Image Credit: Pixabay
Stories Behind the Bathukamma: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ. అంటు వ్యాధులు, కరువు కాటకాల నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది. తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే బతుకమ్మ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.
బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది
ఎవరెన్ని రకాలుగా చెప్పుకున్నా..బతుకమ్మ అంటే బతకమని చెప్పటం, సుఖంగా, సంతోషంగా బతకమని ఆశీర్వదించటం. ఈ పండుగ వెనుక ప్రచారంలో ఉన్న కథలేంటో తెలుసుకుందాం..
Also Read: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!
'బతుకమ్మ' వేడుక వెనుక పురాణ గాథ
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు. అలా అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.
జానపద కథలు
ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి ఉండేది. ఆమె అంటే అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకాలమైనా తిరిగిరావకపోవడంతో ఇదే అదనుగా వదినమ్మలు వేధించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె అన్నయ్యలు తిరిగొచ్చి జరిగింది తెలుసుకుని నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపూవొకటి వీళ్లవైపు తేలుతూ వచ్చిందట. తమ చెల్లెలు ఆ తామర రూపంలో వచ్చందని భావించారు అన్నలు. ఆ రాజ్యాన్నేలే రాజు ఆ అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పూవుని తీసుకెళ్లి తన తోటలో కొలనులో వేయగానే చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మెలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకుతెరువు చూపింది కాబట్టి బతుకమ్మగా పూజించడం మొదలు ఆరంభించారని చెబుతారు.
Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. గునుగ, తంగేడు పూలతోపాటు పూలన్నింటినీ వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు.
Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!
Horoscope Today December 2nd, 2023: ఈ రాశివారు ఒత్తికి దూరంగా ఉండాలి లేదంటే..
Christmas 2023: క్రిస్మస్ వేడుకలు డిసెంబరు 25నే ఎందుకు జరుపుకుంటారు!
Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!
Political Astrology Predictions 2023: 2023 ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయనాయకులు గెలవడం పక్కా !
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>