అన్వేషించండి

దీప అమావాస్య రోజు ఇలా చేస్తే శ్రావణ లక్ష్మీ సంతోషంగా మీ ఇంట అడుగుపెడుతుంది

శ్రావణ లక్ష్మికి ఆహ్వానం పలికేందకు గాను ఆషాఢం చివరి రోజున దీప అమావాస్య జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 17 న దీప అమావాస్య వస్తోంది. ఆరోజున ఎలాంటి పూజ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసం చివరి రోజు. తెల్లవారి నుంచి శ్రావణం మొదలవుతుంది. శ్రావణ మాసం లక్ష్మీ దేవికి ప్రీతి పాత్రమైన మాసం. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈ రోజున పండగ చేస్తారు. ఆ పండగ దీప అమావాస్య. అంతేకాదు పితృదేవతలను కూడా సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక దీపం వెలిగిస్తారు. 

ఆషాడ అమావాస్యను దీప అమావాస్యగా పరిగణిస్తారు. ఈ రోజున ఇంట్లో ముగ్గులతో అలంకారం చేసి దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసే పూజలో పిండి దీపాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. ఈ పండగను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో విశేషంగా చేస్తారు. మహారాష్ట్రలో గత అమావాస్యగా చేస్తారు. అంటే పితరులను తలచుకుని ఆరాధించుకునే అమావాస్య అని అర్థం. తమిళనాట ఆది అమావాస్యగా, గుజరాత్ లో దివాసోగా, కేరళలోని కర్కిడక వావు బలి,  ఉత్తర భారతదేశంలో హరియాలీ అమావస్,  కర్ణాటకలో భీమన అమావాస్య, ఒడిశాలో చితరగి అమావాస్యగా జరుపుకుంటారు. ఈ అమావాస్య నాడు పితృతర్పణలతో పాటు దాన ధర్మాలు కూడా చేస్తారు. ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఆషాఢ అమావాస్య నాడు దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఈ రోజున సజ్జపిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని దక్షిణం వైపు వెలిగించి పెట్టాలి. పితృదేవతలకు సమర్పించేందుకు ఈ దీపం వెలిగిస్తారు.

దీప అమావాస్య ఎప్పుడు?

పంచాంగం ప్రకారం ఈ ఏడాది జూలై 16వ తేదిన రాత్రి 10 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. జులై 17న అమావాస్య రోజు సూర్యోదయం జరుగుతుంది. కనుక జూల్ 17న దీప అమావాస్య జరుపుకోవాలి. జూలై 17న అర్థరాత్రి 12 గంటలకు అమావాస్య ముగుస్తుంది. ఈ ఆషాఢ అమావాస్య సోమవారం రోజున వస్తున్నందున ఇది సోమపతి అమావాస్య అవుతుంది. కనుక ఇది చాలా ప్రత్యేకమైన రోజు.

ఎలా జరుపుకోవాలి?

ఇంట్లోని దీపాలను శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శుభ్రమైన వస్త్రం పరిచి దాని మీద దీపం ఉంచాలి.  దీపం నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి నైవేద్యం, పూలు సమర్పించాలి. దీపావళి రోజున చేసినట్టుగానే ఇంటిని దీపాలతో అలంకరించాలి.

ఈ రోజున పితృదేవతలను తలచుకున్నా, గౌరీవ్రతం చేసుకున్నా, దీప పూజ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున పూర్వీకులను తలచుకుని పితృకర్మలు నిర్వహించి దానధర్మాలు చెయ్యడం వల్ల వారికి ఆత్మ శాంతి లభిస్తుందని కూడా నమ్మకం.

Also read : చీపురు విషయంలో ఈ నియమాలు పాటించకపోతే దరిద్రం తప్పదు

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget