నిద్రకూ ఉన్నాయి వాస్తు నియమాలు - ఇలా చేస్తే మీ జీవితానికి కలిగే మేలు ఇదే!
తల, పాదాల దిక్కు మన మానసిక స్థితి మీద, ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతాయి. వాస్తులో నిద్ర గురించి చెప్పిన నియమాలేమిటో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం, అమరిక, అలంకరణ, దిక్కులు గురించి మాత్రమే కాదు.. జీవన విధానాలపై కూడా వాస్తులో చాలా నియమాలు నిర్దేశించారు. వాటి గురించి కూడా తెలుసుకోవడం అవసరం. నిద్రను సంబంధించి కొన్ని నియమాలను వాస్తు శాస్త్రంలో ప్రస్తావించారు. వీటిని పాటించకపోతే ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే ఉదయాన్నే బద్దకం, అలసట వంటి సమస్యలు వస్తాయి. నిద్రించేందుకు దిక్కులు చాలా ముఖ్యం. తల, పాదాల దిక్కు మన మానసిక స్థితి మీద, ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతాయి. వాస్తులో నిద్ర గురించి చెప్పిన నియమాలేమిటో తెలుసుకుందాం.
తూర్పు
తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల మేదస్సు పెరుగుతుంది. మెదడు షార్ప్‌గా పనిచేస్తుంది. ఈ దిశన పడుకునే విద్యార్థులకు మంచి ఫలితం ఉంటుంది.
పశ్చిమం
వాస్తులో పడమరన తలపెట్టి పడుకోకూడం మంచిది కాదు. ఈ దిశలో తలపెట్టి పడుకోవడం అనేక సమస్యలకు కారణం అవుతుంది.
ఉత్తరం
ఉత్తరం వైపు కూడా తల పెట్టి పడుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు నియమాల ప్రకారం ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే అనారోగ్యాలు కలుగవచ్చు అని వాస్తు చెబుతోంది.
దక్షిణం
దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటే సంపద, ఆనందం పెరుగుతుంది. ఈ విధంగా నిద్రపోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది కూడా. కనుక నిద్రించేందుకు ఉత్తమ దిశ దక్షిణంగా చెప్పవచ్చు.
మరి కొన్ని నియమాలు
వాస్తు నియమాలు కొన్ని తప్పకుండా పాటించడం వల్ల సుఖనిద్ర పోవడానికి అనుకూలంగా ఉంటుంది. సులభమైన ఈ నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు కూడా.
- మంచం ఎప్పుడూ గోడకు ఆనుకొని ఉండకూడదు. గోడ నుంచి కచ్చితంగా కొంత దూరంలో ఉండాలి.
- పడకగది తలుపు దక్షిణం లేదా పడమర దిశలో ఉంటే మంచం తలుపు ముందుండేలా పెట్టుకోవద్దు. తలుపు నుంచి వచ్చే ప్రతికూల గాలులవల్ల నిద్రాభంగం కలుగవచ్చు.
నిద్ర సరిగ్గా ఉండడం లేదనేవారు ఇంట్లో మంచం వాస్తుకు అనుగుణంగా అమర్చుకున్నారో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. శాస్త్రబద్దమైన ఈ చిన్న నియమాలు పాటించడం వల్ల సుఖ నిద్ర సుసాధ్యమవుతుంది. ఫలితంగా ఆరోగ్యం కూడా బావుంటుంది. నిద్ర ఎప్పుడూ మంచి జీవితానికి కారణం అవుతుంది. మొద్ద నిద్ర జీవితాన్ని ఛిద్రం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
Also read : ఆదివారాలు ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial