కష్టాలు వెంటాడుతున్నాయా? రోజూ ఇలా చేస్తే దరిద్రం మీ దరి చేరదు - ఇది చాలా ఈజీ
చాలా విషయాలను మనం చిన్నగా భావిస్తాం. కానీ, అవి ఇంటిలో దరిద్రానికి కారణం అవుతాయి. దాని కోసం పెద్దగా చెయ్యాల్సిందేమీ ఉండదు. కాస్త శ్రద్ధ చూపితే దరిద్రం దరిచేరదు.
మనం చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోం. కానీ, అవి దరిద్రానికి దారితీస్తాయి. ఆ దరిద్రాన్ని డోర్ బయటకు పంపేందుకు మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మంచి అలవాట్లతో వాటిని దూరం చేయొచ్చట. అవేంటో చూసేయండి మరి.
ఇంట్లోకి దరిద్ర దేవత చేరకుండా లక్ష్మి తాండవించాలంటే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఇవి సరళమైనవి. అలవాటు చేసుకోవడం కూడా చాలా సులభం.
⦿ పొద్దున్నే నిద్ర లేవగానే తల్లిదండ్రులు, గురువు, ఇతర పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ అలవాటు వల్ల పెద్దల ఆశీర్వాదం లభించడమే కాదు. ఒక పాజిటివ్నెస్ తో రోజు మొదలైనట్టు ఉంటుంది.
⦿ ఆవుకు బెల్లం, రొట్టే పెట్టాలి. వీలైతే రోజూ ఆవును పూజించాలి. అలా పూజిస్తూ ఈ రోజుకు ఈ ఆవు నాకు కామధేనువు. నేను కోరుకున్నవి అన్నీ నాకు ఇస్తుందని అనుకుంటూ ప్రార్థించాలి.
⦿ కుక్కలకు ఆహారం ఇవ్వడం, పక్షులకు గింజలు వెయ్యడం వల్ల కూడా మంచి జరుగుతుంది.
⦿ మీ పరిసరాల్లో చెరువు, నది, లేదా సముద్రం ఉంటే గోధుమ పిండితో ఉండలు చేసి చేపలకు ఆహారంగా ఆ నీటిలో వదలాలి.
⦿ ప్రతి రోజు కాకులు, గద్దల కోసం మనం తినే ఆహారంలో కొంత తీసి పెట్టాలి.
⦿ ఇంటికి వచ్చిన అతిథుల నుంచి ఏమీ ఆశించకుండా అతిథి సత్కారాలు చెయ్యాలి.
⦿ ఇంట్లో వండిన ఆహరం వడ్డించడానికి ముందు అందులోని మొదటి ముద్దను నెతితో ఆగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో వాస్తు పురుషుడికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. అంతేకాదు అన్నపూర్ణ కూడా తృప్తి చెందుతుంది.
⦿ ఉదయాన్నే స్నానం చేసి శివలింగానికి నీళ్లు పోసి 108 సార్లు ఓం నమః శివాయ మంత్రం జపించి సాష్టాంగ నమస్కారం చేయాలి.
⦿ పొద్దున్నే స్నానం తర్వాత సూర్య భగవానుడికి ఎర్రని పూలను సమర్పించి చేతులెత్తి నమస్కరించాలి.
⦿ ప్రతి శనివారం రావి చెట్టుకు నీళ్లు పోసి, పచ్చి పాలు పోసి ఏడు ప్రదక్షిణలు చేసి సూర్యుడు, శంకరుడు, రావి చెట్టును ఆరాధించాలి. ఈ ఆరాధానలో ఉపయోగించిన నీటితో కళ్ళకు అద్దుకోవాలి.
⦿ పితృదేవాయ నమః అనే మంత్రాన్ని నాలుగు సార్లు పఠించాలి. అందువల్ల రాహు, కేతు, శని, పితృ దోషాల నివారణ అవుతుంది.
⦿ పొద్దున్నే సూర్యాభిముఖంగా కూర్చుని ఏకాంతంగా గురుమంత్ర జపం చెయ్యాలి.
⦿ శక్యానుసారం పేదలకు దానం చెయ్యాలి.
⦿ సేవ చేసి ఫలితాన్ని ఆశించకూడదు.
⦿ సృష్టిలో ప్రతి జీవి పట్ల సుహృద్భావంతో ఉండాలి.
⦿ ఆదివారం, మంగళవారం రోజున అప్పు తీసుకోకూడదు. తీసుకోవాల్సి వస్తే బుధవారం తీసుకోవాలి.
⦿ ఇంట్లో చేసిన భోజనంలోని మొదటి ముద్ద ఆవుకు, చివరి ముద్ద కుక్కకు పెట్టడం నియమంగా పెట్టుకోవాలి.
⦿ పితృదోష నివారణకు నిత్యం మహా గాయత్రి మంత్రం పఠనం చెయ్యాలి.
⦿ అందరూ సాధారణంగా శుక్రవారం నాడు గోళ్లు కత్తిరించ రాదు అనుకుంటారు. కానీ నిజానికి శుక్రవారం గోళ్లు కత్తిరించడం పెద్ద దోషమేమి కాదు. కానీ గురువారం అంటే లక్ష్మీవారం నాడు గోళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.