అన్వేషించండి

YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?

Politics with family disputes: డీఎంకే వారసుల మధ్య జరిగిన ఘర్షణలు, సమాజ్ వాదీ ఫ్యామిలీ విభేదాలు ఆయా పార్టీల ప్రతిష్టను భారీగా దెబ్బతీశాయి. ఇప్పుడు వైసీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.

Jagan strategic mistake: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్సార్ కుటుంబ అంతర్గత కలహాలు పెను దుమారం రేపుతున్నాయి. ఒకప్పుడు అభేద్యమైన కోటలా కనిపించిన ఈ కుటుంబంలో ఆస్తి పంపకాలు, వ్యక్తిగత విభేదాలు వీధిన పడటం చర్చనీయాంశంగా మారింది.   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఈ పోరు కేవలం కుటుంబ వ్యవహారంగా మిగిలిపోకుండా రాజకీయ రంగు పులుముకోవడం వల్ల అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, విజయలక్ష్మి పడ్డారంటున్న వైసీపీ 

రాజకీయాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో కీలకం. జగన్ తన సోదరి షర్మిల లేవనెత్తుతున్న ఆస్తి వాటాల అంశాన్ని ప్రతిపక్షాల కుట్రగా భావించడం, చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఆమె పడ్డారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించడం గమనార్హం. వ్యక్తిగత సమస్యలను రాజకీయ కోణంలో ఎదుర్కోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.   తమిళనాడులో కరుణానిధి వారసుల మధ్య జరిగిన ఘర్షణలు, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలు ఆయా పార్టీల ప్రతిష్టను భారీగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై పార్టీ నేతలతో విమర్శలు చేయించడం సొంత కేడర్‌ను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రక్తసంబంధీకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో జగన్ పట్ల ఒక రకమైన ప్రతికూల భావన ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కుటుంబ సమస్యను రాజకీయం చేయడం వ్యూహాత్మక తపపిదం

అమ్మ, చెల్లి ఇద్దరూ ప్రత్యర్థుల చేతిలో పావులుగా మారారనే ప్రచారం సామాన్య ఓటర్లలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. తన సొంత కుటుంబ సభ్యులనే ఒప్పించలేని,  మెప్పించలేని నాయకత్వం రాష్ట్ర ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతాయి. షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా రాజకీయ విమర్శలు చేస్తున్నప్పుడు వాటిని రాజకీయంగానే తిప్పికొట్టాలి. అలా కాకుండా ఆస్తుల గొడవను తెరపైకి తెచ్చి ఆమెను వ్యక్తిగతంగా దూషించడం వల్ల వైఎస్సార్‌సీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది తప్ప ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

తల్లి, చెల్లితో రాజీ చేసుకుంటేనే రాజకీయ లాభం

కుటుంబ సమస్యలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోకపోవడం వల్ల రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు జగన్ వెనుక కొండంత అండగా నిలిచిన విజయమ్మ, షర్మిల నేడు ఆయనకు దూరంగా జరగడం అనేది భావోద్వేగపూరితమైన ఆంధ్ర ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులతో మైండ్ గేమ్స్ ఆడటం సహజం కానీ, అది కన్నతల్లి, కన్నచెల్లితో సాగితే ప్రజల నుంచి వచ్చే స్పందన మరోలా ఉంటుంది. ఈ వివాదం ఎంత కాలం సాగితే అంతగా వైఎస్సార్ వారసత్వంపై ప్రజలకున్న నమ్మకం సడలిపోయే ప్రమాదం పొంచి ఉంది.   వ్యక్తిగత ఆస్తుల వివాదాలు రాజకీయాల్లోకి చొచ్చుకురావడం వల్ల   ప్రతిపక్ష పార్టీగా ఎలా పని చేస్తున్నారు అనే దానికన్నా.. ఈ వివాదమే హైలెట్ అవుతుంది.  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గానీ, సంబంధిత రాజకీయ పార్టీకి గానీ  అంత మంచిది కాదు.  జగన్ ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక అన్నగా కుటుంబ పరిధిలోనే ముగించుకుంటేనే ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు మేలు జరుగుతుంది. లేకపోతే ఈ అంతర్గత కలహాలే భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి తీరని నష్టం చేకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget