అన్వేషించండి

Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!

Bathukamma Songs: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సందడి సాగుతోంది. ఊరూవాడా ఆటపాటలతో రోజుకో బతుకమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడిపాడే ఒక్కేసి పూవేసి పాట వెనుకున్న సందర్భం తెలుసా...

Bathukamma 2024: పంచభూతాలతో మనుషులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారు? ఒక్కేసి పూవ్వేసి చందమామ.. శివుడు రాకపాయె సందమామా అంటూ అమ్మవారు ఎందుకు ఎదురుచూశారు? 

ఔషధాలు నిండిఉండే రంగురంగుల పూలన్నింటినీ సేకరించి..వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శివలింగాకృతిలో పేరుస్తారు. చిన్నగా తయారుచేసినా, పెద్దగా తయారు చేసినా 
శివలింగాకృతిలోనే అలంకరిస్తారు. దీనివెనుకున్న ఆంతర్యం ఏంటో వివరిస్తూ ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది..

అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వేములవాడ చాళుక్యుల సామంతులుగా వ్యవహరించేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల్లో చివరి రాజైన కర్కుడిని వధించాడు. అనంతరం తన కుమారుడైన సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు. అప్పటికే వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయం ఉండేది. రాజరాజేశ్వరి అంటే అక్కడి ప్రజలకు ఎంతో విశ్వాసం ఉండేది. క్రీ.శ 985 నుంచి 1014 వరకు రాజ రాజ చోళుడు పాలన సాగించాడు. 

Also Read: అందాల బతుకమ్మ.. బతుకునిచ్చే అమ్మ - తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే ఈ పండుగ వెనుక కథలెన్నో!

సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించిన రాజేంద్ర చోళుడు వేములవాడ  రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. అదే సమయంలో ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని తీసుకెళ్లి రాజేంద్ర చోళుడు తండ్రికి బహుమతిగా అందించాడు. ఆ శివలింగాన్నే బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించినట్టు తమిళ శిలాశాసనాల్లో ఉంది. 

వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులో బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడంతో అమ్మవారి తరపున బతుకమ్మ వేడుకలు నిర్వహించండం ప్రారంభించారు స్థానికులు. పూలను శివలింగాకృతిలో పేరుస్తూ అమ్మవారి బాధను చోళులకు తెలియజేసేలా పాటలు పాడడం ప్రారంభించారు. శివలింగాకృతిలో పూలను పేర్చి..మధ్యలో గౌరమ్మను పెట్టి...అయ్యవారి కోసం అమ్మవారు ఎదురుచూస్తోందంటూ జాము గడిచినా శివుడు రాలేదంటూ పాటలు పాడారు..ఆ సందర్భంగా పాడిన పాటే ఇది....
ఒక్కేసి పువ్వేసి చందమామా..ఒక్క జాము ఆయె చందమామా..
కింద ఇల్లు కట్టి చందమామా..పైన మఠం కట్టి చందమామా..
మఠంలో ఉన్న చందమామా..మాయదారి శివుడు చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..
గౌరి గద్దెల మీద చందమామా..జంగమయ్య ఉన్నాడె చందమామా..

రెండేసి పూలేసి చందమామా..రెండు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

మూడేసి పూలేసి చందమామా..మూడు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

నాలుగేసి పూలేసి చందమామా..నాలుగు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడేలా రాకపాయె చందమామా..

ఐదేసి పూలేసి చందమామా..ఐదు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

ఆరేసి పూలేసి చందమామా..ఆరు జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

ఏడేసి పూలేసి చందమామా..ఏడు జాములయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

ఎనిమిదేసి పూలేసి చందమామా..ఎనిమిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

తొమ్మిదేసి పూలేసి చందమామా..తొమ్మిది జాములాయె చందమామా..
శివపూజ వేళాయె చందమామా..శివుడు రాకపాయె చందమామా..

తంగేడు వనములను చందమామా..తాళ్లు కట్టబోతిరి చందమామా..
గుమ్మాడి వనమునకు చందమామా..గుడి కట్టబోయే చందమామా..
రుద్రాక్ష వనమునకు చందమామా..నిద్ర చేయపోయె చందమామా..
నీనోము నీకిత్తునే గౌరమ్మ..నా నోము నాకియ్యవే గౌరమ్మ..

శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ

తంగేడు పూలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

గునుగు పూలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

బతుకమ్మలో పేర్చే గుమ్మడి పూలు కీళ్ల నొప్పులు తగ్గించే దివ్య ఔషధం... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Bihar Nitish Kumar : బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Embed widget