ఇలాంటి ఇంటికి దేవుడు వస్తాడు

Published by: RAMA

ఎప్పుడూ మాకోసమే అంటూ.. కుటుంబానికి సరిపడా వండుకుని తినేయడం కాదు

ఇంటికి అతిథి వస్తూ ఉండాలి, కాళ్లు కడుక్కోవాలి, భోజనం చేసి సంతోషంగా వెళ్లాలి

అతిథి రూపంలోనే భగవంతుడు వస్తాడు..అతిథి తిన్నది పరమేశ్వరుడికే చెందుతుంది

అతిథికి ఆనందంగా పెట్టిన భోజనమే మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది

భాగవతంలో దశమస్కంధంలో యశోదమ్మ ఇలా అంటుంది

శ్రీ కృష్ణుడు గండాల నుంచి తప్పించుకున్నప్పుడు గత జన్మలో తెలిసో తెలియకో ఎవరికి ఏం పెట్టామో..

ఆ పుణ్యమే ఈ రోజు కృష్ణుడిని కాపాడింది అని చెబుతుంది యశోద

ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా..అలవాటు అయ్యేది కాఠిన్యం

ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తే వచ్చే గుణం కరుణ, దయ,దానం

కరుణ, దయ, దానగుణం ఉన్నవారింటికి భగవంతుడు స్వయంగా వస్తాడు