IRCTC Ayodhya Tour: కేవలం రూ.17 వేలతో 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. IRCTC అద్భుతమైన టూర్ ప్లాన్ ఇది !
Bharat Gaurav Tourist Train Packages: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య, కాశీ వెళ్లాలని భావించే భక్తులకు అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది IRCTC. పూర్తి వివరాలు, సంప్రదించాల్సిన నంబర్లు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Ayodhya Tour: జీవితకాలంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అనుకునే క్షేత్రం కాశీ. సప్తమోక్షపురాల్లో ఒకటి వారణాసి. శివుడు నిర్మించిన ఈ నగరంలో కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. గంగాహారతి అత్యంత ప్రత్యేకం. మోక్షంకావాలని శివయ్యను ప్రార్థించే భక్తులు కాలభైరవుడి అనుమతితో కాశీకి చేరుకుంటారు. అయోథ్యలో బాలరాముడు కొలువుతీరిన తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకే ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ IRCTC రెగ్యులర్ గా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. లేటెస్ట్ గా అయోధ్య, కాశీ ప్రయాగరాజ్, పూరీ దర్శించుకునే అవకాశం కల్పించింది. కాశీ పుణ్య క్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో భారతీయ రైల్వే టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇది మంచి అవకాశం. తక్కువ ధరతో ఎక్కువ ప్రదేశాలు సందర్శించే రావొచ్చు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు చూడండి...
2025 సెప్టెంబర్ 9 ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు 10 రోజులు సాగుతుంది
భారత్ గౌవర్ పర్యటక రైలులో ఈ యాత్ర ఉంటుంది
ఇందులో స్లీపర్ క్లాస్, 3 ఏసీ, 2 ఏసీ బోగీలుంటాయి - మొత్తం 639 సీట్
కేవలం 17 వేల రూపాయలతో 10 రోజుల యాత్రను పూర్తిచేయవచ్చు
10 రోజుల యాత్రలో భాగంగా పూరీ, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, కాశీ, అయోధ్య ,ప్రయాగ్ రాజ్ ను సందర్శించుకునే అవకాశం ఉంటుంది
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కాజీపేట, వరంగల్ , విజయవాడ, రాజమండ్రి, విజయనగరంలో ఆగుతుంది.
సెప్టెంబర్ 9న ప్రారంభమైన టైన్ సెప్టెంబర్ 10న పూరీకి చేరుకుంటుంది.
రెండో రోజు జగన్నాథుడి దర్శనం, మూడో రోజు కోణార్క్ సూర్య దేవాలయం , నాలుగో రోజు వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది
ఐదో రోజు కాశీ క్షేత్రం సందర్శిస్తారు, ఆరో రోజు విశ్వనాథుడి జ్యోతిర్లింగ దర్శనంతో పాటూ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలు దర్శించుకోవచ్చు. ఇదే రోజు సాయంత్రం గంగాహారతి చూడొచ్చు.
ఏడో రోజు అయోధ్య చేరుకుంటారు. బాలరాముడి ఆలయంతో పాటూ ఆ చుట్టుపక్కలున్న ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు.
ఎనిమిదో రోజు ప్రయాగ్ రాజ్ లో గంగా యమున సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం ఆచరించొచ్చు
ప్రయాగ్ రాజ్ నుంచి తిరుగుప్రయాణం మొదలవుతుంది...సెప్టెంబర్ 9 న మొదలైన టూర్ సెప్టెంబర్ 18న తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో పూర్తవుతుంది.
9 రాత్రులు 10 పగళ్లు సాగే ఈ యాత్రలో భాగంగా వసతి సౌకర్యం, కేటరింగ్ ఉంటుంది. ఉదయ టీ, టిఫిన్, లంచ్, డిన్నర్, సెక్యూరిటీ, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఉంటాయి. ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం కూడా ఉంటుంది.
ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాల కోసం IRCTC వెబ్‌సైట్లో ఉన్నాయి. ఇంకా ఈ యాత్రకు సంబంధించిన సందేహాలంటే 9701360701, 9281030712, 9281030750, 9281495845 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - ఈ సేవలో పాల్గొంటే మీ జన్మ ధన్యమే! తిరమలలో మొత్తం సేవల వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















