News
News
X

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

జనవరి 29 ఆదివారం భీష్మాష్టమి. ఈ రోజు ప్రత్యేకత ఏంటి..ఏం చేయాలి.. అసలు శ్రీకృష్ణుడికి ఇష్టుడిగా భీష్ముడు ఎందుకు మారాడో చూద్దాం..

FOLLOW US: 
Share:

Bhishma Ashtami 2023: రధ సప్తమి మర్నాడు వచ్చే అష్టమిని భీష్మాష్టమి. ఈ రోజునే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేశాడు. ఈ రోజు ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ  తర్పణం విడువాలని చెబుతారు పండితులు

తర్పణం ఇచ్చేటప్పుడు చదవాల్సిన శ్లోకం
భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః !
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్ !!

వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ !
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే !!

వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ !
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే !!

అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!

Also Read: పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

భీష్ముడి విశిష్టత
శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు కదా..మరి మీరు నిరంతరం ఎవర్ని స్మరిస్తున్నారని. ఆ ప్రశ్నకు కృష్ణుడు చెప్పిన సమాధానం విని అక్కడంతా ఆశ్చర్యపోయి చూశారు. శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే..  నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని…ఆ భక్తుడే భీష్మపితామహుడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని , ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని గుర్తించిన అతికొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించక పోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు. అందుకే  “ప్రహ్లాద , నారద , పరాశర , పుండరీక , వ్యాస , అంబరీశ , శుక , శౌనక , భీష్మ దాల్భ్యాన్” అంటూ మహాభక్తుల కోవలో పరిగణించారు.
భగవంతుడు కూడా భక్త పరాధీనుడు..ఎవరైతే స్వామికోసం మనస్ఫూర్తిగా తరిస్తారో ఆ భక్తుడి కోసం పరమాత్ముడు కూడా ఆలోచిస్తాడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులూ , కృష్ణుడూ వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం 
“సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబు లేను విడుతు నందాక నిదె మంధాసుడై 
వికసిత వదనార విందుడై వచ్చి నేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు
మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి జేసితినొ పుణ్యమితని గూర్చి” అని అంటాడు. ఆ సమయంలో భీష్ణుడు చెప్పినదే విష్ణుసహస్రనామం... 

కోరుకున్నప్పుడు మరణించగల వరం
పురాణాల ప్రకారం భీష్ముడు... శంతనుడు - గంగ కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతనుడి నుంచి ఇఛ్చా మరణం అంటే కోరుకున్నప్పుడు మరణం సంభవించే వరం పొందాడు. అంతేతప్ప తన ఇష్టానికి విరుద్ధంగా ఎవ్వరూ చంపలేరు. అందుకే దక్షిణాయంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసినప్పటికీ ఉత్తరాయణం వచ్చేవరకూ భీష్ముడు కన్నుమూయకుండా అంపశయ్యపై ప్రాణాలతో ఉండిపోయి..ఉత్తరాయణంలో ప్రారంభమైన తర్వాత తుదిశ్వాశవదిలాడు...

Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

రుణం తీర్చుకునేందుకే కౌరవుల పక్షం
భీష్మ పితామహుడు మహాభారతంలో కౌరవుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తమ జ్ణానం, శక్తి మంచి మరియు చెడులను అర్థం చేసుకున్నప్పటికీ, తాను అంపశయ్యపై పడుకున్నప్పుడు తన నిర్ణయానికి గల కారణాన్ని వివరించాడు. తాను కౌరవులతో జీవించి వారి ఉప్పుతిన్నందున ఆ రుణం తీర్చకోవడం తన ధర్మం అని వివరించాడు. ఆ సమయంలో కొన్ని తప్పులు జరుగుతున్నా చూస్తూ ఏమీచేయలేక ఉండిపోయినందుకు పాపపరిహారమే ఈ అంపశయ్య అని వివరించాడు. 

Published at : 29 Jan 2023 11:41 AM (IST) Tags: sri krishna mahabharat Bhishmashtami 2023 panadavas bhishma ekadashi 2023 Jaya ekadashi 2023

సంబంధిత కథనాలు

జస్ట్ రూ.2తో మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగించుకోవచ్చు, ఎలాగంటే..

జస్ట్ రూ.2తో మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగించుకోవచ్చు, ఎలాగంటే..

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

దారిలో మీకు డబ్బులు లేదా నాణేలు దొరికాయా? అది దేనికి సంకేతమో తెలుసా?

దారిలో మీకు డబ్బులు లేదా నాణేలు దొరికాయా? అది దేనికి సంకేతమో తెలుసా?

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

టాప్ స్టోరీస్

నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

నాటు నాటు  పాట కోసం 19 నెలలు -  చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్‌ కౌంటర్‌!

ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్‌ కౌంటర్‌!

NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ

NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ