భోజనం చేస్తూ TV, Mobile చూస్తున్నారా? అయితే మీ జీవితంలో ఈ 4 నష్టాలు తప్పవు!
Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం, భోజనం చేసేటప్పుడు ఫోన్ లేదా టీవీ చూడటం మంచిది కాదు. ఇది ఎంత హాని కలిగిస్తుందో .. దాన్నుంచి ఎలా బయటపడాలో వాస్తు నిపుణులు చేసిన సూచనలు ఇవి..

Vastu Tips: ప్రస్తుతం వేగవంతమైన జీవితంలో మొబైల్ , టీవీలు భాగమైపోయాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఫోన్, టీవీ ఆన్ చేయకుండా భోజనం చేయడం లేదు. ఇది విశ్రాంతితో పాటూ వినోదం పొందేందుకు సరైన సమయం అని భావిస్తున్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు సైతం భోజనం చేసే సమయంలో పోన్ పక్కన పెట్టడం లేదు. అయితే ఈ అలవాటు ప్రభావం మీ ఆరోగ్యంపైనే కాదు మీ మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థితి , కుటుంబ సంబంధాలకు కూడా హానికరం అని మీకు తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసే సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో మనస్సు, శరీరం, ఆత్మల సమతుల్యత చాలా అవసరం. కానీ టీవీ లేదా మొబైల్‌లో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే కాకుండా, ప్రతికూల శక్తి కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
శక్తి అసమతుల్యత
టీవీ లేదా మొబైల్ నుంచి వెలువడే నీలి కాంతి ఎలక్ట్రానిక్ తరంగాలు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఈ పరికరాలను డైనింగ్ ఏరియాలో ఉంచినట్లయితే, ఇంటి శక్తి సమతుల్యత దెబ్బతినవచ్చు. అందుకే భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్‌ను ఆఫ్ చేయండి. డైనింగ్ ఏరియాలో టీవీ ఉండకుండా చూసుకోండి.
ఏకాగ్రత - నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం
మీరు భోజనం చేసేటప్పుడు స్క్రీన్‌ను చూసినప్పుడు మీ దృష్టి ఆహారం నుంచి ఇతర విషయాలపైకి మళ్లుతుంది. ఇది మీ ఏకాగ్రత ఆలోచనా శక్తిపై ప్రభావం చూపుతుంది, దీని వలన పనిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.. ఫోన్ ను వదిలి ఉండడం అలవాటుగా చేసుకోండి. ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే మానసికంగా బలవంతులవుతారు.
ఆర్థిక అభివృద్ధికి ఆటంకం
వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూడటం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల క్రమంగా ధన నష్టం , ఆలోచనల్లో అస్థిరత ఏర్పడుతుంది. అందుకే భోజనం ప్రారంభించే ముందు దేవునికి ధన్యవాదాలు చెప్పి శ్రద్ధగా తినాలి..అప్పుడే సానుకూల శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
కుటుంబ సంబంధాలలో దూరం
ప్రతి ఒక్కరూ భోజనం చేసేటప్పుడు వారి స్క్రీన్‌లలో బిజీగా ఉన్నప్పుడు, పరస్పర సంభాషణ తగ్గుతుంది. భోజనం చేసే సమయం సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక అవకాశం. ఈ సమయాన్ని కూడా స్క్రీన్‌లకు కేటాయిస్తే, కుటుంబంలో భావోద్వేగ దూరం పెరగవచ్చు. కుటుంబంతో, స్నేహితులతో కలసి కూర్చుని భోజనం చేసేటప్పుడు పిల్లలు, పెద్దలకు సమయం కేటాయించండి. ఇది ఇంట్లో ప్రేమను, సామరస్యాన్ని కాపాడుతుంది
భోజనం చేసే సమయంలో..
మొబైల్ - టీవీని ఆఫ్ చేయండి.
భోజనం చేసేటప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించండి.
డైనింగ్ టేబుల్‌ను శుభ్రంగా ఉంచండి.
దేవునికి ధన్యవాదాలు చెప్పి భోజనం ప్రారంభించండి.
కుటుంబంతో సమయం గడపండి.
ఆహారం కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు.. ఇది శరీరం, మనస్సుని శుద్ధి చేసేది. అందుకే టీవీ, మొబైల్ శబ్ధాలతో కాకుండా ప్రేమ, ధ్యానం మధ్య భోజనం పూర్తిచేయండి. అప్పుడే మీరు జీవితంలో సానుకూల మార్పులను గమనించగలరు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే.ఈ సమాచారాన్ని విశ్వసించే ముందు, అమలు చేసే ముందు నిపుణుల సలహాలు స్వీకరించండి.






















