Srisailam- Corona: కరోనా ప్రభావం...శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఆంక్షలివే..
కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆలయాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈవో లవన్న.
కరోనా నియంత్రణలో భాగంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న వెల్లడించారు. అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామివారికి రోజుకు 4 సార్లు సామూహిక అభిషేకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని భక్తులకు సూచించారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శన టికెట్లు ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్తప్పనిసరి అని ఈవో లవన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం లఘు దర్శనం మాత్రమే కలిపిస్తున్నామని...శఠారి, తీర్థం, ఉచిత ప్రసాదం పంపిణీని నిలిపివేస్తున్నామని చెప్పారు. గంటకు కేవలం వెయ్యి మంది భక్తుకు మాత్రమే దర్శనం కల్పించనున్నామన్నారు.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
పరిమిత సంఖ్యలోనే ఆర్జిత సేవలు జరుగుతాయని... అందుబాటులో ఉన్న ఆర్జిత సేవల్లో ప్రస్తుతం జారీ చేస్తున్న టికెట్లలో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయించనున్నట్టుగా ఈవో వివరించారు. భక్తులు ఆన్ లైన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇక సామూహిక ఆర్జిత అభిషేకాలు రోజుకు నాలుగు విడుతలుగా నిర్వహించనున్నామన్నారు. ఒక్కో విడతలో 75 టికెట్లు జారీ చేస్తామన్నారు. వీరికి కేవలం స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.
Also Read: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట
కరోనా కారణంగా వృద్దులు, గర్భిణీలు, చంటి పిల్లల తల్లులు పదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు ఆలయానికి రావొద్దని ఈఓ సూచించారు. తమకు కేటాయించిన సమయానికే ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులు రావాలని కోరారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న బక్తులను క్యూ లైన్లలో అనుమంతించబోమన్నారు. క్యూ లైన్లలో ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరన్నారు. శ్రీశైలంలో ఎక్కువ రోజులు ఉండకూడదని భక్తులకు సూచించిన ఈవో.. సాతాళగంగలో స్నానాలతో పాటూ రోప్‌వే, బోటింగ్ సైతం కూడా నిలిపివేసినట్టు చెప్పారు.
Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదంటారు …ఎందుకో తెలుసా..
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి