Dashavatara: దశావతారాల్లో ఆఖరిది కల్కి - శ్రీ మహావిష్ణువు ఏ సమయంలో ఏ అవతారం ధరించాడు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి!
Ten Avatars of Lord Vishnu:ధర్మానికి హాని కలిగినప్పుడు..అధర్మం పెరిగిపోయినప్పుడు.. దుష్టసంహారం చేసి మంచిని రక్షించేందుకు ప్రతి యుగంలోనూ తానుంటానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అవే దశావతారాలు
Dashavatara
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||
ధర్మం నశించి అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ కోసం నేను అవతరిస్తాని శ్రీ కృష్ణడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు.
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలంటారు. కొన్ని అంశావతారాలు, కొన్ని పూర్ణావతారాలు, మరికొన్ని అర్చావతారాలు అని చెబుతారు. పూర్ణావతారాల్లో ముఖ్యమైనవి 10. వీటిలో నాలుగు అవతారాలు సత్యయుగంలో, మూడు అవతారాలు త్రేతాయుగంలో, ఎనిమిదో అవతారం ద్వాపరయుగంలో వచ్చింది..పదో అవతారం కలియుగాంతంలో రాబోతోంది. మొత్తం పది అవతారాలు ఏంటి? ఏ అవతారం ఏ సందర్భంలో వచ్చింది? ఈ వివరాలన్నీ విష్ణుపురాణంలో ఉన్నాయి.
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
మత్స్యావతారం
వరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడనే మహా విష్ణుభక్తుడు ఉండేవాడు. నిత్యం నదీ స్నానం అనంతరం సూర్యుడికి అర్ఝ్యం ఇచ్చేవాడు. ఓ రోజు అర్ఘ్యం ఇస్తుండగా దోసిట్లో చేపపిల్ల పడింది. దానిని ఎన్నిసార్లు జారవిడిచినా మళ్లీ చేతిలోకి వచ్చి నన్ను రక్షించు రాజా అని కోరింది. ఆ చేపని ఓ చిన్న పాత్రలో వేయగా అది ఆ పాత్ర పట్టనంత పెద్దగా మారింది..అలా ఎన్ని మార్చినా సరిపోలేదు..చెరువు కూడా పట్టకపోవడంతో సముద్రంలో విడిచిపెట్టాడు సత్యవ్రతుడు. అప్పుడు ఆ చేప ఇలా చెప్పింది.. ఈ రోజు నుంచి ఏడో రోజు ప్రళయం వచ్చి లోకమంతా నీటితో నిండిపోతుంది..నీలాంటి సత్యవ్రతుడికి ఏమీకాకూడదని చెప్పి...ఓ పెద్ద నౌకను నిర్మించి పునఃసృష్టికి అవసరమైనవన్నీ ఉంచి..ఈ నావలోకి సప్తరుషులు వస్తారని చెప్పి..తన కొమ్ముకు కట్టిన తాడుతో ప్రళయాంతం నుంచి రక్షించింది. ఆ సత్యవ్రతుడే వైవస్వత మనవు. అదే సమయంలో బ్రహ్మ మేల్కొని సృష్టిచేయాలని సంకల్పించగా వేదాలను దొంగించిన సోమకాసురుడు సముద్రగర్భంలో దాక్కున్నాడు. మత్స్యరూపంలో ఉన్న విష్ణువు..సోమకాసురిడిని సంహరించి వేదాలు రక్షించాడు.
కూర్మావతారం
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో భిన్నమైనది కూర్మావతారం. ఈ అవతారంలో రాక్షస సంహారం చేయలేదు. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలో కుంగిపోతున్న మందరపర్వతాన్ని తన భుజాలపై మోశాడు నారాయణుడు. భాగవతం, బ్రహ్మ పురాణంలో కూర్మావతారానికి సంబంధించిన కథలున్నాయి.
Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!
వరాహావతారం
శ్రీ మహావిష్ణువు మూడో అవతారం వరాహావతారం కూడా సత్యయుగంలోనే కనిపించింది. పందిరూపంలో అవతరించిన నారాయణుడు.. ముల్లోకాలను అల్లకల్లోలం చేసి వేదాలను తీసుకెళ్లి పాతాళంలో దాక్కున్న హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించాడు.
నారసింహావతారం
తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు..హిరణ్య కశిపుడిని సంహరించేందుకు నారసింహావతారం ధరించాడు శ్రీ మహావిష్ణువు .
వామనావతారం
ప్లహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి..యాగాలు, దాన ధర్మాలతో అత్యంత శక్తివంతుడిగా మారాడు. ఇంద్రలోకాన్ని చేజిక్కించుకోవాలని భావించి స్వర్గంపై దండెత్తుతాడు. అప్పుడు దేవతలంతా విష్ణువును శరణువేడగా... అదితి అనే రుషిపత్ని గర్భాన వామనుడిగా జన్మిస్తానని చెప్పాడు. ఓసారి బలి అశ్వమేథయాగాన్ని చేస్తున్నాడని తెలుసుకుని చిన్నారి బ్రాహ్మణుడిగా వెళ్లాడు. ఏం కావాలో కోరుకోమన్న బలిని..మూడు అడుగుల స్థలం అని అడిగి పాతాళానికి తొక్కేస్తాడు. భగవంతుడు మానవరూపంలో కనిపించిన మొదటి అవతారం ఇది
పరశురామావతారం
భూమ్మీద ఇప్పటికీ బతికి ఉన్న సప్త చిరంజీవుల్లో పరశురాముడు ఒకరు. అరాచకత్వం నుంచి భూమిని రక్షించేందుకు పరశురాముడిగా జన్మించాడు విష్ణువు. పార్షు (గొడ్డలి )తో దుష్టశిక్షణ చేయడం వల్లే పరశురాముడయ్యాడు. రేణుక-జమదగ్ని సంతానం అయిన పరశురాముడు బ్రాహ్మణ ద్రోహులైన రాజులను వధించాడు. భీష్ముడికి , కర్ణుడికి విలువిద్యలు నేర్పించింది పరశురాముడే. విష్ణువు పదో అవతారం అయిన కల్కికి కూడా విద్యలు నేర్పించబోయేది పరశురాముడే.
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
రామావతారం
దుష్టశిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మానవరూపంలో వచ్చిందే రామావతారం. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన మహారాజుగా... ఆదర్శవంతమైన తనయుడిగా నిలిచిన శ్రీరాముడు..రావణ సంహారం చేసింది ఈ అవతారంలోనే..
కృష్ణావతారం
ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా జన్మించాడు. ఈ అవతారంలో పాండవ పక్షపాతిగా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు.
బుద్దావతారం
శ్రీ మహావిష్ణువు అవతారాల్లో బుద్ధుడి అవతారం ఒకటి.
కల్కి అవతారం
దశావతారాల్లో ఆఖరిది కల్కి అవతారం. కలియుగంలో ధర్మం ఒక్కపాదంపై నడుస్తోంది. కలియుగాంతంలో శంబల అనే ప్రాంతంలో కల్కిగా జన్మించి దుష్టసంహారం చేస్తాడని..అప్పుడు కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమవుతుందని బ్రహ్మాండపురాణంలో ఉంది.