కలలో చిన్ని కృష్ణుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. ఇలా చిన్ని కృష్ణుడు కలలో కనిపస్తే ఎలాంటి సంకేతాలు అందుతున్నాయో తెలుసుకుందాం.
నిద్రలో కలలు రావడం సాధారణమే. కానీ అందులో గుర్తుండేవి కొన్ని మాత్రమే. ఇలా గుర్తున్న కలల్లో కూడా చాలా కలలకు ఎలాంటి సంకేతాలున్నాయో మనకు అర్థం కాదు. కొన్ని కలలు భవిష్యత్తును తెలియజేస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఒక్కోసారి కలలో కనిపించేవి జరుగుతాయి కూడా. కానీ, కొందరి అసాధ్యమైన కలలు కూడా వస్తుంటాయి. అంటే కలలో దేవుడు కనిపించడం నుంచి దెయ్యాలను చూడటం వరకు ఎన్నో మంచి, చెడు కలలు వస్తాయి.
కలే కదా అని తీసి పారేసే పనిలేదు. సబ్ కాన్షియస్ బ్రేయిన్ లోని అతి బలమైన కోరిక కలగా కనిపిస్తుందని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇలా కలల అర్థాలను శాస్త్రబద్ధంగా విశ్లేషించి స్వప్న శాస్త్రం వివరిస్తుంది.
జ్యోతిష శాస్త్రంలో కూడా కలలకు ప్రత్యేకత ఉంటుంది. ఇక దేవుడు కలలో కనిపిస్తే కచ్చితంగా దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. సంతోషానికి, సంబరానికి, ఉత్సవానికి చిన్ని కృష్ణుడు ఒక ప్రతీక. అలాంటి చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే తప్పకుండా ఆ కల ప్రాశస్త్యమైందే. చిన్ని కృష్ణుడు రకరకాల రూపాల్లో గోచరిస్తాడు. నవ్వుతూ కనిపిస్తే ఒక అర్థం ఉంటే కోపంగా ఉంటే మరో అర్థం. చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. కన్నయ్య కలలో కనిపిస్తే ఇంకా ఏయే శుభాలు జరుగుతాయో చూద్దాం.
⦿ ఊయలలో ఊగుతున్న చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో మీరు ఏదో పెద్ద విజయం సాధించబోతున్నారని అర్థం. అనుకున్న పనులన్నీ నెరవేరబోతున్నాయని అనుకునేందుకు ఈ కలను సంకేతంగా భావించవచ్చు.
⦿ నవ్వుతున్న ప్రసన్న వదనంతో చిన్ని కృష్ణుడు కలలోకొస్తే మీరు శత్రువులను ఓడించబోతున్నారని చేప్పేందుకు సంకేతం. శత్రుత్వం మీద విజయం సాధించబోతున్నారని చెప్పేందుకు మందహాసంతో ఉన్న చిన్ని కృష్ణుడి రూపం కలలో కనిపిస్తుంది.
⦿కలలో చిన్ని కృష్ణుడు అలిగినట్టు కానీ, కోపంగా కానీ కనిపిస్తే వాళ్లు చేస్తున్న పూజలో ఏదో లోపం జరిగిందని అర్థం.
⦿ కలలో చిన్ని కృష్ణుడు కనిపిస్తే చాలు ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివెరియనున్నాయనేందుకు సూచన. పిల్లలకోసం తపిస్తున్న వారికి చిన్ని కృష్ణుడు కలలో కనిపిస్తే త్వరలో వారికి సంతానయోగం కలుగనున్నదని అర్థం. అతి త్వరలో వారింట్లో చిన్ని కృష్ణుడి ఆగమనం కలగనుందని తెలిపేందుకు గాను ఇలాంటి కలలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
Also read : ఈ దిక్కున కూర్చుని భోంచేస్తే సంపద నష్టం
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial