Bakrid 2025 Date and History: 2025 లో బక్రీద్ ఎప్పుడొచ్చింది , ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజు బలి ఎందుకు ఇస్తారు!
Bakrid 2025 : 2025 లో బక్రీద్ జూన్ 06 శుక్రవారం వచ్చింది.మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకత ఏంటి?

Bakrid 2025 Date and History: రంజాన్ తరువాత ముస్లింలు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్. చాంద్రమానం ఆధారంగా నిర్ణియిస్తారు ముస్లిం క్యాలెండర్. జిల్హియా మాసంలో నెలవంక కనిపించిన తర్వాత బక్రీద్ జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 06న వచ్చింది. ప్రతి పండుగకు ఓ ఏదో ఒక సంఘటన, అందులో సందేశం ఉంటాయి. అలాగే బక్రీద్ జరుపుకోవడం వెనుక కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది.
రంజాన్ జరిగిన 70 రోజుల తర్వాత జరుపుకునే పండుగ గురించి ఆసక్తికర కథనం ఏంటంటే సమాజంలో పెరిగిపోతున్న చెడు నుంచి ప్రజల్ని మంచివైపు నడిపించడమే. ఇందుకోసమే అల్లాహ్ ఈ భూమిమీదకు 80 వేల మంది ప్రవక్తలను పంపించినట్టు ముస్లిం పవిత్ర గ్రంధం ఖురాన్ లో ఉంది. ఆ 80 మంది ప్రవక్తల్లో ఒకరు హాజరత్ ఇబ్రహీం . ఈయన భార్య పేరు హజీరా. వీరికి లేక లేక సంతానం కలుగుతుంది. ఆ కొడుక్కి ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటారు.
ఓ రోజు తన కొడుకు ఇస్మాయిల్ ను అల్లాకు బలిస్తున్నట్టు హాజరత్ ఇబ్రహీంకు కలవస్తుంది. అంటే అల్లానే తనను అలా ఆదేశించాడని భావించి బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు హజరత్. అల్లాపై భక్తితో ఇస్మాయిల్ కూడా తండ్రి కల తెలుసుకుని బలికి సిద్ధమవుతాడు. అయితే తండ్రికితనపై ఉన్న ప్రేమతో ఆలోచన విరమించుకుంటాడేమో అని కళ్లకుగంతలు కట్టుకుని బలి ఇవ్వు అని అడుగుతాడు. సరేనని చెప్పి కళ్లకు గంతలు కట్టుకుని కొడుకుని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతాడు హజరత్.
సరిగ్గా కత్తి ఇస్మాయిల్ మెడపై పడే సమయానికి అల్లా దిగివచ్చి ఆ స్థానంలో ఓ పొట్టేలును ఉంచుతాడు. తనపై ఉన్న భక్తికి సంతోషించి ఏటా ఇదే రోజున తనకు మూగ జీవాలను బలి ఇవ్వాలని హజరత్ కు చెప్పాడట అల్లా. ప్రళయం వచ్చే వరకూ ఇది కొనసాగించాలన్నాడట. అప్పటి నుంచి ఏటా బక్రీద్ రోజు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇస్తుంటారు. దీనినే ఖుర్బానీ అంటారు.
బలి ఇచ్చిన మూగజీవాలను మూడు భాగాలుగా చేసి అందులో ఓ వంతు పేదలకు, మరో వంతు బంధుమిత్రులకు, మూడో వంతు తమ కుటుంబ సభ్యులకోసం ఉంచుతారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా యాత్ర బక్రీద్ తర్వాత నుంచే ప్రారంభమవుతుంది.
బక్రీద్ పండగ సందర్భంగా తెలంగాణ DGP జితేందర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోరక్షకులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జితేందర్ హెచ్చరించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు ఎవరికి తెలిసినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఎవరైనా ఆవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జితేందర్ హెచ్చరించారు. జూన్ 06 బక్రీద్ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గమనిక:ఆయా మత ప్రవక్తలు చెప్పిన సందేశం ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!






















