Chanakya Niti: పురుషుల పతనానికి కారణం ఈ నాలుగు అలవాట్లే!
Chanakya Niti: పురుషుల్లో ఉండే కొన్ని అలవాట్లు వారు విజయం సాధించకుండా అడ్డుకుంటాయని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు ప్రకారం, పురుషుల విజయాన్ని నిరోధించే లక్షణాలు ఏమిటి?
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితాన్ని సమగ్రంగా వివరించాడు. సమయ పాలన, క్రమశిక్షణతో పాటు నైతిక విలువలను అనుసరించే వ్యక్తి మాత్రమే జీవితంలో విజయం సాధిస్తాడని చాణక్యుడు చెప్పాడు. మంచి జీవితాన్ని ఎలా గడపాలో క్రమశిక్షణ నేర్పుతుంది, కానీ సమయం ఏ పని ఎలా సకాలంలో చేయాలో నేర్పుతుంది. క్రమశిక్షణ, సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ద్వారా కార్యాచరణ ప్రణాళికను రూపొందించే వారు ఎల్లప్పుడూ తమ జీవితాలను సరైన మార్గంలో నడిపిస్తారు. అలాంటి వ్యక్తులు స్వయంచాలకంగా విజయం సాధించడం ప్రారంభిస్తారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో ఏ వ్యక్తి విజయం సాధించలేడో తెలుసా..?
1. ఆలస్యంగా నిద్రపోయేవారు
ఆచార్య చాణక్యుడు ప్రకారం, తెల్లవారుజాము వరకు నిద్రపోకపోవడం ఆరోగ్యానికి, పనికి కూడా మంచిది కాదు. ఉదయాన్నే సూర్యోదయ సమయానికి లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేచిన వ్యక్తి తన పనులన్నీ సులభంగా పూర్తి చేస్తాడు. అలా చేయని వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఆలస్యంగా మేల్కొనేవారే కాదు, ఆలస్యంగా నిద్రించే వారు కూడా జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు.
Also Read : మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!
2. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం
ఆచార్య చాణక్య ప్రకారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవడం వైఫల్యానికి పెద్ద సంకేతం. అలాంటి వారిని ఎప్పుడూ అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. మొదట్లో ఆరోగ్యం గురించి పట్టించుకోని వారు ఆ తర్వాత రోగాలకు చికిత్స తీసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి విజయం ఎప్పుడూ రాదు. అందుకే ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చాణక్యుడు చెప్పాడు.
3. కఠినంగా మాట్లాడేవారు
ఇతరుల గురించి అనుచితంగా లేదా కఠినంగా మాట్లాడటం కూడా వైఫల్యానికి సంకేతమని ఆచార్య చాణక్య చెప్పాడు. అలాంటి వారు తమ పరుష పదజాలం వల్ల ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. అలాంటి వ్యక్తి ఇంట్లో, పనిలో, సమాజంలో ఓటమిని మాత్రమే అనుభవిస్తాడు. అందుకే సాటి మనుషులతో ఎప్పుడూ మర్యాదగా వ్యవహరిస్తూ, మధురంగా మాట్లాడాలి.
4. క్రమశిక్షణా రాహిత్యం
ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పుడూ విజయం సాధించలేడు. క్రమశిక్షణ లేమి ఏ వ్యక్తినైనా పూర్తిగా నాశనం చేస్తుంది. క్రమశిక్షణ ఒక వ్యక్తిని ముందుకు సాగేలా ప్రోత్సహిస్తే, క్రమశిక్షణ లేమి దానిని నిరోధిస్తుంది. క్రమశిక్షణ లేని జీవితం ఒక వ్యక్తిని వైఫల్యాల్లో ముంచెత్తుతుంది.
Also Read : ఇంట్లోని ఈ వస్తువులను అస్సలు ఖాళీగా ఉంచకూడదట, అలా చేస్తే ధన నష్టమే!
పైన పేర్కొన్న 4 లక్షణాల్లో ఒక లక్షణం ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయవంతం కాలేడని ఆచార్య చాణక్యుడు స్పష్టంచేశాడు. మీకు అలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండండి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.