అన్వేషించండి

Dhanteras 2024: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు అస్సలు కొనకండి ..దురదృష్టం వెంటాడుతుంది!

Dhana Trayodashi 2024: ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే బంగారం వెండి కొనకపోయినా కొన్ని వస్తువులు అస్సలు కొనద్దని సూచిస్తున్నారు పండితులు.

Dhanteras 2024:  హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో ధనత్రయోదశి ఒకటి. ఈ రోజు నుంచి దీపావళి సందడి మొదలవుతుంది. ప్రతి లోగిలిలో ఈ రోజు నుంచి దీపాలు కళకళలాడిపోతాయి. ఆశ్వయుజమాసం అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ( అక్టోబరు 30) ధన త్రయోదశి. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం సెంటిమెంట్ గా భావిస్తారు. ఆభరణాలను అమ్మవారి వద్ద ఉంచి పూజ చేస్తారు. ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరిని, శ్రీ మహాలక్ష్మిని, కుబేరుడిని పూజిస్తారు. ఈ రోజు బంగారం , వెండి ఆభరణాలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలిసొస్తుందని విశ్వాసం. వీటితో పాటూ శ్రీయంత్రం, దక్షిణావర్తి శంఖం, కొత్తిమీర విత్తనాలు కూడా పూజలో పెడతారు. అయితే ఏం తీసుకొచ్చినా లేకపోయినా..కొన్ని వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం...

Also Read: ధన త్రయోదశికి వెండి, బంగారం కొనలేనివారు తక్కువ ఖర్చుతో ఇవి కొనుక్కున్నా మంచిదే!

ఇనుము వస్తువులు

ఇనుముని శనికి సూచనగా చెబుతారు. అందుకే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించే ఈ రోజు ఇనుము వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇనుము మాత్రమే కాదు.. స్టీలు, అల్యూమినియం పాత్రలు కూడా కొనకూడదు. ఈ రోజు మట్టి పాత్రలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే అంతా మంచే జరుగుతుంది.  

నలుపు, నీలం రంగు వస్త్రాలు, వస్తువులు 
 
పసుపు శుభానికి సూచన అయితే నలుపు అశుభానికి సూచన. పైగా నలుపు, నీలం రంగులను శనికి చిహ్నంగా భావిస్తారు. అందుకే అత్యంత శుభప్రదమైన ధనత్రయోదశి రోజు నలుపు, నీలం రంగు వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయకూడదు. జంతువుల తోలుతో తయారు చేసిన వస్తువులు కూడా కొనుగోలు చేయొద్దు. చెప్పులు , షూస్ కొనొద్దు

Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!

గాజు/ప్లాస్టిక్ వస్తువులు

ఇంటి అలంకారంలో భాగంగా చాలామంది గాజు సామగ్రి కొంటారు. కానీ శ్రీ మహాలక్ష్మిని పూజించే ఈ రోజు గాజు సామగ్రి కొనుగోలు చేస్తే కుటుంబంలో సుఖ శాంతులు నశిస్తాయంటారు పండితులు. అందుకే అలంకరణ కోసం కూడా గాజు సామగ్రి ఈ రోజు కొనొద్దు. ప్లాస్టిక్ వస్తువులకు కూడా దూరంగా ఉండండి. కేవలం మట్టి వస్తువులే కొనుగోలు చేయండి. మట్టి కుండను కొనుగోలు చేస్తే ఖాళీగా తీసుకురావొద్దు..వాటిలో బియ్యం, గోధుమలు లాంటివి పెట్టి లోనికి తీసుకురండి

చాకు, కత్తెర

ధన త్రయోదశి రోజు పదునైన వస్తువులు..కత్తులు, చాకులు, సూదులు లాంటి పదునైన వస్తువులు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీని ఏరికోరి తెచ్చుకున్నట్టే..
 
బంగారం, వెండి కాకుండా...

ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలు కొంటారు..వాటిని కొనుగోలు చేసే శక్తి లేకపోతే ఆగిపోండి..కానీ.. సాధారణ ఆభరణాలు కొనుగోలు చేయొద్దు. అవి కూడ ఇనుముతో సమానమే..అలాంటి వస్తువులు కొనుగోలు చేసి తీసుకొచ్చే ఇబ్బందులు తప్పవు.

Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget