అన్వేషించండి

కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భగవద్గీత.. రామ రావణ యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం - మీ విజయం కోసం ఇది అవసరం!

Aditya Hridayam: యుద్ధం చేయను అన్న అర్జునుడిని కర్తవ్యం దిశగా నడిపించింది భగవద్గీత. రావణుడితో యుద్ధ సమయంలో రాముడిని కార్యోన్ముఖుడిని చేసింది ఆదిత్యహృదయం..ఇదెంత పవర్ ఫుల్ అంటే...

Benefits of Aditya Hridayam Stotra: కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఆయుధాలు వదిలేసినన అర్జునుడిని కర్తవ్యం దిశగా నడిపించింది భగవద్దీత. అలాగే రావణుడితో యుద్ధానికి రాముడిని కార్యోన్ముఖుడిని చేసింది ఆదిత్యహృదయం...మరి మీ విజయం కోసం..
 
అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, అంతులేని నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఓ భగవంతుడా వీటినుంచి నన్ను పడేయ్ అనుకుంటారు కదా.. ఆ సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం ఇది
 
ఆదిత్య హృదయం  స్తోత్రం ప్రత్యక్షనారాయణుడిది 

వాల్మీకి రామాయణం యుద్ధకాండలో..యుద్ధంలో శ్రీరాముడు అలసట చెందిన సమయంలో అగస్త్య మహర్షి యుద్ధ భూమికి స్వయంగా వచ్చి ఉపదేశించిన స్తోత్రం ఇది. 

ఓ రామా ఆదిత్యుడి ప్రార్థన ఎనలేని శక్తినిస్తుంది..సంపదనిస్తుంద..విజయాన్ని అందిస్తుందని వివరించి చెప్పడం ప్రారంభించారు అగస్త్య మహర్షి

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

ఆదిత్య హృదయంలో ఏముంటుంది?

  • ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి
  • 1, 2  శ్లోకాలు అగస్త్యుడు శ్రీ రాముడికి వద్దకు రావడం గురించి  ఉంటుంది
  • 3 ,4, 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ  వల్ల కలిగే మంచి ఫలితాలగురించి వివరణ
  • 6 నుంచి 14 వ శ్లోకం వరకు సూర్యుడి గొప్పతనం వివరించడం
  • 15 నుంచి 21 శ్లోకం వరకూ సూర్యుడి ప్రార్థన ఉంటుంది
  • 22 నుంచి 27వ శ్లోకం వరకు ఈ ఆదిత్య హృదయం పఠిస్తే కలిగే సత్ఫలితాలు గురించి వివరణ
  • చివరి శ్లోకాల్లో శ్రీరామచంద్రుడు కార్యోన్ముఖుడు కావడం గురించి ఉంటుంది

ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాత రాముడు రావణుడిపై విజేతగా నిలిచాడు. అందుకే ఆపదలు , ఆనారోగ్యం, ఆర్థిక బాధలు.. వీటి నుంచి ఉపశమనం ఆదిత్య హృదయం. జాతకంలో సూర్య గ్రహ సంచారం ప్రతికూల ఫలితాలను ఇచ్చినప్పుడు ఆదిత్య హృదయం చదువుకోవడం మంచి ఉపశమనం.

Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!

ఆదిత్య హృదయం

ధ్యానం
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥  

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥  

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 

సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।
చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥  

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥  

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః॥ 

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥  

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 

వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।
ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥  

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥  

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥  

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః॥  

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥  

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥  

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥  

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।
నమస్తమోఽభి నిఘ్నాయ రవయే లోకసాక్షిణే ॥  

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥  

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।
ఏషఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్॥  

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యానికృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః॥ 

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।
కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥  

పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥  

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్తదా ।
ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥  

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥  

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥  

అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।
నిశిచరపతి సంక్షయంవిదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి॥  

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమఃసర్గః॥

Also Read: అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy Comments : జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Harish Rao: మంత్రులు సభకు ప్రిపేర్ అయి రావాలి, ఏ హామీపై అయినా చర్చకు రెడీ: హరీష్ రావు
మంత్రులు సభకు ప్రిపేర్ అయి రావాలి, ఏ హామీపై అయినా చర్చకు రెడీ: హరీష్ రావు
Nara Lokesh: పవన్ కళ్యాణ్ శాఖలో జోక్యం చేసుకున్న నారా లోకేష్ - క్షమాపణ చెప్పడంతో హాట్ టాపిక్
పవన్ కళ్యాణ్ శాఖలో జోక్యం చేసుకున్న నారా లోకేష్ - క్షమాపణ చెప్పడంతో హాట్ టాపిక్
Soundarya Husband Raghu Letter: సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమా? ఆమె భర్త రఘు ఏమంటున్నారు? లేఖలో ఏం చెప్పారు?
సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమా? ఆమె భర్త రఘు ఏమంటున్నారు? లేఖలో ఏం చెప్పారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Comments : జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జగన్ కోటరీ వల్లే పార్టీకి గుడ్ బై - ఘర్ వాపసీ ఉండదు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Harish Rao: మంత్రులు సభకు ప్రిపేర్ అయి రావాలి, ఏ హామీపై అయినా చర్చకు రెడీ: హరీష్ రావు
మంత్రులు సభకు ప్రిపేర్ అయి రావాలి, ఏ హామీపై అయినా చర్చకు రెడీ: హరీష్ రావు
Nara Lokesh: పవన్ కళ్యాణ్ శాఖలో జోక్యం చేసుకున్న నారా లోకేష్ - క్షమాపణ చెప్పడంతో హాట్ టాపిక్
పవన్ కళ్యాణ్ శాఖలో జోక్యం చేసుకున్న నారా లోకేష్ - క్షమాపణ చెప్పడంతో హాట్ టాపిక్
Soundarya Husband Raghu Letter: సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమా? ఆమె భర్త రఘు ఏమంటున్నారు? లేఖలో ఏం చెప్పారు?
సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమా? ఆమె భర్త రఘు ఏమంటున్నారు? లేఖలో ఏం చెప్పారు?
Posani:  పోసానికి కలసి రాని అదృష్టం - అడ్డం పడిన సీఐడీ - హైకోర్టులోనూ షాకే !
పోసానికి కలసి రాని అదృష్టం - అడ్డం పడిన సీఐడీ - హైకోర్టులోనూ షాకే !
OTT Crime Thriller: సీఎం బాబాయ్ మర్డర్ మిస్టరీ... ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ క్రైం థ్రిల్లర్, ఎందులో చూడొచ్చో తెలుసా?
సీఎం బాబాయ్ మర్డర్ మిస్టరీ... ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ క్రైం థ్రిల్లర్, ఎందులో చూడొచ్చో తెలుసా?
EPFO: EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం
EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం
KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Embed widget