అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నాడు జరిగే పూజా కార్యక్రమాలు శతాబ్దాల పోరాటం విజయవంతమై, శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ నాడు జరిగే పూజా కార్యక్రమాలు దర్శనం, హారతి సమయాలు మేలుకొలుపు, శృంగార హారతి: ఉదయం 6.30 గంటలకు భోగ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సంధ్యా హారతి : సాయంత్రం 7.30 గంటలకు దర్శన వేళలు: ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ తీసుకోవాలి రామాలయానికి వెళ్లిన రోజునే దర్శనం, హారతి కోసం బుక్ చేసుకోవచ్చు. స్లాట్ లభ్యతనుబట్టి పాస్ ఇస్తారు. హారతి షెడ్యూలు సమయానికి 30 నిమిషాల ముందు భక్తులు క్యాంప్ ఆఫీస్ వద్ద హాజరుకావాలి