Amarnath Yatra 2024: అమర్నాథ్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ తేదీల్లో వెళ్లేందుకు ప్లాన్ చెయ్యండి
ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను ఖరారు చేసి రిజిస్ట్రేషన్ కూడా మొదోలు పెట్టారు. ఈ యాత్ర తేదీలు, రిజిస్ట్రేషన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూన్ లో ప్రారంభం అవుతుంది. దాదాపు ఆగష్టు నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను ఖరారు చేసి రిజిస్ట్రేషన్ కూడా మొదదు పెట్టారు. ఈ యాత్ర తేదీలు, రిజిస్ట్రేషన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తులో అమర్నాథ్ పవిత్ర దేవాలయం లాదర్ లోయలో ఉంది. ఇది కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి దాదాపు 141 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ఏడాది జూన్ 29 న ప్రారంభమై ఆగష్టు18 న ముగియబోతోంది. దాదాపు 52 రోజుల పాటు స్వామి వారి దర్శనం ఉంటుంది. దీని కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 సోమవారం నుంచి శ్రీ అమర్నాథ్ శ్రీన్ బోర్డ్ (ఎస్ఏఎస్బీ) రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయనే ప్రకటన జారీ చేసింది.
ప్రతి ఏడాది చాలా కట్టుదిట్టమైన భద్రతతో అమర్నాథ్ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర రెండు మార్గాల్లో జరుగుతంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ – పహల్గామ్ మార్గం సాంప్రదాయమైన మార్గం కాగా గందర్బాల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల తక్కువ దూరం ఉండే మరో మార్గం. అయితే గందర్బాల్ నుంచి సాగే దారి నిటారుగా కష్టతరంగా ఉంటుంది. ఇది బాల్తాల్ జిల్లాలో ఉంటుంది.
అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం లో శ్రావణ మేలా సమయంలో దర్శనం చేసుకుంటారు. ఇది ప్రతి ఏడాది జూలై-ఆగష్టు మాసాలలో వసతుంది. అమర్నాథ్ దేవాలయ పరిసర ప్రాంతాల భౌగోళిక స్థితి గతుల వల్ల ఏడాదిలో కేవలం 50 – 60 రోజులు మాత్రమే దర్శనానికి అనుకూలంగా ఉంటుంది.
నేషనల్ డిజార్డర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) స్టేట్ డిజార్డర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది ఈ సమయంలో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పన వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. జమ్ము కాశ్మీర్ పోలీసుల మౌంటైన్ రెస్య్యూటీమ్స్ ఇందులో భాగంగా ప్రత్యేక శిక్షణ తీసుకుని సిద్ధంగా ఉంటారు. వీరి భద్రతలో భక్తులు తమ యాత్రను విజయవంతం చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
శ్రీ అమర్నాథ్ శీరీన్ బోర్డు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఉదయం, సాయంత్రం ఆరతి ప్రత్యక్ష ప్రసారాలకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. యాత్ర , అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలసుకునేందుకు ఆన్ లైన్ లో కూడా సేవలను పొందేందుకు అమర్నాధ్ యాత్రా ఆప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అమర్నాథ్ పవిత్ర క్షేత్రం లాడార్ లోయలో ఉంటుంది. ఇది సంవత్సరంలో ఎక్కువ సమయం పాటు హిమనీనదాలు, మంచుతో కప్పబడి ఉంటుంది. జూలై, ఆగష్టు రెండు నెలలు మాత్రమే యాత్రకు అనుకూలంగా ఉంటుంది.
Also read : శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎలాంటి నియమాలు పాటించాలి? ప్రయోజనాలేమిటీ?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.