Chanakya Niti In Telugu: చాణక్యుడి కాలంలో సివిల్-క్రిమినల్ నేరాలకు శిక్షలేంటో తెలుసా!
ఆచార్య చాణక్యుడికి సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది . ఇప్పటికీ ఎందరో పాలుకులు, నాయకులు వీటిని అనుసరిస్తుంటారు. సివిల్-క్రిమినల్ నేరాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే..
Chanakya Niti In Telugu: చాణక్యుడిని..కౌటిల్య లేదా విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. రాజనీతిజ్ఞుడు , తత్వవేత్త అయిన చాణక్యుడు రాజకీయాలపై ఒక క్లాసిక్ గ్రంథాన్ని రచించాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన చాణక్యుడు అర్థశాస్త్రంలో మాత్రమే కాదు ఔషధం, జ్యోతిష్యశాస్త్రంలో అద్భుతమైన విషయాలను తన శిష్యులకు బోధించాడు. గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి...చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. ముఖ్యంగా రాజ్యంలో పరిపాలన సక్రమంగా సాగాలంటే నేరాలు చేసేవారికి విధించే శిక్షలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలని...అయితే అన్ని సందర్భాలలోనూ కఠినత్వం పనికిరాదని రెండు విధాలుగానూ చెప్పాడు. ఇందులో భాగంగా కౌటిల్యుడు ఎన్నో రకాల సివిల్, క్రిమినల్ నేరాల గురించి చెప్పాడు. ఆ నేరాలను చేయడం వల్ల ఏఏ శిక్షలు ఉంటాయోకూడా వివరించాడు. అవేంటంటే..
Also Read: ఈ వారం ఈ రాశులవారిలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది, ఇలా అనుకుంటే అలా అవుతాయ్ అన్నీ!
పద్దులు రాయడం లో , ఆడిట్ చెయ్యడంలో చేసిన మోసాలు
- పరిపాలనకి సంబందించిన మోసాలు
- కల్తీలు చెయ్యడం వల్ల జరిగే మోసాలు
- గృహదహనాలు , పంటపొలాలు దహనాలు
- నాణెములు ముద్రణ విషయములో అవతవకలు
- దౌర్జన్యంగా ఇతరుల పై దాడి చెయ్యడం
ఇలాంటి విషయాలే కాకుండా పలు నేరాల గురించి కూడా చెప్పాడు
- పెళ్లిళ్ల విషయములలో క్రూరత్వము
- జంతువుల విషయములో క్రూరత్వము
- వేరే వాళ్ళ ఆస్తులను నాశనము చెయ్యటం
- ప్రభుత్వ ఆస్తులను నాశనము చెయ్యటం
Also Read: మే నెలలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది
కౌటిల్యుని అర్ధశాస్త్రాన్ని ఒక శిక్షాస్మృతిగా అంగీకరిస్తే, దానిని ఈ విధముగా చెప్పొచ్చు
1.కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఎన్నో రకాల నేరాలను గుర్తించి, ఈ నేరాలకు తగిన శిక్షను, అపరాధరుసుమును చెప్పాడు
2.ఈ శిక్షలు - ఫణములో 1/8 భాగము అపరాధరుసుము నుంచి మరణదండన వరుకు ఉండొచ్చు
3.అపరాధరుసుముల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది కానీ దాని లక్ష్యము అది కాదు. నేరస్థులు మళ్లీ నేరాలు చెయ్యకుండా ఉండటమే దాని ప్రధాన లక్ష్యం
4.చాణక్యుడు శిక్షల గురించి చెబుతూ, న్యాయమూర్తులు విధించిన శిక్ష మరీ క్రూరంగా ఉండకూడదు. మరీ మెత్తగా తేలికగా తీసిపారేసేటట్టు ఉండకూడదు అన్నాడు. న్యాయమూర్తులు విధించిన శిక్షలు మరీ క్రూరంగా ఉంటే..దానివల్ల ప్రజలకు అసంతృప్తి కలగవచ్చు. మరీ తేలిగ్గా ఉంటే ప్రజలకు రాజరికం మీద భయం లేకుండా పోతుంది.
5.న్యాయము విషయములో పెద్ద, చిన్న ఉండకూడదు. తాను రాకుమారుడు అయినా, విరోధి కుమారుడు అయినా, న్యాయ దేవత దృష్టిలో అందరు సమానమే.
6.ఒక అమాయకుడికి ఏవిధంగా చూసినా శిక్షార్హుడు కానివాడికి అపరాధ రుసుము విధించకూడదు. ఒకవేళ, అలాంటిది జరిగితే, రాజు గారు ఆ శిక్షను రద్దు చెయ్యడమే కాకుండా, ఆ న్యాయమూర్తి నుంచి పది రెట్లు అపరాధరుసుము వసూలుచేసి దానిని అనవసంగా శిక్షను అనుభవించిన వారికి ఇవ్వాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాల నుంచి, పండితుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఇందుకు ‘ఏబీపీ దేశం’ ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత తీసుకోదని గమనించగలరు.