Sajjala On GO : ఆ జీవో వైఎస్ఆర్‌సీపీకి కూడా - రాద్దాంతం ఎందుకని సజ్జల ప్రశ్న !
కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. అది వైసీపీకి కూడా వర్తిస్తుందని సజ్జల పేర్కొన్నారు. రాద్దాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Sajjala On GO : సభలు సమావేశాలు పై ఆంక్షల జీఓ ఎందుకు వచ్చిందో ప్రపంచం అందరికి తెలుసని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం అందరికి వర్తిస్తుందని,వైసీపీ కి కూడ అవే నిబంధనలు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు కందుకూరు సభ లో జరిగిన తొక్కిసలాట,మరణాల వల్లనే ప్రభుత్వం జిఓ తెచ్చిందని వ్యాఖ్యానించారు.ప్రభుత్వ తీసుకున్ననిర్ణయాలను తప్పు పడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.వైసీపీ తో సహా అన్ని పార్టీలకు ఈ జిఓ వర్తిస్తుందని చెప్పారు.వైసీపీ కి మాత్రమే అనుమతి ఇస్తే మిగిలిన పార్టీ లు అడగచ్చని అన్నారు.
జిఓ లపై కోర్ట్ కు వెళ్లే హక్కు ఉంటుందన్నారు,లోకేష్ పాదయాత్ర కోసం జిఓ అనేది టీడీపీ ఊహ అని,లోకేష్ బాబు పవన్ జనం లో ఉండాలనేదే మా అభిప్రాయం అని సజ్జల వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేసీఆర్ బిఅరెస్ తరపున మద్దతు ఇస్తే మంచిదేనని,తాము కూడ అదే కోరుకుంటున్నామని సజ్జల అన్నారు. కొత్త పార్టీ లు వస్తే మంచిది, బిఅరెస్ లోకి వెళ్ళడానికి టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారా ఆయన ఎద్దేవా చేశారు. పోలీసులు పై టీడీపీ వ్యవహరిస్తున్న తీరును సజ్జల తప్పుబట్టారు.తాము ఇస్టాను సారంగా వ్యవహరిస్తాం కాబట్టి, మనిషికి ఒక పోలీస్ ను పెట్టి శాంతి భద్రతలను పర్యవేక్షించాలని టీడీపీ దబాయించినట్లుగా మాట్లాడటం సరి కాదని అన్నారు.
ఒకే సారి వందల మందిని ఆశ పెట్టి సభలకు తీసుకువచ్చి,అక్కడ వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా,తొక్కిసలాటకు కారకులు అయ్యి,పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ చేయటం దారుణమని అన్నారు. గుంటూరు సభలో టీడీపీ నేతలు చేతులు ఎత్తేస్తే పోలీసులే స్వయంగా సహయం చేశారని,దీంతో గాయపడిన వారు త్వరగా కోలుకున్నారని,సజ్జల అన్నారు.అయితే టీడీపీ నేతలు మాత్రం పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటనలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారని సజ్జల ఫైర్ అయ్యారు...టీడీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వితండ వాతం చేస్తున్నారని,అందులో భాగంగానే టీడీపీ సోషల్ మీడియా కేంద్రంగా జగన్,పోలీసుల పై టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గుంటూరులో నిర్వహించే దీక్షకు టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదనే విషయాన్ని ప్రజలంతా గుర్తు పెట్టుకున్నారని సజ్జల అన్నారు.గుంటూరు నగరంలో సభలకు అనుమతులు ఇవ్వటానికి అవకాశం లేదని అప్పటి ప్రభుత్వం చెబితే,వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకొని నది ఒడ్డున సభ నిర్వహించి విషయాన్ని ఆయన ప్రస్తావించారు.సభలు ఎక్కడ పెడితే ఎవరికి ఇబ్బంది ఉంటుందని సజ్జల ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా నాయకులు తమసందేశాన్ని ఇవ్వాలనుకుంటే,వేదిక,స్దలం గురించి ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.బహిరంగ సభలను మైదాన ప్రాంతాల్లో ఊరికి చివర్లో పెట్టుకుంటే,అందులో తప్పు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. టీడీపీ అనవసర రాజకీయాలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి వెళ్లి తిప్పికొడతామని సజ్జల అన్నారు.
కుప్పంలో కొత్త రూల్స్ ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు - చంద్రబాబు టూర్‌కు ముందు పోలీసుల హెచ్చరిక !