అన్వేషించండి

రావణుడి వంశం అని మహారాష్ట్ర గోండులు.. గబ్బిలాలు డిస్టర్బ్ అవుతాయని తమిళనాడు గిరిజనులు దీపావళి చేసుకోరు!

Diwali 2024: రావణుడి వంశం అని మహారాష్ట్ర గోండులు.. గబ్బిలాలు డిస్టర్బ్ అవుతాయని తమిళనాడు గిరిజనులు దీపావళి చేసుకోరని తెలుసా..?

Diwali 2024 Special Story :  దీపావళి  పండుగ వచ్చేసింది. దేశమంతా ఆనందోత్సాహలతో పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఇదే దేశంలో  దీపావళిని  సంతాప సూచికంగా జరుపుకునే  తెగలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మహారాష్ట్ర లోని గడ్చిరోలి ప్రాంతానికి చెందిన  గోండు జాతి గిరిజనులు. 

Also Read: మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!

 తమను తాము "రావణ వంశీ లు " గా పిలుచుకునే గడ్చిరోలి గోండులు

గడ్చిరోలి గోండులు తమను తాము " రావణ వంశీ"లు గా పిలుచుకుంటారు. అంటే రావణుడి వంశీకులు అని అర్థం. వారి సంప్రదాయం ప్రకారం రావణుడు గోండు జాతి రాజు.ఆయనపై ఆర్యజాతి అక్రమణదారులు దాడి చేసి అన్యాయంగా  చంపేశారు. ఆయన కుమారుడు మేఘనాథుడిని  కూడా అక్రమ పద్ధతుల్లోనే  హతమార్చారు. అసలు రావణుడి కథలో  సీతాపహరణం  అనేది ఎప్పుడూ జరగలేదని  మహారాష్ట్ర గోండులు అంటుంటారు.

సంస్కృతంలో రామాయణం రాసిన వాల్మీకి రావణున్ని  ఎప్పుడూ చెడ్డవాడిగా చెప్పలేదని అదంతా తర్వాత కాలంలో అవద్ భాషలో  రామాయణం రాసిన  తులసీదాస్ కల్పన అని చెబుతారు. దురదృష్టవశాత్తు  ప్రజలందరూ కూడా  దాన్నే నమ్ముతూ  రావణుడు చెడ్డవాడని తప్పుగా అనుకుంటారు అనేది  గడ్చిరోలి గోండుల అభిప్రాయం.

ఇప్పటికీ రావణుడు, కుమారుడు మేఘనాథుడి విగ్రహాలకు పూజలు చేస్తుంటారు వారు. రావణుడి చావుతో ముడిపడిన దీపావళి పండుగను  వారు సంతాప సూచికంగానే జరుపుకుంటారు. బాణసంచాల్లాంటివి కాల్చరు.

Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి - పూజా విధానం ఇదిగో ఫాలోఅయిపోండి!

 గబ్బిలాలు  డిస్టర్బ్ అవుతాయని దీపావళి జరవని తమిళనాడు గ్రామాలు

తమిళనాడు   తిరుచ్చి సమీపంలోని సామ్పత్తి, తొప్పు పత్తి గ్రామాల ప్రజలు  దీపావళి జరుపుకోరు.  దానికి కారణం బాణ సంచాలు కలిస్తే  తమ ఊళ్ళలోని మర్రి చెట్టుపై ఉండే గబ్బిలాలు డిస్టర్బ్ అవుతాయని.

ఆ గ్రామాల ప్రజలు మర్రిచెట్టును తమ పూజించే దేవుడు "మునియప్ప సామి " నివసించే ఇల్లుగా భావిస్తారు. అందుకే దీపావళి నాడు అక్కడ ఎలాంటి బాణసంచాలు కాల్చరు. దానికి బదులుగా స్వీట్స్ మాత్రం పంచుకుంటారు.

తమిళనాడులోనే ఉండే  వెట్టంగుడి పక్షుల సంరక్షణ కేంద్రం సమీపంలో ఉండే గ్రామాల్లో ప్రజలు కూడా  పటాసులతో  దీపావళి చేసుకోరు. కారణం ఆసంరక్షణ కేంద్రంలో ఉండే వలస పక్షులకు ఎలాంటి హాని జరగకూడదని. బాణసంచా కు బదులుగా ఆ కేంద్రంలోని అధికారులు పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!

ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న  కిత్తంపేట అనే గ్రామంలో ఏడు దశాబ్ధాలుగా దీపావళి వేడుకలకు ఆ గ్రామస్తులు దూరంగా ఉంటున్నారు. ఇందుకు కారణం రాముడు - రావణుడు కాదు కానీ... దీపావళి రోజు జరిగిన సంఘటనే కారణం. దాదాపు 1500లకు పైగా జనాభా ఉండే ఆ గ్రామంలో దీపావళి వేడుకలు జరుపుకోరు. 70 ఏళ్ల క్రితం ఊరంతా పాకలు ఉండేవి. మూగజీవాలు ఉండే శాలలు కూడా అ పక్కనే ఉండేవి. ఓ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా.. ఊరంతా అగ్నికి ఆహుతైంది...మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అప్పటి నుంచి వరుసగా కొన్నేళ్ల పాటూ అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామస్తులు దీపావళి పండుగకు దూరంగా ఉండడం మొదలెట్టారు. నాగులచవితి రోజు పుట్టలో పాలుపోసి ఆ రోజు మాత్రం పుట్ట దగ్గర టపాసులు కాలుస్తామని గ్రామస్తులు తెలిపారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget