అన్వేషించండి

Bhagavad Gita Summary: శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారాంశం మొత్తం 10 పాయింట్స్ లో!

Bhagavad Gita Summary In Telugu: తన బంధువులను చూసి ధనుర్భాణాలు విడిచిపెట్టిన అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినదే భగవద్గీత. ఈ సారాంశం మొత్తం 10 పాయింట్లలో తెలుసుకోండి...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆత్మ శాశ్వతమైనది, దానికి జననమరణాలు ఉండవని గీత బోధిస్తుంది.
  • ఫలితాలు ఆశించకుండా, నిస్వార్థంగా కర్తవ్యాలు నిర్వర్తించాలని తెలుపుతుంది.
  • స్వధర్మాన్ని పాటించడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించడం ముఖ్యం.
  • మనసును అదుపులో ఉంచుకోవడం, భక్తి ద్వారా మోక్షం పొందవచ్చు.

Important Learnings from Bhagavad Gita: మనిషికి అంతిమ మార్గదర్శి భగవద్గీత. మన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించాలని, మనస్సును జయించాలని, ఆత్మ శాశ్వత స్వభావాన్ని గుర్తించాలని బోధిస్తుంది. ధర్మం, అంతర్గత శాంతిలో స్థిరంగా ఉంటూ శరణాగతి పొందడమే భగవద్గీత ప్రధాన సందేశం. గీత మొత్తం చదవలేకపోయినా ఆ సందేశం క్లుప్తంగా ఇక్కడుంది

1. ఆత్మ అమరమైనది

శరీరం నాశనం అయినా ఆత్మకు చావు,పుట్టుక ఉండదు. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ అగ్నిలో కాలదు, నీరు తడపలేదు.  అందుకే యుద్ధంలో చనిపోయే వారికోసం బాధపడకూడదు.

నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః 
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః 

భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!

2. ఫలాపేక్ష లేకుండా కర్మ ఆచరించు

పని చేయాలి కానీ దాన్నించి వచ్చే ఫలితాన్ని ఆశించకూడదు. మీరు చేసే కార్యం సఫలం అయినా విఫలం అయినా సమభావనతోనే ఉండాలి. ఇది మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రతి మనిషికి తనదైన ధర్మం, కర్తవ్యం ఉంటాయి..వాటిని నిర్వర్తించాల్సిందే.

3. స్వధర్మం పాటించు

తన వృత్తి, స్థానం ప్రకారం వచ్చిన ధర్మాన్ని వీడకూడదు. అర్జునుడి క్షత్రియ ధర్మం యుద్ధం చేయడమే..ధర్మం కోసం యుద్ధం చేయడం పాపం కాదు. అందుకే నీ ధనుర్భాణాలు విడిచిపెట్టిన అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు శ్రీ కృష్ణుడు

4.సమబుద్ధి

సుఖం-దుఃఖం, లాభం-నష్టం, జయం-అపజయం..అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఇలాంటి స్థిరమైన మనస్సుని యోగం అంటారు

5.మనసుని అదుపులో ఉంచు

మనసు చంచలమైనది, అస్థిరమైనది. దాన్ని అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే అదుపుచేయగలం. మనసు అదుపులో ఉంచుకుంటే అదే వారికి మిత్రుడు... అదుపు  తప్పిదే ఆ మనసే శత్రువుగా మారుతుంది. మనసును అదుపుచేసేవారి జీవితం మొత్తం శాంతిమయం

6.భక్తియోగం

భక్తితో నన్ను(కృష్ణుడిని) శరణు వేడితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. భగవంతుడిని చేరడానికి నిస్వార్థమైన మార్గం భక్తి. భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసంతో ఏం చేసినా అది ఆయనకు చేరుతుంది

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః

7.త్రిగుణాలను అధిగమించు

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున 
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్  
 
ఈ ప్రకృతి మూడు గుణాలతో నడుస్తుంది. వీటిని అధిగమించి గుణాతీత స్థితికి చేరుకున్నప్పుడే మోక్షానికి చేరువవుతారు

8.జ్ఞానం ఉత్తమమైనది

కర్మ, భక్తి మార్గాలతో పాటూ జ్ఞానం, ఆత్మ-పరమాత్మ తత్వం తెలుసుకోవడం ద్వారా మనిషి బంధాల నుంచి విముక్తి పొందుతాడు. సకల పాపాలను హరించేది ఆధ్యాత్మిక జ్ఞానమే.. అజ్ఞానాన్ని మించిన చీకటి లేదు..జ్ఞానాన్ని మించిన వెలుగు లేదని గుర్తించు

 

9. యోగం అంటే సమత్వం

యోగస్థః కురుకర్మాణి సంగంత్యక్త్వా ధనంజయ 
సిద్ధ్యసిద్ధ్యోః సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే 

యోగం అంటే సమభావనతో నీ విధులు నువ్వు నిర్వర్తించడం.  

10. పరమ శాంతి

భగవంతుడిని శరుణు వేడి, ధర్మాన్ని అనుసరించి, ఫలాపేక్ష వదిలి సమత్వంతో ఉన్నప్పుడే మనస్సు శాంతిని పొందుతుంది. చివరకు మోక్షం దిశగా అడుగువేస్తారు. ఈ సృష్టిలో ఏదీ భగవంతుడి ప్రణాళిక లేకుండా జరగదు
 
భగవద్గీత చెప్పేది ఒక్కటే..ధర్మాన్ని అనుసరించు, ఫలితం ఆశించకుండా నీ కర్మలను నువ్వు నిర్వహించు..

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

భగవద్గీతలో ఆత్మ గురించి ఏమి బోధించారు?

శరీరం నశించినా ఆత్మకు చావు పుట్టుకలు ఉండవు. ఆత్మ శాశ్వతమైనది, దానిని అగ్ని, నీరు, ఆయుధాలు ఏమి చేయలేవు.

ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అంటే ఏమిటి?

మనం చేసే పని నుండి వచ్చే ఫలితాన్ని ఆశించకుండా, కార్యం విజయవంతమైనా, విఫలమైనా సమభావనతో ఉండటమే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం.

మనసును అదుపులో ఉంచుకోవడం ఎందుకు ముఖ్యం?

మనసు చంచలమైనది. అభ్యాసం, వైరాగ్యం ద్వారా దానిని అదుపులో ఉంచుకుంటే అది మిత్రుడు అవుతుంది, లేదంటే శత్రువుగా మారుతుంది.

భగవద్గీత ప్రకారం యోగం అంటే ఏమిటి?

యోగం అంటే సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలను సమభావనతో స్వీకరిస్తూ, సమత్వంతో తమ కర్తవ్యాలను నిర్వర్తించడం.

త్రిగుణాలను అధిగమించడం వల్ల ఏమి జరుగుతుంది?

ప్రకృతిలోని మూడు గుణాలను అధిగమించి, గుణాతీత స్థితికి చేరుకున్నప్పుడు మోక్షానికి దగ్గరవ్వగలుగుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ఆగస్టు 2026 నెలవారీ జాతకం: మీ రాశికి అదృష్టం, సవాళ్లు ఏమున్నాయ్?
ఆగస్టు 2026 నెలవారీ జాతకం: మీ రాశికి అదృష్టం, సవాళ్లు ఏమున్నాయ్?
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget