అన్వేషించండి

YSRCP Self Goal : నెయ్యి కాంట్రాక్టర్ తప్పును నెత్తి మీద వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - సలహాదారులంతా కలిసి ముంచేశారా ?

Tirupati Laddu Politics : తిరుమల నెయ్యి కల్తీ వివాదం అంతా వైసీపీ తనకు ఎందుకు చుట్టుకుంది ? టీటీడీ లేకపోతే కాంట్రాక్టర్ చేసే తప్పును వైసీపీ , జగన్ ఎందుకు తమ పనే అన్నట్లుగా డిఫెండ్ చేసుకుంటున్నారు ?

YS Jagan : రాజకీయాల్లో ఎప్పుడూ తప్పించుకునేందుకు ఓ దారిని పార్టీలు సిద్ధంగా ఉంచుకుంటాయి. అడ్డంగా దొరికిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే ఏదైనా  సమస్య వస్తే తమ మాటాల్ని వక్రీకరించారనో  తప్పుగా అర్థం చేసుకున్నారనో చెప్పి సర్దుకుంటారు. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మొత్తం వ్యవహారాన్ని తన పార్టీకి అంటించుకునే విషయంలో అత్యుత్సాహం ప్రదర్సించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన  జరిగిన తప్పును వైసీపీ, జగన్ తప్పు అని చెప్పడానికి ప్రయత్నించడం సహజం. అలాంటి సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన వైసీపీ, జగన్ పూర్తిగా దానికి  బాధ్యత వహిస్తూ.. తెరపైకి వచ్చారు. తప్పేమీ  జరగలేదని  వాదిస్తూ పోతున్నారు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతోంది. తప్పు జరిగిందని నమ్మేవాళ్లంతా.. వైసీపీ, జగన్ వల్లే అనుకునే పరిస్థితి వచ్చేసింది. 

నెయ్యి కల్తీ అయితే జగన్, వైసీపీ ఎందుకు మీదేసుకున్నారు ?

కూటమి  ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా ఆ అంశం సంచలనం సృష్టిస్తుంది. వైసీపీ, జగన్‌పై ఉన్న అన్యమత ముద్ర కారణంగా ఇది మరింత సంచలనం అవుతుంది. అలాంటి సమయంలో ఏ పార్టీ అయినా ఆ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సవాళ్లు, ప్రతి సవాళ్లు కాకుండా..  నిరూపంచాలని సవాల్ చేయాలి. అది కూడా.. ఈ వాదన అంతా.. టీటీడీలో బాధ్యులుగా ఉన్న వారినే ముందుగా పెట్టి నడిపించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలతో వివరణ ఇప్పిస్తే సరిపోయేది. కానీ నేరుగా జగన్ వచ్చి.. అసలు కల్తీ జరగలేదని చెప్పడం ద్వారా.. మొత్తం జరిగిన వ్యవహారం అంతా జగన్, వైసీపీ కనుసన్నల్లోనే జరిగిందన్న భావనకు జనం వచ్చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. 

వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?

కల్తీ జరిగి ఉంటే వైసీపీకి ఏం సంబంధం అని వాదించుకునే ఆప్షన్ పెట్టుకోలేకపోయారు !

టీటీడీ స్వతంత్ర బోర్డు. అందులో సందేహమే లేదు. కానీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. కానీ సీఎం అయినా మరెవరు అయినా రోజువారీ వ్యవహారాలను చూడరు. నెయ్యి కొనుగోలు అంశంలో ఏం జరిగిందో టీటీడీలో పెద్దలకే తెలియాలి. అయితే ఏం జరిగినా బాధ్యులు..మాత్రం కాంట్రాక్టర్, టీటీడీలోని పెద్దలే . వారు వైసీపీ నేతలు అయినప్పటికీ.. బాధ్యత వారికే వ్యక్తిగంగా ఉంటుంది. కానీ ఈ వివాదాన్ని వైసీపీ మీదకు వచ్చేలా చేయడంలో వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లడ్డూ కల్తీ జరిగినట్లుగా తేలి ఉంటే అది ఖచ్చితంగా కాంట్రాక్టర్ తప్పిదమేనని.. అలాంటి వారికి అతి తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇచ్చిన పర్చేజింగ్ కమిటీదో.. లేకపోతే టీటీడీ పెద్దలదో అయి ఉంటుంది. ఇక్కడ పార్టీల ప్రస్తావన రాదు. కానీ వచ్చేలా చేయడానికి టీడీపీ, జనేసన చాలా సింపుల్ ట్రాప్ వేశారు. ఆ ట్రాప్ లో వైసీపీ, జగన్ పడిపోయారు. పలితంగా.. తిరుమలలో తప్పు జరిగిందని  భావిస్తున్న ప్రతి ఒక్కరూ జగన్ వైపే చూస్తున్నారు. 

హీరోయిన్ జెత్వానీపై ముగ్గురు ఐపీఎస్‌ల కుట్ర - కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

సున్నితమై అంశంలో వ్యూహాత్మక తప్పిదాలు ! 

వైసీపీకి చాలా మంది రాజకీయల సలహాదారులు ఉన్నారు. అయితే వీరంతా లడ్డూ కల్తీ ఆరోపణల విషయంలో  చంద్రబాబు చేసిన  రాజకీయ వ్యాఖ్యల వ్యూహం ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. కానీ వైసీపీ ఆవేశంగా  స్పందించింది. లాజికల్ గా వివరణ ఇవ్వడానికన్నా ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా ఈ వివాదం వైల్డ్ ఫైర్ లా అంటుకుంది. ఇప్పుడు విచారణ జరగడం ఖాయం. అందులో కల్తీ కూడా తేలడం ఖాయం. ఇతర విషయాలు కూడా  బయటకు వస్తాయి. ఇప్పటికే దర్శనాల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రచారం జరుగుతోంది. ఇలా వచ్చే ప్రతి అంశాన్ని ఇక వైసీపీకి, జగన్ కే ముడిపెడతారు. వైసీపీ సమాధానాలు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ట్రాప్‌లో ఇరుక్కుపోయారు. లడ్డూ వివాదాన్ని తమపై వేసేసుకున్నారు. ఇక జరగబోయే రాజకీయంలో సర్వైవల్ స్టెప్స్ తెలివిగా వేయాల్సి ఉంటుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget