అన్వేషించండి

200 ఏళ్లకు ఒక్కసారే - ఈ రాఖీ పౌర్ణమి చాలా ప్రత్యేకం, ఈ మూడు రాశులవారి దశ తిరుగుతుంది!

ఇది 200 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే గ్రహస్థితి ప్రభావం కచ్చితంగా అన్ని రాశుల మీదా ఉంటంది. కానీ ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ గ్రహస్థితి చాలా యోగించబోతోందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

ఈ సారి వస్తున్న రాఖీ పండుగ కొన్ని రాశులవారి దశ మార్చనుందట. 200 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన గ్రహస్థితి వల్ల ఊహించని ఫలితాలు పొందుతారని పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రాఖి పౌర్ణమి రోజున రవియోగంతో పాటు శతభిషా నక్షత్రంలో బుధయోగం కూడా ఏర్పడబోతోందట.

ఈ గ్రహస్థితి ప్రభావం కచ్చితంగా అన్ని రాశుల మీదా ఉంటుందట. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ గ్రహస్థితి చాలా మేలు చేయనుందని పండితులు అంటున్నారు. ఈ మూడు రాశుల మీద లక్ష్మీ కరుణా కటాక్షం ఉండబోతుందని అంటున్నారు. వీరి వృత్తి, ఉద్యోగాల్లో చాలా మంచి పురోగతి ఉండబోతోందట. ఈ రాశులకు చెందిన వారి వ్యాపారాలు విస్తరించి గొప్ప స్థితికి చేరుకోబోతున్నారట. ఈ గ్రహస్థితి వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణం అవుతుందని పండితులు చాలా కచ్చితంగా చెబుతున్నారు.

ఇప్పటి వరకు డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తి చెయ్యగలుగుతారు. రక్షాబంధనం తర్వాత రోజు నుంచి మంచి మార్పులు కనిపిస్తాయి. ఇక రాబడికి ఎటువంటి లోటు ఉండదు. శని, గురు గ్రహాల శుభ దృష్టి వల్ల జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలను సొంతం చేసుకోబోతున్నారు.

అంతేకాదు గురు, శని గ్రహాలు తమ తమ స్వస్థానాల్లో బలంగా ఉండడం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. అదృష్ట వంతులైన ఆమూడు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 200 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గ్రహస్థితి వల్ల యోగించే మూడు రాశులు ఇవే.

మిథున రాశి

చాలా అరుదుగా సంభవించే ఈ గ్రహస్థితి రాఖి పౌర్ణమి తర్వాత ఏర్పడబోతోంది. మిథున రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. వీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. కేవలం ఆర్థిక సంక్షోభాలు తొలగిపోవడం మాత్రమే కాదు వీరు డబ్బు పొదుపు కూడా చేస్తారు. డబ్బు లేక ఆగిపోయిన అన్ని పనులు ఒక్కొక్కటిగా విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి రాఖి పౌర్ణమి తర్వాత జీవితంలో గొప్ప మార్పులతో మంచి రోజులు ప్రారంభం అవుతాయని చెప్పవచ్చు.

సింహ రాశి

సింహరాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వత మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు మూసుకున్న అన్ని దారులు తెరచుకుంటాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు అనారోగ్యాలన్నీ కుదుట పడి ఆరోగ్యవంతులు కూడా అవుతారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోతుంది. వీరి కేరీర్ లో ఉన్నత స్థానానికి చేరబోతున్నారు. ప్రమోషన్ల తో పాటు రాబడి కూడా పెరుగుతుంది. అంతేకాదు కొత్త సంపాదన మార్గాలు కూడా దొరకుతాయి. మీరు, మీ కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది. దాంపత్య బంధం మధురంగా ఉంటుంది.

Also read : నిద్రకూ ఉన్నాయి వాస్తు నియమాలు - ఇలా చేస్తే మీ జీవితానికి కలిగే మేలు ఇదే!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget