Ayodhya Ram Mandir inauguration: సీతమ్మను అడవుల్లో వదిలేసిన రాముడి ప్రతి అడుగు ఆదర్శనీయం ఎలా అవుతుంది!
Ayodhya: అయోధ్యకు రాజు దశరథమహారాజు అని పాటలో ఉంది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సింహాసనం అధిష్టించాక పాలన అంటే ఎలా ఉండాలో చూపించాడు. మరి అయోధ్యకు రావణుడు రాజైతే...స్వయంగా రాముడి నోటివెంటే ఆ మాట వచ్చింది

Ayodhya Rama: మనిషిగా పుట్టిన తర్వాత ఎలాగోలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా మసలుకోవాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు.
పేరుకే దేవుడు
రాముడు పేరుకే దేవుడైనా మనిషిగా ఎలా బతకాలో బతికి చూపించాడు. భగవంతుడు మనిషిదా జన్మిస్తే ఆ జన్మకు ఏ విధంగా సార్థకత వస్తుందో నిరూపించి చూపించాడు. అలాంటి రాముడిని విగ్రహరూపంలో పూజిస్తే సరిపోతుందా...అనుసరించాల్సిన అవసరం లేదా.
Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!
ఉత్తమ పుత్రుడు
తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు చాలు. తెల్లారితే అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. మాహారాజు హోదాలో గౌరవం, భోగం..ఇక తిరుగేముంది. కానీ సింహాసనం అధిష్టించాల్సిన రాముడు...అదే రోజు అడవుల బాట పట్టాడు. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడు వనవాసం చేయాలన్న దశరథుడి మాటగా కైకేయి చెప్పడంతో మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్లిపోయాడు. తండ్రి తనని చూడకుండా ఒక్కరోజైనా ఉండలేడని తెలిసినా పిన్నమ్మకు తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వనవాసం చేయకతప్పదు. అందుకే ఎందుకు అని తిరిగి ప్రశ్నించలేదు..మారు మాట్లాడలేదు..అడవుల బాటపట్టాడు.
Also Read: 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకంటారు - రాముడు ధర్మం తప్పిఉంటే !
ఉత్తమ భర్త
ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య.. రాముడు ఏకపత్నీవ్రతుడు అంటారు. పెళ్లి అనే బంధానికి విలువ ఇచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవడం ఈ రోజుల్లో చూడగలమా, సాధ్యమా. మూడు ముళ్లు వేసిన స్త్రీతో సంసార బంధంలో కొనసాగుతూ..మరో స్త్రీ గురించి ఆలోచిస్తున్నవారు మన చుట్టూ ఉన్నారు. పరాయి స్త్రీ సాంగత్యం మాత్రమే కాదు ఆ ఆలోచన కూడా తప్పే. అలాంటిది రాముడు పరస్త్రీ నీడ కూడా సోకనివ్వలేదు. అందుకే రాముడి లాంటి భర్త కావాలి అనుకుంటారు
స్నేహానికి స్థాయి అవసరం లేదు
రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. అంటే గొప్పస్థానంలోనో, అధికారంలోనో ఉన్నవారు అహంకారాన్ని కూడా అలంకారంగా భావిస్తారు. కానీ రామయ్యకి ఎలాంటి బేధాలు లేవు. పడవ నడుపుకునే గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు.
Also Read: మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక - శుభ స్వాగతం ప్రియ పరిపాలకా!
మాయలేడి అని తెలియదా
బంగారులేడి మాయలేడి అని తెలియదా అంటే...నిజమే కానీ..రాముడు ఎప్పుడూ దేవుడిలా బతకలేదు మనిషిలానే బతికాడు. అందుకే భార్య బంగారులేడి కావాలని అడిగిన వెంటనే ఉన్నపాటుగా వెళ్లాడు. అంటే చుట్టూ అద్భుతంగా కనిపిస్తున్న ప్రపంచంలో మాయ, మిధ్య అనేవి చాలా ఉన్నాయ్..వాటిని గుర్తించకుండా పరుగులుతీస్తే ఆ తర్వాత బాధపడక తప్పదన్నది ఈ సంఘటన వెనుకున్న ఆంతర్యం...
నమ్మిన బంటు ఉంటేనే...
లంకలో ఉన్న సీతను తీసుకువచ్చేందుకు రాముడు నేరుగా వెళ్లలేడా. మధ్యలో వానరుల సాయం ఎందుకు అని ప్రశ్నిస్తే..
బంగారు పళ్లానికి అయినా గోడ చేర్పు ఉండాలని చెబుతారు. అంటే ఎంత గొప్పవారైనా నిజమైన స్నేహితుడి సాయం ఉంటే అసాధ్యం అయిన సముద్రం లాంటి కష్టాలను దాటుకుని ఆవలి తీరానికి చేరుకోవడం కష్టం కాదని చెప్పడమే. ఎంత గొప్పవాడికి అయినా తనవెంట నమ్మకస్తుడు ఉండాలి. రాముడికి హనుమంతుడిలా. నమ్మిన బంటు అనే మాట అక్కడి నుంచే వచ్చింది.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
అయోధ్యకి రాజు రావణుడు
స్నేహితుడిని నమ్మడం సాధారణ విషయమే. మరి శత్రువును నమ్మడం సాధ్యమేనా అంటే..అంతటి క్షమ రాముడి సొంతం. శత్రువైన రావణుడి తమ్ముడు విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు వీసమెత్తు కూడా అనుమానించలేదు. శత్రువు తమ్ముడు కదా ఏం ప్రమాదం ఉంటుందో అని ఆలోచించలేదు .. కారణం ఏంటంటే..శరణు అని వచ్చిన శత్రువునైనా అక్కున చేర్చుకోవాలన్న సందేశం అది. ఆ సమయంలో రాముడిని ఎవరో ప్రశ్నించారట..
రావణుడిని చంపి లంకను ఇస్తా అని విభీషణుడికి మాట ఇచ్చావు కదా..మరి ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తావని...అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా
”అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా..”
రాముడి గొప్పతనం గురించి ఇంతకన్నా ఏం చెబుతాం.
భార్యపై అనుమానం కాదు
ఏ విషయంలో అయినా ఎవ్వరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయకూడదు...వారికి వారుగా నిజం తెలుసుకునేలా చేయాలి. సర్దిచెప్పడం మొదలెడితే చాలా సందేహాలుంటాయి..వారికి వారుగా తెలుసుకుంటే మరో ప్రశ్నకు అవకాశం ఉండదు. లంకలో ఉండొచ్చిన సీతమ్మను ఏలుకుంటున్నాడన్న మాట పడినప్పుడు రాముడు చేసినదిదే. తన భార్య గురించి తనకు తెలియదా..ఎవరో ఏదో అన్నారని ఆమెని అడవుల్లో వదిలేయాలా అంటే...రాజుగా ప్రజల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్య ప్రజల మాటను గౌరవించాడు. భార్యకి దూరంగా ఉన్నాడు. అది సీతపై అనుమానం కాదు.. నిజం ఏంటో లోకానికి తెలియాలి కదా. నిందవేసిన నోర్లే సీతమ్మను మహాపతివ్రతగా గుర్తించేలా చేశాడు. అందుకే రాముడు ఉత్తమ భర్త...
ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుడు వేసిన ప్రతి అడుగూ సందేశమే, ఆదర్శమే...
Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

