Ganesha Nimajjanam 2024: గణేష్ నిమజ్జనం సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఇవే!
Safe Ganesh Visarjan: దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందడి ప్రారంభమైంది. అసలు సంబరం సెప్టెంబరు 17 అనంత చతుర్థశి రోజు ఉంటుంది...ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిమజ్జనం ప్రశాంతంగా జరిగిపోతుంది...

Safe Ganesh Visarjan Precautions and Guidelines 2024: గణేష్ నిమజ్జనం అంటా చిన్నా పెద్దా అందరకీ సంతోషమే..ఊరూ వాడా సంబరమే. నవరాత్రులు పూజలందుకుంది నిమజ్జనానికి బయలుదేరే గణపయ్యని వైభవంగా సాగనంపి..ఏడాదికి సరిపడా సంబరాన్ని నింపేసుకుంటారు. అయితే నిమజ్జనం ప్లాన్ చేసేవారు, ఆ వేడుకలో పాల్గొనేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎలాంటి అడ్డంకులు, అవాంఛనీయ ఘటనలు , ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగిపోతుంది.
ప్లాన్ చేసుకోండి
గణేషుడిని నిమజ్జనానికి తీసుకెళ్లేముందు..మొత్తం ప్లాన్ చేసుకోండి. రద్దీగా ఉండే మార్గంలో కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో ఆలోచించుకోండి. అడ్డంకులు లేకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ వెళ్లే రహదారులను ఎంపిక చేసుకోండి..
సౌకర్యవంతంగా ఉండే దుస్తులు
సాధారణంగా భారతీయుల వస్త్రధారణ కాలాన్ని అనుసరించి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిండైన వస్త్రధారణ నియమం పాటిస్తారు. నిమజ్జనం వేడుకలలో పాల్గొనేవారు కూడా శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులు అస్సలు ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
ఇవి తప్పనిసరి
నిమజ్జనం వేడుకలలో పాల్గొనేవారు తాగునీరు, స్నాక్స్ లాంటివి తీసుకెళ్లడం మంచిది. ఆ రద్దీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు..అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవచ్చు..అందుకే వాటర్ బాటిల్, స్నాక్స్ మీ వెంట ఉండడం మంచిది
విలువైన వస్తువులు తీసుకెళ్లొద్దు
రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగలు ప్రతాపం చూపిస్తారు..అందుకే విలువైన వస్తువులు ధరించి నిమజ్జన వేడుకలలో పాల్గొనవద్దు. తప్పనిసరిగా వేసుకోవాల్సిన వస్తువులుంటే తగిన జాగ్రత్తలు పాటించండి. ఫోన్లు లాంటివి బ్యాగ్ లో భద్రపరచండి..
హైడ్రేటెడ్ గా ఉండండి
వినాయక నిమజ్జనం వేడుక మొత్తం బహిరంగ ప్రదేశంలోనే జరుగుతుంది. వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి మీ ఒంటితీరుని బట్టి అవసరం అయిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆడి ఆడి అలసిపోతారు కదా..తగిన నీరు అవసరం...
భద్రతా మార్గదర్శకాలు అనుసరించండి
మీ భద్రతకోసమే అధికారులు , భద్రతా సిబ్బంది కొన్ని సూచనలు చెబుతారు..కొన్ని ఆంక్షలు విధిస్తారు.. వాటిని తప్పనిసరిగా అనుసరించండి. స్థానికంగా ఉండే అధికారులు చెప్పే సూచనలు విస్మరించకండి.
Also Read: మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
ఫొటోస్ తీయాలి అనుకుంటే
ఫోటోలు , వీడియోలను తీయాలి అనుకుంటే ఎదుటివారికి ఇబ్బంది లేకుండా , నిమజ్జన ప్రక్రియకు ఎలాంటి అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా అనుమతి తీసుకున్నాకే ఫొటోస్, వీడియోస్ తీయడం మంచిది..
ట్రాఫిక్ నిబంధనలు విస్మరించవద్దు
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలి. ఒక్కరు మార్గం తప్పినా ఆ ప్రభావం కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయేందుకు దారితీయొచ్చు. అందుకే ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. పార్కింగ్ విషయంలోనూ నిబంధనలు పాటించాల్సిందే...
త్వరగా చేరుకోవాలి
నిమజ్జనం ఎక్కడ చేయాలి అనుకుంటున్నారో అక్కడకు త్వరగా చేరుకునేందుకు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రదేశంలో భారీ రద్దీ ఉంటుంది. ఆ రద్దీ ఎక్కువయ్యే కొద్దీ నిమజ్జనం ఆలస్యం అవుతుంది..అందుకే ముందుగానే ఆ ప్రదేశానికి చేరుకోవడం మంచిది..
స్థానిక పద్ధతులను గౌరవించండి
మీరు సందర్శించే నిర్ధిష్ట ప్రాంతంలో అనుసరించాల్సిన పద్ధతులు ఉంటాయి. మీకు నచ్చినట్టుకాదు..అక్కడి పద్ధతుల ఆధారంగా నిమజ్జనంకు అనువైన ప్రదేశం ఎంపిక చేసుకోండి.
ఇవి చేయకండి
గణేష్ నిమజ్జనంలో పాల్గొనేవారు సింథటిక్ దుస్తులు ధరించవద్దు. క్రాకర్స్ కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పిల్లల్ని తీసుకెళితే నీటి దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడండి. అర్థరాత్రి వరకూ వేడుకలలోనే ఉండిపోవద్దు..కాస్త ముందగానే నిమజ్జనం పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోండి.
గణేష్ నిమజ్జనం అంటే ఏడాదికి సరిపడా సంబరాన్ని పోగేసుకోవాలి కానీ చిన్న బాధ కూడా కలగకూడదు...అందుకే సంప్రదాయాలను గౌరవిస్తూ , నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం వేడుకల్లో పాల్గొంటే వేడుకను పూర్తిగా ఆస్వాదించగలరు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

