Bad Luck Signs: ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచితే దురదృష్టం వెంటపడుతుందా!
Bad Luck Signs: శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు, దురదృష్టం, ప్రతికూలతలు తలెత్తుతాయి. ఇంట్లో ఏ వస్తువులు ఖాళీగా ఉంచకూడదో సూచిస్తున్నారు పండితులు...
Bad Luck Signs: ఇంట్లో సానుకూల వాతావరణం, సంపద, శ్రేయస్సు నెలకొనడానికి శాస్త్రంలో అనేక మార్గాలు ప్రస్తావించారు. తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు. అది కుటుంబం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శాస్త్రంలోని మార్గాలను అనుసరిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఖాళీగా ఉంచకూడదు. వీటిని ఇంట్లో ఖాళీగా ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని, దురదృష్టం వెంటాడుతుందని నమ్ముతారు. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఖాళీగా ఉంచకూడదో ఇక్కడ తెలుసుకోండి...
పర్సులు, బీరువాలు
మీ జేబులోని పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. వీటిలో ఎప్పుడూ కొంత డబ్బు ఉంచుకోవాలి. శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు ఉంచే బీరువా లేదా పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీ దేవి మీపై ఆగ్రహిస్తుంది. ఆ సందర్భాలలో, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గోమతి చక్రం, పసుపుతో పాటు కొంత డబ్బును ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
Also Read : ఈ మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది!
బాత్రూంలో బకెట్
శాస్త్రం ప్రకారం, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. ఆ బకెట్‌లో నీరు లేనప్పుడు, ప్రతికూల శక్తి త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు మీ బాత్రూంలో ఎప్పుడూ విరిగిన లేదా నల్లని బకెట్‌ని ఉపయోగించకూడదు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాలు తలెత్తుతాయి.
పూజ గదిలో ఖాళీ కలశం
ఇంటికి అత్యంత ముఖ్యమైన అంశం ఆ ఇంటి పూజ గది. శాస్త్ర ప్రకారం దేవుని గదిలో ఖాళీ కలశం ఎప్పుడూ ఉంచకూడదు. కలశంలో కొంచెం నీరు పోసి ఉంచండి. పూజ గదిలో ఖాళీ కలశం ఉంచడం అశుభం. కలశ పాత్రలో ఎల్లప్పుడూ కొంత నీరు, గంగాజలం, తులసి ఆకులు ఉండాలి. మీరు వీటిని పూజ గదిలో ఉంచితే ఆ భగవంతుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. ఇది ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సును తెస్తుంది.
వంటగదిలో ఖాళీ బియ్యపు డబ్బా
వంటగదిలో ఉంచిన బియ్యానికి అన్నపూర్ణా దేవి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. వంటగదిలో మనం బియ్యం ఉంచే పాత్రను ఖాళీగా ఉంచకూడదు. ఇది ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
Also Read : ఇంట్లో ట్యాపులు లీకవుతూనే ఉన్నాయా - అయితే ఈ సమస్యలు తప్పవు!
పై వస్తువులను ఖాళీగా ఉంచడం వల్ల ఆ ఇంట్లో దురదృష్టం పెరుగుతుంది. ఆ ఇంటి సభ్యులు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.