అన్వేషించండి

Chaturmasya Deeksha 2026: చాతుర్మాస్య దీక్ష ఎప్పటి నుంచి ప్రారంభం! ఎవరైనా చేయొచ్చా , నియమాలేంటి, ఆరోగ్యం రహస్యాలేంటి?

Chaturmasya 2026 : చాతుర్మాసాలు అంటే ఆషాఢ మాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి నుంచి కార్తీకపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి వరకు సమయం. ఈ నాలుగు నెలలు ఆచరించే చతుర్మాస దీక్ష నియమాలేంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉపవాసం, దైవారాధన, దానాలు, ఆరోగ్య నియమాలు పాటిస్తారు.

Chaturmasya Deeksha 2026: చాతుర్మాసం దీక్ష జూలై 25న ప్రారంభమవుతుంది. ఏటా దేవశయని ఏకాదశితో చాతుర్మాస్ ప్రారంభమై కార్తీకమాసంలో వచ్చే దేవుత్తని ఏకాదశితో ముగుస్తుంది. ఈ ఏడాది జూలై 25 నుంచి నవంబర్ 21 వరకూ చాతుర్మాస్యం. ఈ నాలుగు నెలలు.. శ్రావణ, ఆషాఢ, భాద్రపద, కార్తీకంలో వివాహాది శుభకార్యాల కన్నా దీక్షలు, వ్రతాలు, నోములపై శ్రద్ధవహిస్తారు. చాతుర్మాసంలో నాలుగు నెలలు విష్ణుమూర్తి విశ్రాంతి కాలం. ఏ శుభకార్యానికైనా విష్ణుమూర్తి అనుగ్రహం అవసరం అని..అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. పూజ, జపం, ఉపవాసం, దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
 
స్కంద పురాణంలో..

చాతుర్మాస్యే తు యో భక్త్యా నియమం సముపచరేత్
స యాతి విష్ణులోకం వై సర్వపాపైః ప్రముచ్యతే॥ 

చాతుర్మాసాల్లో క్రమపద్ధతిలో భక్తితో ఉపవాసం ఉండి ధ్యానం చేస్తే పాపవిముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడని అర్థం.

సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉన్నాయి. వాటిలో మొదటిది తొలి ఏకాదశి..దీన్నే శయన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే సమయం. ఈ రోజు నుంచి విష్ణువు నిద్రించే నాలుగు నెలలు చేపట్టేదే చాతుర్మాస దీక్ష. ఈ నాలులు నెలలు నేలపై నిద్రించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, దైవారాధనలో మునిగితేలడం, రోజుకి ఓ పూట మాత్రమే భోజనం చేయడం పాటిస్తారు.  

ఈ నాలుగు నెలలు పీఠాధిపతులు ఒకే దగ్గర ఉండిపోతారు..దీక్ష పూర్తైన తర్వాత మరో ప్రదేశానికి వెళతారు.

చాతుర్మాస్య దీక్ష గురించి పురాణ కథ
 
ఓసారి కైలాసంలో శివపార్వతులు ఆశీనులై ఉండగా..స్వామీ మీ చేయి ఇంత మృదువుగా ఉంది ఎందుకు అని అడిగింది పార్వతి. పరోపకారం చేయడం వల్ల చేతులు మృదువుగా, సున్నితంగా ఉంటాయని చెప్పాడట. ఎముకలేని చేయి అంటే అర్థం ఇదే. ఆ మాట విని లోకమాతకి పరోపకారం చేయాలనిపించింది. మారువేషంలో భూలోకానికి వెళ్లింది. నారేళ్లనాచి అనే గర్భిణికి సహాయంగా ఉంటూ సేవలు చేసి 11 రోజుల తర్వాత ఐశ్వర్యాన్ని ప్రసాదించి..చాతుర్మాస్య వ్రతం గురించి చెప్పి మాయమైపోయింంది. ఐదేళ్ల తర్వాత అదే ఇంటికి వెళ్లింది పార్వతీ దేవి. దాహంగా ఉంది నీరిమ్మని అడిగితే.. తాను వ్రతంలో ఉన్నాను అని చెప్పిందట. అవమానంగా భావించిన పార్వతి.. ఆమెకు తానిచ్చిన ఐశ్వర్యాన్ని తిరిగి తీసుకోవాలని శివుడికి చెప్పింది. అయితే ఆమె చాతుర్మాస్య వ్రతం ఆచరించింది కాబట్టి ఐశ్వర్యం తిరిగి తీసుకోవడం సాధ్యంకాదన్నాడు శివుడు. విష్ణువు నుంచి కూడా అదే సమాధానం వచ్చింది. ఇక రంగంలోకి దిగిన నారదుడు నారేళ్లనాచి వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో అప్పుడు పార్వతీదేవిని శరణువేడింది. చాతుర్మాస్యం అంత శక్తివంతమైనది..
 
చాతుర్మాస్యం వ్రత నియమాలు

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

4 నెలల పాటూ  నాలుగు ఆశ్రమాల వారు  బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసంలో ఉన్నవారు అందరూ పాటించవచ్చు.  కుల, వర్గ నియమాలు లేవు..లింగవివక్ష లేదు. 

ఆరోగ్య ప్రాధాన్యత

వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో ప్రారంభమవుతుంది చాతుర్మాస్య వ్రతం.  సూర్య కిరణాలు వేడి తగ్గే సమయం కావడంతో రోగాలు మొదలవుతాయి..అందుకే ఈ నాలుగు నెలలు ఆహార నియమాలు పాటిస్తారు
 
శ్రావణంలో ఆకుకూరలు తినకూడదు

భాద్రపదంలో పెరుగు ఎక్కువగా తీసుకోకూడదు

ఆశ్వయుజంలో పాలు, పాల పదార్థాలు తీసుకోకూడదు
 
కార్తీకంలో పప్పు పదార్థాలు తీసుకోకూడదు, ఉసిరి కాయలు తీసుకోవచ్చు
 
ఈ నాలుగు నెలల కాలంలో, ఆహారపు అలవాట్లు, జీవనశైలి , కోరికలను నియంత్రించుకోవాలని ప్రోత్సహిస్తారు. ఈ సమయంలో సాధువులు, ఋషులు ఒకే చోట నివసిస్తూ, ప్రబోధాలు, ఆధ్యాత్మిక సాధనల ద్వారా పుణ్యాన్ని కూడగట్టుకుంటారు. చాతుర్మాసంలో దానం చేయడం, జపించడం, తపస్సు చేయడం, స్నానం చేయడం శాశ్వతమైన ప్రతిఫలాలను ఇస్తాయని నమ్ముతారు. చాతుర్మాస్య దీక్ష చేసేవారు ఈ నాలుగు నెలలు మరో ప్రదేశానికి కదలరు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి వ్రతం ఆచరిస్తారు. దాన ధర్మాలు చేస్తారు.  

గమనిక: వివిధ గ్రంథాల నుంచి సేకరించిన వివరాలు, ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథాతథంగా అందించాం.  ఇందులో పేర్కొన్న అంశాలు ప్రాధమిక సమాచారం కోసం మాత్రమే. మీరు పరిగణలోకి తీసుకుని ఆచరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి

Frequently Asked Questions

చాతుర్మాసంలో ఏమైనా ఆహార నియమాలు ఉన్నాయా?

అవును, శ్రావణంలో ఆకుకూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీకంలో పప్పు పదార్థాలు తినకూడదు. ఈ నియమాలు ఆరోగ్య కారణాల వల్ల పాటించబడతాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
Advertisement

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget