అన్వేషించండి

Minister Vs MP : రసవత్తరంగా రామచంద్రాపురం రాజకీయం- పిల్లి తన దారి తాను చూసుకుంటారా?

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం వైసీపీ టిక్కెట్టు ఇస్తే అవసరమైతే తన ఎంపీ పదవికి, పార్టీకు రాజినామా చేస్తానని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు.

రామచంద్రపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో కీలక నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు అవసరమైతే తన ఎంపీ పదవికి, పార్టీకు రాజీనామా చేస్తానని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ వెంటే నడిచానని, పార్టీ ఆదేశాల మేరకే నడచుకున్నానని అన్నారు. కానీ అవకాశవాద రాజకీయాలు చేసే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలవబోనంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు రామచంద్రపురం వైసీపీ టిక్కెట్టు ఇస్తే స్వయంగా తాను లేదా కుమారుడు సూర్యప్రకాష్‌ ఇండిపెండెంట్‌గానైనా రంగంలోకి దిగుతామని తేల్చిచెప్పారు. 

మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం
రామచంద్రపురంలో బోస్‌కు వ్యతిరేకంగా మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని ఇది మరింతగా పెంచి పోషిస్తోంది. ఆదివారం కూడా ఓ సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రితోపాటు ఆయన కుమారుడు, మంత్రి ముఖ్య అనుచరులు అంతా హాజరయ్యారు. ఈసమావేశం పూర్తిగా తన బలప్రదర్శన చేసుకునే విధంగానే ఉంది. దీంతో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌పై తన అనుచరుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. 

ఇప్పటికే వారం రోజుల క్రితం రామచంద్రపురంలో బోస్‌ అనుకూల వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రామచంద్రపురం వైసీపీ టిక్కెట్‌ బోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వాలని, మంత్రి వేణు తమను అన్నివిధాలుగా రాజకీయంగా తొక్కేందుకు  ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని బోస్‌ అనుచరులు ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయతీ..
రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా రచ్చకెక్కిన వైసీపీలో అంతర్యుద్ధం చివరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రిని కలిశారు. రచ్చకెక్కిన విభేదాలు వల్ల పార్టీకు నష్టం వాటిల్లుతోందని, ఏమైనా ఉంటే ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడతానని జగన్‌ చేప్పారు. రామచంద్రపురంలో వేణు పోటీచేయడం తనకు ఇష్టం లేదని తాను చెప్పేశానని బోస్‌ అంటున్నారు. ఈవిషయంలో ముఖ్యమంత్రి జగన్‌ బోస్‌పై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఎంపీ బోస్‌ మరోసారి రామచంద్రపురంలో మంత్రి వేణుకు టిక్కెట్టు ఇస్తే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని, పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బోస్‌ వెల్లడించారు.

తెలుగుదేశం వైపు చూపులు...?
రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు బలమైన వర్గం ఉంది. వేణుకు ఆ స్థాయిలోనే వర్గం ఉన్నప్పటకీ స్థానికుడు కాదన్న విమర్శ ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ తనకు సంతృప్తికరమైన స్థానాన్ని ఇచ్చారని చెబుతూనే తనకు మంత్రి వేణు రామచంద్రపురంలో పోటీ చేయడం ఇష్టం లేదని తేల్చిచెబుతున్నారు బోస్‌. అయితే అధిష్టానం ఇప్పటికే రామచంద్రపురం నుంచి వేణు పోటీ చేస్తారని ఓ క్లారిటీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరాక ఆయనకు మండపేట వైసీపీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో కొత్తపేటకు చెందిన మాజీ శాసన మండలి వైస్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా టీడీపీ నియమించింది. అయితే బోస్‌ వంటి బలమైన నాయకుడు టీడీపీలోకి వస్తే వెంటనే ఆహ్వానించడమే కాకుండా పార్టీ టిక్కెట్టు కూడా ఇస్తామని హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈనెల 26న రానున్నారు. ఈ సందర్భంగా బోస్‌ను పిలిపించి మాట్లాడి రచ్చకెక్కిన రగడను సర్దుబాటు చేస్తారా.. ఈలోనే నిర్ణయం తీసుకుని బోస్‌ పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Embed widget