అన్వేషించండి

Telangana Politics : బీఆర్ఎస్ఎల్పీ విలీనంలో రేవంత్ ఫెయిల్ - ఇక చేరికలు లేనట్లేనా ?

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇక ఎమ్మెల్యేల చేరికలు కష్టమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్పీ విలీనం సాధ్యం కాదని ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

MLAs Joinings in Telangana Congress  :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకరొకరుగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. పదకొండో ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారని ఓ సారి హడావుడి చేశారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని ఆ పార్టీలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉండరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వరకూ గంభీరమైన ప్రకటనలు చేశారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ముగిశాయి.. ప్రతిపక్ష నేత హోదాలో ఓ సారి కేసీఆర్ సభకు వచ్చి వెళ్లారు. కానీ మరో ఎమ్మెల్యే చేరిక మాత్రం జరగలేదు. 

బీఆర్ఎస్ ఎల్పీ విలీనం  లేనట్లే

భారత రాష్ట్ర సమితి ఎల్పీని విలీనం  చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నం సఫలం కాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది  రేవంత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారు కానీ.. పార్టీలో చేరే విషయంలో మాత్రం ఏ విషయం చెప్పడం లేదు. రేవంత్ సీఎం కాబట్టి  ఆయనను ధిక్కరించలేరు.. అలాగని పార్టీలో చేరిపోతామని కూడా చెప్పడం లేదు. అనివార్య పరిస్థితుల్లో కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాంటి వారు పది  మంది ఉన్నారు. మరో పదిహేను మందిని అయినా చేర్చుకుంటే తప్ప.. ఎల్పీ విలీనం కాదు. ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో  టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారెవరో మాత్రం.. క్లారిటీగా లేదు. అయితే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడిందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..విలీనమయ్యే స్థాయిలో కాంగ్రెస్‌‌లలో చేరే పరిస్థితి లేదని క్లారిటీ వచ్చేసినట్లయింది. 

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం, అక్బరుద్దీన్ ఒవైసీని డిప్యూటీ సీఎం చేస్తానని హామీ

బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య డీల్‌పై ప్రచారమే కీలక కారణం

వచ్చే కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని ఓపిక పట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పెద్దలు సర్ది చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో జరుగుతున్న చర్చల గురించి బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో ప్రభుత్వాన్ని మార్చేద్దామన్న నమ్మకం కలిగేలా పార్టీ ఎమ్మెల్యేలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం లేదా పొత్తుల గురించి ఎంతగా ప్రచారం జరిగుతున్నా మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా రెండు పార్టీల నేతలు మౌనంగా ఉంటున్నారు. అసలు అలాంటిదేమీ లేకపోతే మరో మాట లేకుండా ఖండించేవారు. అలాంటి ఖండన ప్రకటనలు రాకపోవడంతో నిజంగానే చర్చలు జరుగుతున్నాయన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇబ్బంది పడతామని జరిగే పరిణామాలను బట్టి వేచి చూడాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా చేరికలు కాంగ్రెస్ అనుకున్నంత జోరుగా సాగలేదు. 

ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?

కొంటున్నామని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం 

మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఐదు నుంచి పది కోట్లకు కొంటున్నామని అంత కంటే ఎక్కువ ఖరీదు పెట్టడం లేదని .. చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని నమ్మి తాము పార్టీలో చేరితే.. తామేదో డబ్బులకు అమ్ముడుపోయామన్నట్లుగా ప్రచారం చేయడం ఏమిటని వారు అసంతృప్తికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారో కానీ.. వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరి అమ్ముడుపోయామన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని  సైలెంట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పటికప్పుడు భిన్నంగా ఉంటాయి. అలాంటి పార్టీలో చేరాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితిని కల్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలపై ఆలోచన చేయాల్సిందే కానీ...ఇక చేరికల గురించి వద్దని కాంగ్రెస్ పెద్దలు కూడా ఓ నిర్ణయానికి వస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Rajya Sabha Elections 2026: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
Congress North vs South Strategy: రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?
కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
YouTuber Maridhas Detained: అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget