అన్వేషించండి

Tirumala: తిరుమలలో ఘనంగా మినీ బ్రహ్మోత్సవం - ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీ మలయప్పస్వామి చిద్విలాసం!

Tirumala Ratha Saptami: తిరుమలలోరథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మలయప్పస్వామి సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు..

Tirumala News: తిరుమల మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుడు సప్తవాహనాల్లో భక్తులను అనుగ్రహించారు. సూర్యజయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంతో మొదలై చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఒకేరోజు అనుగ్రహించారు స్వామివారి. అందుకే ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. 

Tirumala: తిరుమలలో ఘనంగా మినీ బ్రహ్మోత్సవం - ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీ మలయప్పస్వామి చిద్విలాసం!

రథసప్తమి పర్వదినాన్ని క్రీ.శ 1564 నుంచి తిరుమలలో జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.   

Also Read: కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భగవద్గీత.. రామ రావణ యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం - మీ విజయం కోసం ఇది అవసరం!

సూర్యప్రభ వాహనం
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరింపచేశాడు. ఈ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యప్రభ వాహనంలో ఉండే స్వామిని దర్శించుకుంటే  సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. 

చిన్నశేషవాహనం 

సూర్యప్రభ వాహనం తర్వాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనంపై శ్రీవారి చిద్విలాసాన్ని చూసి తరించారు భక్తులు. చిన్న శేషుడిని నాగలోకానికి రాజుగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయం అనుసరించి భగవంతుడు శేషి..ఈ ప్రపంచం శేషభూతం అని అర్థం.  చిన్నశేష వాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే కుటుంబ శ్రేయస్సు ఉంటుందని భక్తుల విశ్వాసం

Tirumala: తిరుమలలో ఘనంగా మినీ బ్రహ్మోత్సవం - ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీ మలయప్పస్వామి చిద్విలాసం!

గరుడవాహనం

రథ సప్తమి ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ, చిన్న శేష వాహనం తర్వాత గరుడ వాహనంపై దర్శనమిచ్చారు మలయప్ప స్వామివారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. జ్ఞానవైరాగ్యానికి రూపం అయిన రెక్కలతో విహరించే గరుడుడిపై కొలువైన మలయప్పస్వామిని దర్శించుకుంటే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం 

Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!

హనుమంతవాహనం

 రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో వాహనసేవ హనుమంత వాహనం.  మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకూ మలయప్పస్వామి హనుమంతవాహనంపై మాడవీధుల్లో విహరించారు. భక్తులలో అగ్రగణ్యుడు అయిన ఆంజనేయుడు చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధి. హనుమంతవాహనంపై విహరించే మలయప్పస్వామి దర్శనం సకల భయాలను రూపుమాపి, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. 

Tirumala: తిరుమలలో ఘనంగా మినీ బ్రహ్మోత్సవం - ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీ మలయప్పస్వామి చిద్విలాసం!

ఈ వాహన సేవల్లో EO శ్రీ జె శ్యామల రావు, అదనపు EO శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, JEO శ్రీ వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, ఇంఛార్జి CVSO శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.  శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద ఉన్న స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అభిషేకం చేశారు. 

Tirumala: తిరుమలలో ఘనంగా మినీ బ్రహ్మోత్సవం - ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీ మలయప్పస్వామి చిద్విలాసం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య

వీడియోలు

Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget