By: ABP Desam | Updated at : 30 Jul 2021 04:34 AM (IST)
బ్రహ్మ ముహుర్తం విశిష్టత
బ్రహ్మ ముహూర్తం అనే మాట అందరూ వినేఉంటారు. కానీ దీనికి సరైన అర్థం తెలుసా? సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మీ అంటే సరస్వతి. మనలోని బుద్ధి ప్రభోదం చెందే కాలం కాబట్టి బ్రహ్మీముహూర్తం అని అంటారు.
బ్రహ్మముహుర్తాన్ని పూర్వ కాలంలో ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. అహోరాత్రంకు ఇలాంటి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలుంటాయి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ....అందుకే బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం బ్రహ్మముహూర్తం.
హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ఈ సమయం వేకువ జామున 4 గంటల నుంచి 05.30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు.
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||
దీనర్థం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని అర్థం. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. లేలేమ్మని మేల్కొలుపుతుంది.
వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఈ సానుకూల శక్తితో ఏపని ప్రారంభించినా విజయం తథ్యం.
ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది. ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు.
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందంటే...
కశ్యపుడు-వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు, సూర్యునికి రథసారథి. ఓ సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలనే కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అనూరుడిని సూర్యుని సారథిగా నియమించి.....నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో ఏ నక్షత్రాలు, గ్రహలు చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది.
ఎవరు ప్రాజ్ఞుడు?
“కర్తవ్యమ్ ఆచారం కామమ్ అకర్తవ్యమ్ అనాచారమ్
తిష్ఠతి ప్రాకతాచారో యసః ఆర్య ఇతిస్మ్రతః”
చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ, చేయకూడనివి వదిలేస్తూ, సదాచారంతో మసలేవాడే ప్రాజ్ఞుడు/ వివేకవంతుడు. ‘తెల్లవారుజాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది’. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించిందని సిగ్గుపడేవాడినంటారు.. లోకమాన్య బాలగంగాధర్ తిలక్.
ఉదయమే ప్రశాంతం
ఉదయం సమయంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలై, మనసులోని ఒత్తిళ్ళను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. తలలో కుడివైపున ఉన్న ఒక గ్రంధి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాటవాన్ని పెంచుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. తెల్లవారు జామున శరీరం ప్రాణవాయువును ఎక్కువగా తీసుకుంటుంది. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.
ముఖ్యనిర్ణయాలన్నీ తెల్లవారుజామునే
బెంజమిన్ ఫ్రాంక్లిన్… ‘గత 50 సంవత్సరాల్లో నేను నిద్రపోతూ ఎప్పుడూ సూర్యుడికి పట్టుబడలేదు.’ అంటారు.. అమెరికా రాజ్యాంగ పితామహుడు థామస్ జెఫర్‌సన్, జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారు జామున ఒక గంటలో చేయగలిగిన పని, మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు, మూడు గంటలు పడుతుందనేవారు. తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారు జామున తీసుకున్నవేననీ చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యతని తెలియజేస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే....బ్రహ్మ ముహూర్తకాలంలో ఏ పని చేసినా విజయం తథ్యం.....
Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 7th July 2022: జులై 7 గురువారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, జ్ఞానసంపదనిచ్చే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!
TRS Again Sentiment Plan : ఈ సారి అదే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్న టీఆర్ఎస్ ! అదొక్కటే మార్పు - మిగతా అంతా సేమ్ టు సేమ్ !
Cooking Oil Prices: గుడ్ న్యూస్! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!
India vs WI: టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ - ఈసారి చాన్స్ ఎవరికంటే?
Naga Chaitanya: చైతు ఎమోషనల్ థాంక్యూ నోట్ - అందులో సమంత హ్యాష్ కూడా!