అన్వేషించండి

January Grah Gochar 2024: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!

Surya Gochar 2024: జనవరిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఒకేరాశిలో సంచరిస్తారు. దీనినే త్రిగ్రాహి యోగం అంటారు. ఈ ఫలితంగా 4 రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది

January Grah Gochar 2024:  జనవరి 2024లో సూర్యుడు, బుధుడు , శుక్రుడు రాశి మారబోతున్నారు.  ప్రస్తుతానికి కుజుడు సంచరిస్తున్న ధనస్సు రాశిలోనే ఈ మూడు గ్రహాలు కూడా మారబోతున్నాయి. ఫలితంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని రాశులవారికి ధనవృద్ధి మరికొన్ని రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. 

బుధుడు
వృశ్చిక రాశిలో వక్రంలో సంచరిస్తున్న బుధుడు..జనవరి 9 న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 వరకూ ధనస్సులోనే సంచరిస్తాడు. బుధుడు రాశి మార్పు కన్యా , వృషభ రాశుల వారికి వారి కెరీర్‌లో లాభాలను ఇస్తుంది 

సూర్యుడు
సూర్యుడు ప్రస్తుతం ధనస్సు రాశిలోనే సంచరిస్తున్నాడు. 15 జనవరి 2024 ఉదయం 8.17 కి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.  అంటే ప్రస్తుతానికి సూర్యుడు ధనస్సు లోనే సంచరిస్తున్నాడు.

శుక్రుడు
ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు జనవరి 19న ధనస్సులోకి ప్రవేశిస్తాడు. అందం, సంపద, విలాసాలకు కారకుడు శుక్రుడు.

కుజుడు
ఇప్పటికే కుజుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు. 2023 డిసెంబరు 27న ధనస్సులోకి ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 5 వరకూ ధనస్సు రాశిలోనే ఉంటాడు.  

ధనస్సు లో మూడు గ్రహాలు కలసి ఉండడం వల్ల త్రిగ్రాహియోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి లాభాలను ఇస్తుంది.

Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!

మేష రాశి (Aries)

మేషరాశి వారికి జనవరిలో ఉన్న గ్రహాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రూపంలో లాభాలను అందిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరగడం లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. సూర్యుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రణాళికలు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పెండింగ్ ఉన్న పనులు ఊపందుకుంటాయి. 

మిథున రాశి (Gemini)

జనవరిలో గ్రహాల సంచారం మిథున రాశివారికి కలిసొస్తుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు.  ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.  

Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!

కన్యా రాశి  (Virgo)

కన్యా రాశి వారికి కార్యాలయంలో అధికారుల మద్దతు లభిస్తుంది. సూర్యుని రాశిలో మార్పు  శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. సూర్యుని అనుగ్రహం వల్ల విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. పిల్లలకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి.

కుంభ రాశి  (Aquarius )

కుంభరాశి వారికి గ్రహాల సంచారం కలిసొస్తుంది. కార్యక్షేత్రంలో వచ్చే కష్టాలు వాటంతట అవే తీరుతాయి. వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు సహోద్యోగుల మద్దతును పొందుతారు. వైవాహిక జీవితంల బావుంటుంది.

Also Read: ఈ రాశివారు ఒక్కసారిగా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు, జనవరి 02 రాశిఫలాలు

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
ట్విన్ టవర్స్ పై అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
Embed widget