అన్వేషించండి

Chanakya Neeti Telugu: ఇలాంటి పనులు చేస్తే మీరు ఎన్నిపూజలు చేసినా ప్రయోజనం ఉండదన్న చాణక్యుడు

ఓవ్యక్తి భౌతిక సంపదద్వారా ఉత్తముడు కాలేడు. ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయన్నదానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం బయటపడుతుందన్నాడు అర్థశాస్త్ర పితామహుడు ఆచార్య చాణక్యుడు . మరి ఉత్తముడు కావాలంటే...

Chanakya Neeti Telugu: దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా..ఆ రూపంలో 8 మందిని మీ చుట్టూ పెట్టాడు..వాళ్లని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదన్నాడు చాణక్యుడు.
1. అమ్మ
దేవుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోనివారంతా కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. 9 నెలలు తన కడుపులో భద్రంగా దాచుకుని భూమ్మీద పడ్డాక కంటికిరెప్పలా కాపాడుకుంటూ..మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లిరుణం మీరు ఏం ఇచ్చినా తీర్చుకోలేరు..అందుకే రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు కానీ అస్సలు అవమానించరాదు..

2. నాన్న
బిడ్డ పుట్టకముందునుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి. పిల్లల్ని పెంచి పెద్దచేసేందుకు, సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతాడు. తండ్రి లేనిదే మీ పుట్టుక లేదు.. అలాంటి వ్యక్తిని దూషించడం, పట్టించుకోకుండా వదిలేయం చేస్తేవారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని, ఇంత కన్నా పాపం మరొకటి లేదని చెప్పాడు చాణక్యుడు. 

Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 

3. గురువు
తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుదే. సమాజ ఉద్ధరణకు విద్య ఆయుధం లాంటిది. ఓ వ్యక్తికి ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం. మిమ్మల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దిన వారిని పొరపాటునైనా దూషిస్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇలాంటి వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు

4.మీ శ్రేయోభిలాషి
తల్లిదండ్రులే కాదు..మీకు విలువలు నేర్పించే వ్యక్తులు కొందరుంటారు. వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావొచ్చు, చుట్టుపక్కల కావొచ్చు, బయటివారు కావొచ్చు... మంచి చెప్పినా చెవికి ఎక్కించుకోకుండా ధిక్కరించడం అంటే దేవుడిని అవమానించినట్టే అన్నాడు చాణక్యుడు

5. మీకు భోజనం పెట్టిన వ్యక్తి
ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోందన్నది నిజమే కానీ ఆ డబ్బు అన్ని వేళలా ఆకలి తీర్చలేదు కదా. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చాణక్యుడు..మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు. మీ జీవితంలో శత్రువులు, స్నేహితులు చాలామంది ఉండొచ్చు కానీ...మీరు ఎవరన్నది కూడా తెలియకుండా ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అలాంటి వారికి గౌరవం ఇవ్వనివాళ్లు..దేవుడుని పూజించి ఏం లాభం..

Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు

6. స్నేహితుడు
స్నేహితుల్లో..ఉత్తములు ఉంటారు, అధములు ఉంటారు. ఎవరు ఏంటన్నది తెలుసుకోవాలి. కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రిలాంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీకు తెలియకుండా కూడా దూషించకండి అన్నాడు చాణక్యుడు.

7. భార్య తల్లిదండ్రులు
చాలామంది మగవారు..తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు కానీ.. భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి, నిజంగా తల్లిదండ్రులను గౌరవించే వారు ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులనూ దూషించలేరన్నాడు చాణక్యుడు. ఇలాంటి దూషణకు పాల్పడినవారిని దేవుడు కూడా క్షమించడని చెప్పాడు.

8.సంరక్షకులు
తల్లి, తండ్రి స్థానంలో సంరక్షకులుగా ఉంటారు కొందరు. వాళ్లు కూడా అహర్నిశలు మీ బాగుకోసం పాటుపడుతూ ఉంటారు. వారిపై విధేయత చూపాలి. లేదంటే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు..

ఈ ఎనిమిదిమందిని దూషిస్తే..స్వయంగా దైవ దూషణ చేసినట్టే అన్నాడు చాణక్యుడు.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget