Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !
అనంతపురం ఎస్పీ ప్రకటన తర్వాత గోరంట్ల మాధవ్ అంశంలో వైఎస్ఆర్‌సీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. విపక్షాలపై విమర్శలు చేస్తోంది.
Ysrcp Reactions : న్యూడ్ వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో అనంతపురం పోలీసులు ఒరిజినల్ వీడియో దొరికే వరకూ నిజానిజాలు తేల్చలేమని ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అసలైన వీడియో కాదని.. అసలైన వీడియో ఎవరో చూస్తూండగా మరొకరు వీడియో తీశారన్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఫేక్ వీడియోతో రాజకీయ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ అంశంపై స్పందించారు. అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధి అంశాన్ని మొత్తం వైస్సార్సీపీ కి అంటగడుతున్నారని విమర్శించారు. వైస్సార్సీపీ మహిళలకు కీడు చేస్తుందని టీడీపీ ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు.
మహిళలకు జగన్ మేలు చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రకటన
రాజకీయంగా కుయుక్తుల తో ఎదుటి పార్టీ ని పడగొట్టడం చంద్రబాబు నైజమని ధర్మాన విమర్శించారు. సీఎం జగన్ తన కేబినెట్ లో ఎన్నడూ లేనంతమంది మహిళలను కాబినెట్ లో మంత్రులుగా చేశారని... మహిళ ల రుణాలు తీర్చుతానని చెప్పి అధికారం లోకి వచ్చి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మహిళా రుణగ్రస్తులను మోసం చేస్తే సీఎం జగన్ వచ్చి వాళ్లకి రుణ విముక్తులను చేశారన్నారు కుటుంబాన్ని తీర్చి దిద్దటం లో మహిళలు కీలకం అని గుర్తుంచి, మహిళకు నాయకత్వం ఇచ్చి జగన్ గౌరవిస్తున్నారన్నారు. బాధితులు ఎవరూ లేని ఘటన లో టీడీపీ ఆరోపిస్తుందని ఇది ఎఎంత వరకూ సమంజసమని ధర్మాన ప్రశ్నించారు.
మహిళలను వేధిస్తే గతంలో పార్టీ నేతలను ఉపేక్షించలేదన్న ధర్మాన
మహిళలపై వేధింపుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా జగన్ సర్కార్ ఊపేక్షించలేదని ధర్మాన గుర్తు చేశారు. గతం లో ఇలాంటి ఆరోపణలు వస్తే సీఎం జగన్ చర్యలుల తీసుకున్నారన్నారు. గడిచిన వారం రోజులుగా ఇదే అంశాన్ని పట్టుకొని టీడీపీ నతేలు వేలాడు తున్నారని.. సమస్యలు పై స్పందించకుండా ఇలాంటి దిగజారుడు పనులు చేయడం ఏమిటన ిప్రశ్నించారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే అనవసరం గా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం లో చెప్పడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర యాగీ చేస్తున్నారని.. సమాజం లో సిగ్గుమాలిన పని ఎవరు చేసినా అది ఉపేక్షించేది కాదని స్పష్టం చేశారు.
అనంత ఎస్పీ ప్రకటన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతల దూకుడు
అనంతపురం ఎస్పీ ప్రకటన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు గోరంట్ల మాధవ్ ఇష్యూలో తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు. అది ఒరిజినల్ వీడియో కాదని పోలీసులు చెప్పారని.. మొదటగా టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లోనే పోస్ట్ అయిందని చెబుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని అనంతపురం ఎస్పీనే చెప్పారని అంటున్నారు. మొత్తానికి వైఎస్ఆర్‌సీపీకి రాజకీయంగా ఇబ్బందికమైన అంశానికి అనంతపురం ఎస్పీ ప్రకటనతో ఎదురుదాడికి అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు.