News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

తెలంగాణలో రేపో మాపో కొత్త పార్టీ ఏర్పాటు కానుందా ?

టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టబోతున్నారా ?

అతి తక్కువ సమయంలో కొత్త పార్టీతో నేతలు ఏం సాధిస్తారు ?

FOLLOW US: 
Share:

 

Telangana New Party :   తెలంగాణలో  కొత్త పార్టీ అంశంపై జోరుగాప్రచారం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంటే అస్త్రంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్‌ ను ఉపయోగించుకునేందుకు కొత్తగా టీఆర్ఎస్ పార్టీని కొంత మంది కీలక నేతలు మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు ఉంటుంది కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ  రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి అనే పేరు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఈ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. 

పొంగులేటి, జూపల్లి అదే పనిలో ఉన్నారా ? 

తెలంగాణలో  ఏర్పాటయ్యే కొత్త పార్టీ వ్యూహంలో పాలు పంచుకుంటున్నదెవరన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 20 మంది కీలక నేతలు కొత్త పార్టీ ఏర్పాటులో పాలు పంచుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.   వీళ్లంతా పొంగులేటి, జూపల్లితో రహస్యంతా మంతనాలు జరుపుతున్నట్టు  చెబుతున్నారు.  ప్రజాబలం ఉండి.. మూడు పార్టీల్లో ఇమడలేక పోతున్నవారు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి అసంతృప్తులు, బీఆర్ఎస్ లో మొదటి నుంచి కొనసాగుతూ పదవులు దక్కని వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు  తెలంగాణ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

ఈటల మాటలు కొత్త పార్టీ ప్రకటనకు నిదర్శనమా ? 

 పొంగులేటి, జూపల్లి కృష్ణారావును తాను బీజేపీలో చేరాలని ఆహ్వానించానని, వారు తనకే కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటల రాజేందర్ మీడియా చిట్ చాట్ లో చెప్పారు.  ఆ నేతకు వాళ్లేం కౌన్సెలింగ్ ఇచ్చారు..? ఏం మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కొనసాగింపుగా జూపల్లి కృష్ణారావు బీజేపీకి చెందిన నలుగురైదుగురు నేతలు తనతో టచ్ లో ఉన్నారన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఇప్పటి వరకు పదవులు దక్కని నేతలు, టికెట్లు రావనుకొనే వారు కొత్త పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో వర్గపోరు ఉంది.  పలువురు ఎమ్మెల్యేలు తాజాగా తమ పరిస్థితి ఏమిటని సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఇలాంటి నేతలంతా కొత్తగా ఏర్పడబోయే పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. దాదాపు పది మంది వరకు పొంగులేటి, జూపల్లితో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.  

కొత్త పార్టీ వెనుక ఆర్థిక బలమున్న నేతలు 

 తెర వెనుక ఆర్థికంగా బలమైన నేతలే ఉన్నారని చెబుతున్నారు.   ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని... టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్‌కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  కొత్త పార్టీలో కీలకమయ్యే నేతల్లో అత్యధిక మంది  లక్ష్యం కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత  కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని.. దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉద్యమ  బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.                  

మొత్తంగా ఈ రాజకీయ పార్టీ అంశం ఉద్దృతంగా తెరపైకి వచ్చి..  తెలంగాణ అంశానికి దూరంగా జరగడం ఇష్టం లేని నేతలు ఈ పార్టీలో చేరితే.. బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీని ఎప్పుడు తెరపైకి తెస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. 

 

Published at : 01 Jun 2023 08:00 AM (IST) Tags: Ponguleti Srinivasa reddy Telangana Politics Jupalli Krishna Rao New Political Parties in Telangana

ఇవి కూడా చూడండి

Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు

Minister RK Roja: పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? నారా లోకేశ్‌పై మంత్రి రోజా సెటైర్లు

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం

Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ