Spirituality: ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం - పొరపాటున కూడా ఎవ్వరూ లోపల అడుగుపెట్టరు!
Mysterious Yamraj Temple: దేవాలయం అంటే నిత్యం భక్తులతో కళకళలాడుతుంది.కానీ ఈ ఆలయంలోకి భక్తులు పొరపాటున కూడా అడుగుపెట్టరు. లోపలకు వెళ్లాలంటేనే భయపడతారు. ఎక్కడుందా ఆలయం? ఎందుకు భక్తులు వెళ్లరో తెలుసా!
Yamraj Temple in Himachal Pradesh: భగవంతుడికి - భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలులా వ్యవహరిస్తాయి దేవాలయాలు. అందుకే పండుగలు, ప్రత్యేరోజుల్లో ఆలయాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువే. కొన్ని ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంటే మరికొన్ని ఆలయాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గుడికి మాత్రం ఎప్పుడూ ఏ భక్తుడూ వెళ్లడు. అసలు లోపల అడుగుపెట్టేందుకే భయపడతాడు. ఆ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చంబాలోని భర్మోర్ అనే చిన్నపట్టణంలో ఉంది.
Also Read: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!
యమధర్మరాజు ఆలయం
హిమాచల్ ప్రదేశ్ దేవతల భూమి అంటారు. ఇక్కడ దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. హిమాచల్ ప్రదేశ్‌లో వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది. అలాంటి ఒక దేవాలయం చంబా జిల్లాలోని భర్మౌర్‌లో ఉన్న యమధర్మరాజు ఆలయం. సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయానికి కూడా భక్తులు వెళతారు. ప్రత్యేక పూజలు చేస్తారు, అపమృత్యు దోషం తొలగించమని ప్రార్థిస్తారు. కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తుడు వెళ్లడు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మ రాజు ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్మించారనేది తెలియదు కానీ చంబా రాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం కేవలం యమ ధర్మరాజు కోసమే కట్టారని, అందుకే ఆయన తప్ప ఇంకెవరూ ఈ గుడిలోకి వెళ్లలేరని అక్కడి స్థానికుల కథనం. పురాణాల ప్రకారం ఎప్పుడూ యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఓ ప్రత్యేకగది ఉంది. మనుషుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గదిలోనుంచే రాస్తాడని .. తప్పొప్పులన్నీ అక్కడ నిక్షిప్తమవుతాయని నమ్ముతారు.
Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
ఆలయం లోపలకు ఆత్మలు
ఈ దేవాలయంలో బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని విశ్వాసం.అందులో ఆలయం లోపలకు అడుగుపెట్టకుండా బయటి నుంచే నమస్కారం చేసుకుని వెళ్లిపోతారు.
యమవిదియ ప్రత్యేకం
భాయ్ దూజ్ పండుగ రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోదర సోదరీమణుల ఈ పవిత్ర పండుగ, భాయ్ దూజ్ ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్ల పక్షం రెండో రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
పితృపక్షంలో పిండప్రధానాలు
మృతిచెందిన వారికి పిండప్రధాన కార్యక్రమాలు ఆలయం ప్రాంగణంలో చేస్తారు. దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతరణి అని పిలుస్తారు. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతరణి నది గురించి ప్రస్తావన ఉంటుంది. మొత్తానికి ఆలయం వరకూ వెళతారు కానీ లోపలకు మాత్రం అడుగుపెట్టరు. ఇదంతా నిజం అని కొందరు, కల్పన అని మరికొందరు అంటారు. ఏదైనా కానీ ఇదో మిస్టరీగా మిగిలిపోయిందంతే...
Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం