News
News
X

Mohanbabu Meet Chandrababu : చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ - రెండు గంటల పాటు చర్చలు !

చంద్రబాబును కలిశారు వైఎస్ఆర్‌సీపీ నేత మోహన్ బాబు. రాజకీయాలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 

Mohanbabu Meet Chandrababu :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు, గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరిన మోహన్ బాబు సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య భేటీ దాదాపుగా రెండు గంటల పాటు సాగిందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య తాజా రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా భావిస్తున్నారు. మోహన్ బాబుకు చంద్రబాబుతో అంత సన్నిహిత సంబంధాలు లేవు. గత ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని రోడ్ ఎక్కారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత వీరు ఎక్కడా కలుసుకోలేదు. అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. 

ఏపీలో అవినీతిపై బ్రహ్మాస్త్రం - ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు

గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరినప్పటికీ మోహన్ బాబు తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే జగన్ పాలనపై ఆయన ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కొన్నాళ్ల క్రితం తన కుటుంబంతో సహా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు ఆ ప్రచారాన్ని ఖండించలేదు కానీ.. ధృవీకరించలేదు. ఆ తర్వాత పలు సందర్భాల్లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని.. ఒక వేళ రాజకీయం అంటూ చేస్తే బీజేపీతోనేనన్నట్లుగా చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ప్రధాని అయ్యేందుకు ఏపీని నాశనం చేశారు, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు మోహన్ బాబు స్వయంగా వెళ్లి చంద్రబాబుతో భేటీ అయినట్లుగా బయటకు తెలియడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే వ్యక్తిగత పరిచయాలతో భేటీ అయి ఉంటారని.. రాజకీయం కోసం కాదని కొంత మంది చెబుతున్నారు. ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రారని భావిస్తున్నారు. మోహన్ బాబు మళ్లీ టీడీపీలోకి వచ్చే అంశం చర్చకు రాలేదని టీడీపీ నేతలు  చెబుతున్నారు. ఇటీవల మోహన్ బాబు కుటుంబానికి చెందిన విద్యానికేతన్‌ను ... మోహన్ బాబు యూనివర్శిటీగా మార్చారు. ఈ క్రమంలో ఆ యూనివర్శిటీ ప్రారంభోత్సవం లేదా ఇతర అంశాలపై చతంద్రబాబుతో భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు. 

చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. గత ఎన్నికల్లో వరుసగా మద్దతుగా నిలబడిన వారంతా ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా దూరమవుతున్న సంకేతాలు కనిపించడం ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. 

Published at : 26 Jul 2022 06:59 PM (IST) Tags: mohan babu Chandrababu Mohan Babu met with Chandrababu

సంబంధిత కథనాలు

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

KTR On MODI : పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

KTR On MODI :  పథకాలన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా ? - ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ !

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Revant Corona : రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

Revant Corona :  రేవంత్‌కు మరోసారి కరోనా - పాదయాత్రకు దూరం ! నల్లగొండ సీనియర్ల పంతం నెగ్గిందా ?

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?