అన్వేషించండి

AP ACB 14400 : ఏపీలో అవినీతిపై బ్రహ్మాస్త్రం - ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు

ఏపీలో అవినీతి పై ఫిర్యాదు చేయడానికి రూపొందించిన యాప్ కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బోర్డులు పెట్టనున్నారు.


AP ACB  14400 : ఏపీలో అవినీతి నిరోధానికి సంబంధించి  అమలులోకి తెచ్చిన 14400 కాల్ సర్వీసులకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  డిస్ ప్లే  బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో అవినీతిని అంతమొందించే లక్ష్యంతో ఆర్టీజిఎస్ సహకారంతో ఏసీబీ  ఆధ్వర్యంలో ‘14400’తో కూడిన కాల్ సర్వీసులు ,   యాప్ ను రూపొందించామని ఈ అంశంపై జరిగిన సమీక్షలో సీఎస్ గుర్తు చేశారు. జూన్‌లో సీఎం ఆవిష్కరించారని.. కానీ అనుకున్న విధంగా ప్రజల్లోకి వెళ్లలేదన్నారు. అందుకే విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని ప్రభుత్వం దృష్టికి అదే విధంగా అవినీతి నిరోధకశాఖ దృష్టికి తీసుకు వచ్చేందుకు ఈయాప్ ఉపయోగ పడుతుందని కావున ప్రజలు ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే తెలియజేసేందుకు కృషి చేయాలని చెప్పారు.

"చేయి చేయి కలుపుదాం అవినీతి భూతాన్ని తరిమివేద్దాం-లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరం" అనే నినాదంతో రూపొందించిన ఈ 14400 యాప్ పై ప్రజలందరికీ విస్తృతంగా తెలిసే విధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో  డిస్ప్లే బోర్డులను 15రోజుల్లోగా ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. ఈవిషయంలో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలోని అన్ని గ్రామ పంచాయితీలు,గ్రామ సచివాలయాలు, మండల స్థాయిలో తహసిల్దార్,ఎండిఓ,సబ్ రిజిష్ట్రార్ తదితర కార్యాలాయాలు,డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను   బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  14400 యాప్ ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుండి రిజిష్టర్ మొబైల్ నంబరుతో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 14400 యాప్ లో రెండు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.  లైవ్ రికార్డు ఆడియో,పొటో లేదా వీడియో సౌకర్యం కలిగి ఉండి వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది.  మరో ఫీచర్ వీడియోలు, పొటోలు,డాక్యుమెంట్లు,ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఉంది .ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్ కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫెరెన్సు వస్తుంది. ఏ ప్రభుత్వ అధికారైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఏసీపీ వెంటనే చర్యలు తీసుకుంటుంది.  

 ఇప్పటి వరకూ 14400కు వచ్చిన మొత్తం కాల్స్ లక్షా 49వేల 950 కాగా వాటిలో 8వేల 842 ఎసిబికి సంబంధించినవి.   26వేల 292 ఎసిబి కాల్ సెంటర్ పనితీరుకు సంబంధించిన ఎంక్వయిరీ కాల్స్ అని అశోక్ కుమార్ సిఎస్ కు వివరించారు. ఎసిబి కాల్ సెంటర్ కు వచ్చిన 8,842 కాల్స్ లో ఎసిబికి సంబంధించిన 8687 ను ఇప్పటి వరకూ పరిష్కరించినట్లుగా అధికారులు ప్రకటించారు.   నాన్ ఎసిబికి సంబంధించి గత మే నుండి ఇప్పటి వరకూ వచ్చిన 1261 లో 943 పరిష్కరించారు.   

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget