అన్వేషించండి

Aditya Hrudayam in Telugu: ప్రతి ఆదివారం ఇది చదువుకుంటే విజయం, ఆరోగ్యం, సర్వశత్రు వినాశనమ్!

Aditya Hrudayam: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, నిరాశ ఇవన్నీ చుట్టుముట్టునప్పుడు దేవుడా వీటి నుంచి నన్ను బయటపడేయ్ అని చాలామంది ప్రార్థిస్తారు. అలాంటి సమయంలో చదువుకోవాల్సిన స్త్రోత్రం ఇది...

Aditya Hrudayam in Telugu:  ఆదిత్య హృదయం  స్తోత్రం సూర్యభగవానుడిది. వాల్మీకి రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట చెందగా..అగస్త్య మహర్షి యుద్ధ భూమికి వచ్చి ఉపదేశించిన స్త్రోత్రం ఇది. ఓ రామా ఆదిత్యుడిని ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుంది, విజయం వరిస్తుందని వివరించాడు.

  • ఆదిత్య హృదయం లో 30 శ్లోకాలు ఉన్నాయి
  • మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు శ్రీ రాముడికి వద్దకు రావడం గురించి  
  • 3 నుంచి 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల కలిగే సత్ఫలితాలు గురించి
  • 6 నుంచి 14 వ శ్లోకం వరకు ఆదిత్యుని ప్రశంసించడం
  • 15 వ శ్లోకం నుంచి 21 శ్లోకం వరకు ఆదిత్యుని ప్రార్థన సాగుతుంది
  • 22 వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కలిగే సత్ఫలితాలు గురించి వివరణ ఉంటుంది
  • ఆదిత్య హృదయం గురించి విన్న శ్రీరామచంద్రుడు కార్యోన్ముఖుడు కావడాన్ని 29,30 శ్లోకాల్లో ఉంటుంది

ఆదిత్య హృదయం పఠించిన తర్వాత శ్రీరాముడికి విజయం సునాయాసంగా వరించింది. అందుకే ఈ స్త్రోత్రం పారాయణం చేసినవారికి  ఎలాంటి ఆపదలు ఎదురైన, ఆనారోగ్యం కలిగినా, ఆర్థిక, రుణ బాధలున్నా..ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి లభించి శుభ ఫలితాలు పొందుతారు.  జాతకంలో రవి గ్రహం సంచారం ప్రతికూల ఫలితాలను ఇచ్చినప్పుడు కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం మంచి ఉపశమనం. 

Also Read: ఈ వారం (మార్చి 03 - 09) ఈ రాశులవారికి ప్రశంసలు అందుకునే సమయం

ఆదిత్య హృదయం

ధ్యానం
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥

సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।
చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥

వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।
ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।
నమస్తమోఽభి నిఘ్నాయ రవయే లోకసాక్షిణే ॥ 21 ॥

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।
కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥

పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్తదా ।
ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥

అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః ॥

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారిని అష్టమ శని అష్టకష్టాలు పెడుతుంది!

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఆదాయం వృద్ధి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget