Bhai Dooj 2025: వివిధ రాష్ట్రాల్లో భాయ్ దూజ్ పండుగను ఎలా జరుపుకుంటారు? తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తారో తెలుసుకోండి!
Bhai Dooj Date 2025: దీపావళి, గోవర్ధన్ పూజ తర్వాత కార్తీకమాసంలో వచ్చే రెండో రోజు భాయ్ దూజ్ జరుపుకుంటారు. తెలుగువారు ఇదే పండుగను యమ విదియ అంటారు

Bhai Dooj 2025: భాయ్ దూజ్...ఈ పండుగ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పురాణాల్లో రక్షాబంధన్ అని చెప్పుకోవాలి. సోదరుడు - సోదరికి అంకితం చేసిన పండుగ ఇది. దీనిని భాయ్ దూజ్ అని పిలుస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 23 గురువారం వచ్చింది.
కార్తీకమాసం ప్రారంభమైన రెండో రోజు భాయ్ దూజ్ జరుపుకుంటారు...భాయ్ దూజ్ భారతదేశంలో అతిపెద్ద పండుగలలో ఒకటి, ఇది దీపావళి తర్వాత రెండు రోజుల తర్వాత మరియు గోవర్ధన్ పూజ తర్వాత ఒక రోజు జరుపుకుంటారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాయ్ దూజ్
పశ్చిమ బెంగాల్‌లో భాయ్ దూజ్ పండుగను 'భాయ్ ఫోంటా' అని పిలుస్తారు, ఇది కాళీ పూజ తర్వాత రెండు రోజులకు జరుపుకుంటారు. ఈ సమయంలో, సోదరీమణులు తమ సోదరుల కోసం గొప్ప విందులను ఏర్పాటు చేస్తారు. ఉపవాసం చేస్తారు. సోదరుడి నుదుటిపై చందనం, కాటుక నెయ్యిని పూసి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.
బీహార్‌లో భాయ్ దూజ్ సందడి
ఉత్తర భారతదేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో భాయ్ దూజ్ పండుగను భిన్నమైన రీతిలో జరుపుకుంటారు. ఈ సమయంలో, సోదరీమణులు తమ సోదరులను తిడతారు.. శిక్షగా వారికి సూది గుచ్చుతారు. బీహార్‌లో ఈ సంప్రదాయం వెనుక ఉన్న నమ్మకం ఏంటంటే, సోదరులను చెడు శక్తులు దుష్ప్రభావాల నుంచి రక్షించడమే. సోదరీమణులు సోదరుల నుదుటిపై తిలకం పెట్టి ఈ ఆచారాన్ని పూర్తి చేస్తారు.
మహారాష్ట్ర, గోవా , గుజరాత్‌లలో భాయ్ దూజ్
మహారాష్ట్ర, గోవా మరియు గుజరాత్‌లలో, భాయ్ దూజ్ పండుగను భావుబీజ్ అని పిలుస్తారు. ఈ సమయంలో, సోదరీమణులు ఉదయం నుంచి తమ సోదరుల కోసం ఉపవాసం ఉంటారు. సోదరుడిని ఒక పీఠంపై కూర్చోబెట్టి వారికి కరీత్ పండును తినడానికి ఇస్తారు. అనంతరం సోదరీమణులు సోదరుడి నుదుటిపై తిలకం దిద్ది, వారి దీర్ఘాయువు, విజయం ,ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. సోదరులు లేని సోదరీమణులు భాయ్ దూజ్ రోజున తమ చేతులపై మెహందీ పెట్టుకుని చంద్రుడిని పూజిస్తారు. ఈ రాష్ట్రాల్లో భాయ్ దూజ్ రోజున సోదరులకు స్వీట్లుగా ఖీర్నీ, పూరీ, శ్రీఖండ్ , బాసుంది పూరీ వడ్డిస్తారు.
నేపాల్‌లో భాయ్ దూజ్ వేడుక
భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. నేపాల్‌లో ఈ పండుగను భాయ్ టీకా అని పిలుస్తారు. నేపాల్‌లో ఈ పండుగను మైథిలి, నేవారి, బహున్, ఛేత్రి , థారు సమాజాలు జరుపుకుంటాయి. నేపాల్‌లో, ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయువు కోసం మృత్యు దేవత యమరాజును ప్రార్థిస్తారు. దరీమణులు సోదరుల నుదుటిపై 7 రంగుల తిలకం పెడతారు. హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి ఆశీర్వాదం తీసుకుంటారు
తెలుగు రాష్ట్రాల్లో భాయ్ దూజ్
తెలుగు రాష్ట్రాల్లో యమవిదియ పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు సోదరుడిని ఇంటికి ఆహ్వానించి.. పిండివంటలతో భోజనం పెట్టి, నూతన వస్త్రాలు అందించి.. ఆశీర్వాదం తీసుకుంటుంది సోదరి. ఇలా చేస్తే ఆ సోదరుడికి దీర్ఘాయుష్షు ఉంటుందిని... సోదరి సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని నమ్మకం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!






















