Chanakya Neeti In Telugu: కష్టకాలంలోనే వీరి నిజ స్వరూపం తెలుస్తుంది..!
Chanakya Niti: మన నిజమైన సన్నిహితులు ఎవరో తెలుసుకునే సమయం రావాలి. ఆ సమయం వచ్చే వరకు మనం ఎవరినీ అతిగా నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు. మనం ఎవరినైనా విశ్వసించే ముందు వారిని ఇలా పరీక్షించాలి
Chanakya Niti: వందేళ్ల తర్వాత కూడా ఆచార్య చాణక్యుడి సూత్రాలు ప్రపంచంలోని అనేకమంది ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తూ జ్ఞానోదయం చేస్తూనే ఉండటం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే గర్వించదగిన విషయం. ఆచార్య చాణక్యుడు జీవితంలోని అనేక రంగాల గురించి చాలా రహస్యమైన విషయాలు చెప్పాడు. జీవితంలో అనేక అంశాలపై ఆయన ఇచ్చిన సూత్రాలను పాటిస్తే విజయం సాధించవచ్చు. మన జీవితంలో కష్ట కాలంలోనే, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే, జీవిత మార్గంలో కొంతమందిని గుర్తించగలరని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
Also Read : పంచతంత్రంతో విజయ రహస్యం
1. మొదటి పద్యం:
జనీయత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్వ్యాసనాగమే|
మిత్రం చాప్తికాలేషు భార్యాం చ విభవక్షయే||
ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో ఒకరికి ఉద్యోగం వచ్చినప్పుడు సేవకుడి నిజస్వరూపం, కష్టం వచ్చినప్పుడు కుటుంబం వాస్తవికత, ఇబ్బంది వచ్చినప్పుడు మిత్రుడి వైఖరి, సంపద కోల్పోయినప్పడు, ఓడిపోయినప్పుడు భార్య యొక్క గుణం తెలుస్తుందని చెప్పాడు.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక సేవకుడు ఉద్యోగంలో నియమితుడయినప్పుడే, అతను ఎంత సమర్థుడో తెలుస్తుంది. అదే విధంగా, ఒక వ్యక్తి ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, స్నేహితులు, బంధువులు మనతో ఎలా వ్యవహరిస్తారో అదే సమయంలో వెల్లడవుతుంది. నిజమైన స్నేహితుడు సంక్షోభ సమయాల్లో మాత్రమే గుర్తింపు పొందుతాడు. అదేవిధంగా డబ్బు లేనప్పుడు భార్య ప్రేమ నిజమైన ప్రేమా లేక డబ్బుపై వ్యామోహమా అని తెలుసుకోవచ్చు.
2. రెండవ పద్యం:
అతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు - సంకటే|
రాజద్వారే స్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః||
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు, కరువు, శత్రువుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు, అతను కష్టాలలో చిక్కుకున్నప్పుడు, మరణ వేదనలో ఉన్నప్పుడు, అతనితో పాటుగా ఉండే వ్యక్తి అతని నిజమైన స్నేహితుడు. అంటే, ఈ పరిస్థితుల్లో ఎవరికైనా సహాయం కావాలి.
మనం కష్టాల్లో ఉన్నప్పుడే చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వరూపాలను పూర్తిగా తెలుసుకోగలం. భార్య అయినా, బంధువు అయినా, స్నేహితుడైనా.. కష్టాల్లో ఉన్నప్పుడే అతని నిజస్వరూపం తెలుస్తుందని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు.
Also Read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.