అన్వేషించండి

Pawan Kalyan Political : రాజకీయాల్లో ఆ "పవర్" ఏది ? పవన్ కల్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ ఎప్పుడవుతారు?

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సూపర్ స్టార్‌గా ఎందుకు ఎదగలేకపోతున్నారు ? ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉంటున్నా వ్యూహాత్మక అడుగులు వేయలేకపోతున్నారా?

Pawan Kalyan Political :    పవన్ కల్యాణ్. ఈ మాట వింటే లక్షల మంది వైబ్రేషన్. ఏ హీరోకూ లేనంత ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్ సినిమా వల్ల మాత్రమే రాలేదు. ఆయన సామాజిక స్పృహ, రాజకీయ ఆలోచనలు, సమాజానికి మంచి చేద్దామన్న ఓ పట్టుదల కారణంగా కూడా అభిమానులు ఉన్నారు. అన్యాయాలపై ఎదిరించాలన్న ఓ ఫైర్ పవన్ కల్యాణ్‌లో కనిపిస్తుంది. అందుకే యువరాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చి.. జనసేనతో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో అన్నీ వైఫల్యాలే. ఎందుకిలా జరుగుతోంది ?. రాజకీయంగా పవన్ కల్యాణ్ సూపర్ హిట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారు ?

సామాజిక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ 

పవన్ కల్యాణ్ సామాజిక స్పృహ ఉన్న నేత. వందలు, వేల పుస్తకాలు చదివారు. రాజకీయంగా సమాజానికి ఏదైనా చేయాలనుకునే స్వభావం ఉన్న నేత. అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత సైలెంటయ్యారు. కానీ ఆయనలోని రాజకీయ భావాలు కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించి.. తాను అందరి లాంటి రాజకీయ నాయకుడ్ని కాదని.. ఓట్లు చీల్చడం ఇష్టం లేదని చెప్పి పోటీ చేయలేదు. టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అయితే అదే పెద్ద తప్పని కొంత మంది అంటారు. పోటీ చేయడం ఇష్టం లేకపోతే పార్టీ ప్రకటన చేయకుండా ఉండాల్సిందని ఎన్నికలైన తర్వాత పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేదని కొంత మంది వాదన. 

పార్టీని ప్రకటించి టీడీపీ-బీజేపీకి మద్దతు ప్రకటించిన పవన్ 

టీడీపీ-బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న ఆయన చివరి ఏడాది విభేధించి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి 2019లో పోటీ చేశారు. కానీ ఆయన రెండు చోట్లా ఓడిపోవడం పెద్ద మైనస అయింది. అదే సమయంలో ఆయన పార్టీ తరపున రాజోలు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. జనసేన పార్టీకి నికరంగా ఆరు శాతం ఓట్లు ఉన్నట్లుగా 2019 ఎన్నికలతో తేలింది. ప్రజారాజ్యంతో పోలిస్తే ఈ ఓటు శాతం చాలా తక్కువ. అయితే పవన్ కల్యాణ్ పోరాటయోధుడు. ఓట్లు, సీట్లు రాలేదని ఆయన నిరాశపడలేదు. రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆయన ఓ పొలిటికల్ ఫోర్స్‌గా మారారా అంటే చెప్పలేని పరిస్థితి. తనకు అండగా ఉండే  సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట్ల జనసేన భారీగా ఓట్లు చీలుస్తోంది. కానీ గెలిచేంత వరకూ రావడం లేదు. అక్కడే జనసేన వైఫల్యం చెందింది. 

2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ 

పార్టీ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా.. జనసేనకు పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడం పెద్ద మైనస్. పార్టీ కోసం అయినా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికైనా పవన్ సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం పెరిగిపోయింది. ఎప్పుడో ఓ సారి సమావేశం పెట్టడం.. లేకపోతే డిజిటల్ క్యాంపెన్ నిర్వహించడంతో సరిపోతోంది.  ప్రజా పోరాటాలు పరిమితంగా ఉన్నాయి. అయితే ఆయనపైనా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు. అయినా పవన్ మాత్రం గీత దాటలేదు. రాజకీయంగానే తేల్చుకుంటానని.. వైఎస్ఆర్‌సీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. 

బలాన్ని గుర్తించి.. ఆ బలంతోనే గెలిచే ప్రయత్నం చేయాలి ! 

పవన్ కల్యాణ్ రాజకీయంగా విశాలమైన దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది. ఉన్న బలాన్నే పక్కాగా వాడుకునే ప్రయత్నం చేయాలన్నది రాజకీయ నిపుణుల అంచనా. అదే సమయంలో ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించాలంటే.. ఎక్కువగా ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఏదైనా సభ నిర్వహిస్తే తర్వాత రెండు వారాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించరు. గత మూడేళ్లుగా ఇదే జరగడం వల్ల ఆయన అందుబాటులో ఉంటారన్న నమ్మకం ప్రజలకు కలగడం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. దసరా నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్నికల వరకూ ఆయన జనంలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రాజకీయంగానూ ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

పవన్ కల్యాణ్  ఘోర పరాజయంతోనే సినీ కెరీర్ ప్రారంభించారు. కానీ ఇప్పుడాయన  సూపర్ స్టార్‌గా ఉన్నారు. రాజకీయాలలోనూ ఆయన అలాగే అవుతారని జనసైనికులు నమ్మకంతో ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Renuka Chowdhury at ABP Summit: దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
దక్షిణాది వారితో టోకనిజం చేయవద్దు.. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు!
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget