News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!

జూన్ 30 నుంచి ఆషాడమాసం ప్రారంభమైంది. ఇప్పటికే కొత్త పెళ్లికూతుర్లంతా అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్నట్టే. ఏటా ఆషాడ మాసంలో నూతన దంపతులకు ఎందుకీ ఎడబాటు?. దీనివెనుకున్న అసలు కారణం ఏంటి?

FOLLOW US: 

చాంద్రమానాన్ని అనుసరించి భారతీయ జ్యోతిష్య పండితులు ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మాల ఆధారంగా ప్రతి నెలలో పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి కొన్ని పేర్లు నిర్ణయించారు. పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చిన మాసానికి ఆషాడ మాసం అని పిలుస్తారు. ఈ నెల ప్రారంభం కాగానే కొత్తగా పెళ్లై అత్తవారింటికి వెళ్లిన అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చేస్తారు. పైగా ఆ నెలలో రోజులు అత్తా కోడలు, అత్తా అల్లుడు ఒకే ఇంట్లో ఉండకూడదని కూడా అంటారు. ఎందుకిలా చేస్తారు? కారణాలేంటి...

Also Read: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

ఆషాడ మాసంలో నెలతప్పితే సరిగ్గా ఎండలు ముదిరే సమయంలో ప్రసవం అవుతారు. మార్చి నుంచి మే లోగా డెలివరీ ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఈ నెల రోజులూ నూతన వధూ వరులను దూరంగా ఉంచే సంప్రదాయం తీసుకొచ్చారు. తిరిగి శ్రావణమాసంలో భర్త వద్దకు పంపించిన తర్వాత అమ్మాయి నెల తప్పినా వాతావరణంలో వేడి తీవ్రత తగ్గేసరికి ప్రసవం ఉంటుందని. అందుకే నూతన వధూవరులను ఈ నెలలో దూరంగా ఉంచే సంప్రదాయం తీసుకొచ్చారు. 

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

ఆషాఢమాసంలో వానలు జోరందుకుంటాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లినా..కొత్తగా పెళ్లైన జంట ఇల్లు కదలేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. అప్పట్లో ఇంట్లో అందరూ కలసి వ్యవసాయ పనులు చేసుకునే వారు. అలాంటప్పుడు ఒక్కరు లేకపోయినా పనులు సరిగా ముుందుకు సాగవు. అందుకే కోడలిని పుట్టింటికి పంపించేసి ఆ నెల రోజులూ వ్యవసాయ పనుల్లో మునిగితేలుతారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చిందంటారు. 

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

పైగా కొత్తగా పెళ్లై అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల ఒక్కసారిగా తల్లిదండ్రులను వదిలేసి ఉండాలన్నా ఇబ్బంది పడతారు. ఇప్పుడంటే పెళ్లికి ముందే పరిచయాలు, స్నేహాలు , రాకపోకలు సాగుతున్నాయి కానీ అప్పట్లో పెళ్లైన తర్వాతే తొలిసారి అత్తవారింట్లో అడుగుపెట్టేవారు. కొత్త కుటుంబంలో తనని తాను అడ్జెస్ట్ చేసుకునేందుకు సమయం పడుతుంది. చిన్న చిన్న సందేహాలను ఎవర్ని అడగితే ఏమనుకుంటారో అనే బిడియం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడి వాతావరణాన్ని ఒ్కకసారిగా అంగీకరించే పరిస్థితులు ఉండవు. అందుకే అత్తింట్లో కొన్ని రోజులు ఉండి ఆషాడమాసం రాగానే పుట్టింటికి వెళ్లడం ద్వారా ఈ నెల రోజులూ తనని తాను ప్రిపేర్ చేసుకోవడంతో పాటూ, అక్కడ ఎలా ఉండాలో-సంసారాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో తల్లిదండ్రుల నుంచి తగిన సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం వస్తుందంటారు పెద్దలు. 

Published at : 04 Jul 2022 05:28 PM (IST) Tags: Ashada Masam 2022 ewlyweds Ashadam Month History

సంబంధిత కథనాలు

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Happy Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!

janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య  ఎలా రియాక్టయ్యాడు!

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

Horoscope Today 18 August 2022:   ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు

టాప్ స్టోరీస్

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!

Dhamaka Movie: దుమ్మురేపుతున్న మాస్ మహారాజా ఊరమాస్‌ సాంగ్ 'జింతాక్‌'

Dhamaka Movie: దుమ్మురేపుతున్న మాస్ మహారాజా  ఊరమాస్‌ సాంగ్ 'జింతాక్‌'

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!