Ysrcp Plenary 2022 : ప్రతిపక్షమే లేకుండా జగన్ ప్లాన్, ప్లీనరీ వేదికగా ఎన్నికల పోరుకి సమరశంఖం
Ysrcp Plenary 2022 : నేను విన్నాను..నేను ఉన్నాను ఇది జగన్ నిన్నటి మాట. మీరు చూశారు. మీరు వేస్తారు అన్నది నేటి మాట. అర్థం కాలేదా అంటూ జగన్ ప్లీనరీ ప్రసంగంలోని మాటలపై వివరణ ఇచ్చారు రాజకీయ విశ్లేషకులు.
Ysrcp Plenary 2022 : గుంటూరులో రెండు రోజులు జరిగిన ప్లీనరీలో అమ్మ రాజీనామాతో మొదలైన సమావేశాలు. అబ్బాయి శ్వాశత అధ్యక్షుడి ఎంపికతో ముగిశాయి. ఈ ప్లీనరీలో ఎప్పటిలాగానే విపక్షాలపై తమదైన స్టైల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అమ్మ రాజీనామా ఊహించిందే కానీ జగన్ ప్లీనరీలో మాట్లాడిన స్పీచే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కడినే మీ దగ్గరకు వచ్చా.. ఒక్కో కష్టంతో పైకిచ్చాను. మీ ఆదరణతో 151 సీట్లు ఇచ్చి నన్ను సీఎంగా నిలబెట్టారు. ఆ ఆదరణకు నా సెల్యూట్ అని చెబుతూ సెంటిమెంట్ ని స్టార్ట్ చేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో విపక్షం లేకుండా చేయాలని చెబుతూ 175 సీట్లు ఇచ్చి మళ్లీ అధికారం కట్టబెట్టాలన్నారు.
సంక్షేమ పథకాలు
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తనని విపక్షాలు విమర్శించడమే పని పెట్టుకున్నాయని, ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు సీఎం జగన్ అన్నారు. ఎన్ని కష్టాలున్నా..ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరిచ్చిన ప్రేమాభిమానాలే నన్ను నడిపించాయని తెలిపారు. అధికారం కట్టబెడితే నవరత్నాలను అందిస్తానన్న మాటని నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించానన్నారు. ఏ ప్రభుత్వమూ కూడా ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను ఇస్తున్నానని చెప్పారు. పేద ప్రజల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తే గత ప్రభుత్వం పెత్తందారీల అభివృద్ధికి కృషి చేసిందని ఆరోపించారు.
విపక్షాల కుట్ర
విపక్షాలకు తోడు కొన్ని పచ్చమీడియాలు కూడా ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని జగన్ ఆరోపించారు. ఇంగ్లీషు మీడియం చదువులను అడ్డుకునేందుకు చేసిన పన్నాగలను ప్రస్తావిస్తూ విపక్షాల కుట్రని గమనించమని చెప్పీ చెప్పకుండానే చెప్పారు. మేము మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించాం కాబట్టే ఇచ్చిన హామీలన్నింటినే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. మీరు వాటిని చూస్తున్నారని అందుకుంటున్నారని గుర్తుచేశారు. మీకు అన్నీ తెలుసు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి. ఎవరిని సీఎం చేయాలన్నది మీరే నిర్ణయించమని ఏపీ ప్రజలను కోరారు.
ముందస్తు ఎన్నికలకు
మీరు నమ్మితేనే..మమ్మల్ని గెలిపించండి అంటూ ఎన్నికల పోరుకి సమరశంఖం పూరించారు జగన్. మరి ఈ ప్లీనరీ వైసీపీకి ప్లస్ అవుతుందా లేదంటే టీడీపీ-జనసేనలకే కలిసొస్తుందా అన్నది తెలియాలంటే ఎక్కువ రోజులు ఆగాల్సిన పనిలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతకొన్ని రోజులుగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రానున్నాయని. జగన్ కూడా పదవీకాలం ముగియకముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నారని వార్తల వినిపిస్తోన్న తరుణంలో ఇప్పుడు ప్లీనరీలో మాట్లాడిన మాటలు నిజమనే టాక్ వినిపిస్తోంది. పక్కా ప్లాన్ తోనే ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ విపక్షాలకు ఆస్కారం ఇవ్వకుండా అధికారాన్ని హస్తం గతం చేసుకోవాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.