తరలించాల్సి వస్తోంది. ఇది వ్యూహాత్మకంగా భారీ నష్టం చేస్తుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

 అమెరికాకు దూరం దూరం 

ఇప్పటికే నాటో కూటమిలో ఉండాలా వద్దా అని అమెరికా ఆలోచిస్తోంది. తమ అవసరాల కోసం అమెరికాను వాడుకుంటున్న నాటో దేశాలు అవసరమైనప్పుడు అమెరికాకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నిస్తోంది. ఇది నాటో దేశాల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తోంది. ఇప్పుడు స్పెయిన్ కూడా వ్యతిరేకంగా ఉండటంతో ఈ ప్రభావం యూరోపియన్ దేశాలపై కూడా ప్రభావం చూపబోతోంది. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్‌ కూడా ఇది తమ యుద్ధం కాదని కామెంట్ చేశారు. మొత్తం మీద అమెరికా, ఐరోపా దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోంది. 

Frequently Asked Questions

ఇరాన్‌పై అమెరికా దాడులకు స్పెయిన్ సహకరిస్తుందా?

లేదు, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ ఇరాన్‌పై దాడులలో తాము సహకరించబోమని స్పష్టం చేశారు.

స్పెయిన్ తన గగనతలాన్ని అమెరికాకు అందుబాటులో ఉంచుతుందా?

లేదు, స్పెయిన్ తన గగనతలాన్ని యుద్ధ విమానాల కోసం వాడుకోవడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఇరాక్‌ యుద్ధంపై స్పెయిన్‌కు ఎలాంటి అనుభవం ఉంది?

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ 23 ఏళ్ల క్రితం ఇరాక్‌ యుద్ధంలో అమెరికా తమను మోసగించిందని గుర్తు చేసుకున్నారు.

స్పెయిన్‌ నిర్ణయం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం జరిగింది?

స్పెయిన్‌ గగనతలం మూసివేయడంతో అమెరికా బీ 52, బీ1 బాంబర్‌ విమానాల తరలింపునకు ఆటంకం ఏర్పడి, వ్యూహాత్మకంగా నష్టం జరిగింది.

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget