అన్వేషించండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

జ్యోతిషంలో సూచించిన ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని పరిహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నం మూలం ఇదం జగత్. జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత అటువంటిది. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడి పని చేసేది డబ్బు కోసమే. అయితే అన్ని సార్లు అందరూ కష్టానికి తగిన ఫలితం దొరకదు. ఒకవేళ డబ్బు సంపాదించగలిగినా అది నిలబడదు. నిల్వకాదు. ఎంత ప్రయత్నం చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం మన సనాతన ధర్మశాస్త్రాలలో చాలా రకాల పరిహారాలు ఎన్నో ఉన్నాయి.

మట్టి కలశం

ఒక చిన్న మట్టి కుండ తీసుకోవాలి. ఇందులో రూపాయి నాణాలు 5 ఉంచాలి. వాటితో పాటుగా బియ్యం, గోధుమలు, బార్లీ వంటి ఇతర ధాన్యంతో కలశం నింపాలి. ఈ కలశాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి దారంతో కట్టి మూసెయ్యాలి. ఇప్పుడు దీన్ని లక్ష్మీ పూజలో ఉంచాలి. పూజ తర్వాత ఈ కలశాన్ని డబ్బు దాచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల కొద్ది రోజుల్లోనే  మంచి ఫలితాలు కనిపించవచ్చు. రోజులు గడిచేకొద్ది కాలం కలిసి రావచ్చు.

కొబ్బరికాయ పరిహారం

కొబ్బరికాయ ను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను లక్ష్మీ పూజ లో ఉంచి పూజ చెయ్యాలి. ఆతర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

లక్ష్మీ ఆరాధన

శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేసుకుని పసుపు వేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటికి రమ్మని ఆహ్వానించాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. గులాబి పువ్వులు, గులాబి మాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా వరుసగా 11 శుక్రవారాల పాటు క్రమంతప్పకుండా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటుండదు.

గవ్వలు

ఎల్లో కౌరీస్ అనే గవ్వలను ఏడింటిని తీసుకుని ఇంటిలో జాగ్రత్త చేసుకోవాలి. ఈగవ్వలు ఇంట్లో ఉంటే దరిద్ర్యం దరి చేరదు. లక్ష్మీపూజలో ఉంచిన డబ్బు కూడా నిలిచి ఉంటుంది.

ఈ పనులు చెయ్యకూడదు

నీటి వృథా తగదు

చాలా మంది నీటి వృథాను అసలు పట్టించుకొరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. నీటిని వృధా చెయ్యకూడాదు. నీటి వృథా జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు. ఎప్పటికప్పుడు అన్ని కుళాయిలు కట్టేస్తూ ఉండాలి. లీకేజిలు లేకుండా చూసుకోవాలి.

పూజ గదిలో నైర్మల్యం

ఆది పూజ ఎప్పుడూ గణపతికే అనే విషయాన్ని మరువకూడదు. ప్రతి రోజూ మొదటి పూజ తప్పకుండా గణపతికే చెయ్యాలి. కొంత మంది పూజా మందిరంలో పూజకు ఉపయోగించిన పూలు, అలంకరణకు వాడిన పువ్వులను చాలారోజుల పాటు తీసెయ్యకుండా అలాగే ఉంచేస్తారు. అది మంచిది కాదు. ప్రతిరోజు నైర్మల్యాన్ని తీసెయ్యాలి. లేకపోతే ఇంట్లో సంపద నిలువదు.

తలుపుల్లో శబ్ధం

ఇంట్లో తలుపులు లేదా కిటికీలు తెరుస్తున్నపుడు చప్పుడు చేస్తుంటాయి. అది అసలు మంచిది కాదు. అలా చప్పుడు చేస్తున్న తలుపు ఊచల్లో నూనె వేసి చప్పుడు రాకుండా చూసుకోవాలి. ఇది ఆర్థిక నష్టాలకే కాదు, ఇంట్లో అనుబంధాల మధ్య కూడా చిచ్చు పెడుతుంది.

విరిగిన లేదా పగిలిన వస్తువులు

ఇంట్లో విరిగిన లేదా పగిలిన వస్తువులు ఎలాంటివైనా సరే వాటిని తొలగించాలి. ఇలా విరిగి పోయిన లేదా పగిలిపోయిన వస్తువుల వల్ల ఇంట్లో డబ్బు నిలవదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Unstoppable With NBK: రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
రష్మిక పెళ్లి ప్రస్తావన... 'డాకు మహారాజ్' టీం సీక్రెట్స్ అన్నీ బయట పెట్టిన బాలయ్య
Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ
భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు - విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ
Embed widget